కన్న తండ్రిని పెళ్లి చేసుకున్న కూతురు, నాలుగో భార్యగా ఉండేందుకు ఒప్పేసుకుందట
Pakistan Girl: పాకిస్థాన్‌లో ఓ యువతి కన్న తండ్రినే పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
పాకిస్థాన్‌లో వింత ఘటన..
పాకిస్థాన్‌లో ఓ తండ్రి తన కూతురినే పెళ్లి చేసుకున్నాడు. బలవంతం చేసో, బెదిరించో కాదు. తన కూతురి అంగీకారంతోనే ఒక్కటయ్యారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ తండ్రికి ఇది నాలుగో పెళ్లి. అంటే...కూతురే ఆమెకి నాలుగో భార్య అన్నమాట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. "వీళ్లేంట్రా బాబు" అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ వీళ్లు ఎందుకిలా చేశారు..? కారణం తెలిస్తే "బాబోయ్" అంటారు. వీళ్లిద్దరి పెళ్లికీ కూతురి పేరే కారణమట. పాకిస్థాన్‌లో ఏ ఏరియాలో ఇది జరిగింది..? ఎవరు వీడియో తీశారు..? అన్న వివరాలైతే తెలియదు. కానీ...ఇప్పుడీ వార్త వైరల్ అవుతోంది. కొందరు ఇదేం పెళ్లి అని తిట్టిపోస్తున్నారు. ఎందుకిలా చేశారని కొందరు అడిగితే..ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. ఆమె పేరు రబియా (Rabiya). ఈ రబియా అనే పదం అరబిక్‌లోని అరబు నుంచి పుట్టింది. అరబిక్‌లో రబియా అంటే నాలుగు అని అర్థం. కొందరు ముస్లింలు నాలుగో సంతానంగా అమ్మాయి పుడితే రబియా అని పేరు పెట్టుకుంటారు. కానీ...ఈ అమ్మాయి మాత్రం తన తండ్రికి రెండో సంతానం. అయినా తండ్రి ఆ పేరు పెట్టాడు. తన పేరుకి జస్టిఫికేషన్ లేదని తెగ ఫీల్ అయిపోయింది ఆ అమ్మాయి.
"నాకు తెలిసినంత వరకూ రబియా అనే పేరుతో ఉన్న వాళ్లంతా నాలుగో సంతానమే. కానీ నేను మాత్రం మా నాన్నకి రెండో కూతుర్ని. మరి నా పేరుకి జస్టిఫికేషన్ ఉండాలిగా. ఏం చేయాలా అని ఆలోచించాను. మా నాన్నకి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నేనే మా నాన్నని పెళ్లి చేసుకుని నాలుగో భార్యగా ఉండాలనుకున్నాను. అలాగైనా నా పేరు (రబియా)కి న్యాయం చేసినట్టు అవుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను"
Daughter justifying being 4th wife of her father pic.twitter.com/7vOrjGuBDD
— Hemir Desai (@hemirdesai) July 6, 2023
- రబియా
ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవడమే కాకుండా పెద్ద డిబేట్ కూడా జరుగుతోంది. ఇలాంటివి ఎలా ఎంకరేజ్ చేస్తారని కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. అందుకే చదువుకోవాలి అనేది అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
Also Read: పాకిస్థాన్ మహిళ ఇండియా కుర్రాడు, ఈ పాన్ వరల్డ్ లవ్‌స్టోరీలో ఎన్ని ట్విస్ట్‌లో