అన్వేషించండి

Pakistan PM Shehbaz Sharif: పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణం, వరుసగా రెండోసారి బాధ్యతలు!

పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు స్వీకరించారు.

Shehbaz Sharif Elected as PM: ఇస్లామాబాద్: పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ 24వ ప్రధానిగా ప్రధానిగా ప్రమాణం చేసిన షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు స్వీకరించారు. పాక్ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అరెస్ట్ తరవాత షెహబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. దాదాపు 16 నెలల పాటు పాకిస్థాన్‌కి ప్రధానిగా సేవలు అందించిన ఆయనతో ప్రెసిడెంట్ ఆరిఫ్ అల్వీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, షెహబాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆగస్టులో పాక్ పార్లమెంట్‌ రద్దు
గతేడాది ఆగస్టులో పాక్ పార్లమెంట్‌ రద్దు అయింది. గత నెలలో ఎన్నికలు జరిగాయి. కూటమిలోని పార్టీలు షెహబాజ్‌కే మరోసారి ప్రధాని బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించాయి. మొత్తం 265 మంది ఉన్న జనరల్ అసెంబ్లీలో ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ PTI కి మద్దతునిచ్చిన 93 మంది స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ PML-N పార్టీ (Pakistan Muslim League-Nawaz ) 75 సీట్లు గెలుచుకుంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ 52 చోట్ల విజయం సాధించింది. ప్రధాని పదవికి జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించగా పీటీఐ సభ్యులు ఆందోళనకు దిగారు. చివరికి 201 మంది నేతలు షెహబాజ్‌ షరీఫ్‌కి అనుకూలంగా ఓటు వేశారు. పీటీఐ మద్దతు తెలిపిన నేత ఓమర్ ఆయుబ్ ఖాన్ ఓటింగ్‌లో ఓటమిచెందారు.

అనూహ్యంగా వెనక్కి తగ్గిన నవాజ్ షరీఫ్.. 
వాస్తవానికి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ మరోసారి ప్రధానిగా ఎన్నికవుతారని అంతా ఊహించారు. అనూహ్యంగా ఆయన సోదరుడు షెహబాజ్ షరీఫ్‌ తెరపైకి వచ్చారు. పూర్తి స్థాయిలో మెజార్టీ రాకపోవడం వల్ల మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపేందుకు నవాజ్ షరీఫ్ పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. కేవలం 80 సీట్లే రావడం వల్ల మిగతా పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2022లో పాకిస్థాన్ ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ తప్పుకున్న తరవాత షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు పాక్ లో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. షెహబాజ్ షరీఫ్ చాలా పద్ధతిగా ఆ పరిస్థితులను డీల్ చేశారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. IMF నుంచి బెయిల్ అవుట్ తెప్పించుకోడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారని తెలిసిందే. ప్రధాని పదవి చేపట్టకముందు అతి పెద్ద ప్రావిన్స్ పంజాబ్‌కి 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. నాయకత్వ లక్షణాలు ఉండటంతో మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకున్నారు.

పాకిస్థాన్​ఎన్నికల ప్రక్రియను `మదర్​ ఆఫ్ ఆల్ రిగ్గింగ్` అని ప్ర‌స్తుతం జైల్లో ఉన్న‌ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, అందువల్లే నవాజ్ షరీఫ్ అనుకూల కూటమి విజయం సాధించిందన్నారు. ప్రస్తుతం పలు కేసుల్లో దోషిగా శిక్ష ఎదుర్కొంటున్న ఇమ్రాన్​ఖాన్​ను ఆయన సోదరి అలీమా జైలులో కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ మెస్సేజ్‌ను వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్‌ చీఫ్‌గా ఉన్న పీటీఐని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ర‌ద్దు చేసింది. ఎన్నిక‌ల సంఘం కూడా పీటీఐకి గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేయడంతో ఇమ్రాన్ మ‌ద్ద‌తుదారులు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారని తెలిసిందే.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP DesamPushpa Day 4 Collections | రోజు రోజుకూ కలెక్షన్లు పెంచుకుంటున్న పుష్ప 2 | ABP DesamPushpa 2 Breaking all Bollywood Records | హిందీ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పుష్ప కలెక్షన్లు | ABP Desamఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Complaint Against Manoj: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు
Nagababu:వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
వీడిన సస్పెన్స్ - ఏపీ కేబినెట్ లో మెగా బ్రదర్ నాగబాబుకు కీలక పదవి
Revanth Reddy Key Decisions: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన - 9 మంది ప్రముఖులకు రూ.1 కోటి నగదు, ఇంటి స్థలం
Best Selling SUV: ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీ ఇదే - నెక్సాన్, పంచ్, బ్రెజాలను వెనక్కి తోసేసిన కారు ఇదే!
Manchu Family Issue: కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
కుటుంబసభ్యులపై మనోజ్ ఫిర్యాదు చేయలేదు - దాడి చేసింది గుర్తు తెలియని వ్యక్తులు - పోలీసుల కీలక ప్రకటన
ICC Punishment: సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
సిరాజ్ కి షాకిచ్చిన ఐసీసీ, శిక్ష ఖరారు- ట్రావిస్ హెడ్ కు మందలింపు
UPSC Mains Result 2024: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 'మెయిన్' ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Embed widget