అన్వేషించండి
Advertisement
వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్
Pakistan Elections: వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
Pakistan Elections:
వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
The Election Commission of Pakistan (ECP) announced that general elections would be held in the last week of January 2024, reports Pakistan's Dawn News. pic.twitter.com/4nDyyJX5KG
— ANI (@ANI) September 21, 2023
ఇప్పటికే నియోజకవర్గాల పునర్విభజన పూర్తైంది. సెప్టెంబర్ 27న తొలి జాబితాను విడుదల చేయనుంది. ఆ తరవాత ఈ జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని ప్రకటించనుంది. ఈ లిస్ట్‌పై అన్ని వాదనలూ ముగిసిన తరవాత ఈ ఏడాది నవంబర్ 30 తుది జాబితాను విడుదల చేయనుంది. దాదాపు 54 రోజుల పాటు ఎన్నికల ప్రచారం జరగనుంది. ఆ ప్రకారం షెడ్యూల్ విడుదల చేయనుంది. ఆగస్టు 9వ తేదీన పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీని రద్దు చేశారు. ఆ సమయంలోనే ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని వెల్లడించారు. జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన తేలిన తరవాతే ఎన్నికలు నిర్వహిస్తారని చెప్పారు. నిజానికి నేషనల్ అసెంబ్లీ రద్దు చేసిన తరవాత 90 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ...ఇప్పుడు ప్రకటించిన తేదీ చూస్తుంటే ఆలస్యంగానే ఎన్నికలు జరగనున్నట్టు స్పష్టత వచ్చింది. కొన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రక్రియకు కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. కానీ...పార్టీల ఒత్తిడి కారణంగా త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
హైదరాబాద్
క్రైమ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion