By: ABP Desam | Updated at : 08 Apr 2022 08:08 PM (IST)
జిల్ బైడెన్‌ను టార్గెట్ చేసిన పాకిస్థాన్
పాకిస్థాన్ గూడచారి సంస్థ ఐఎస్‌ఐ భారీ కుట్రను ఛేదించింది అమెరికా. ఏకంగా అధ్యక్షుడి ఫ్యామిలీనే టార్గెట్‌గా చేసుకొన్నట్టు విచారణలో తేలింది.
ఐఎస్‌ఐ కోసం అమెరికాలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా నకిలీ ఐడీలతో ఎఫ్‌బీఐ అధికారులుగా తిరుగుతూ భారీ కుట్రకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
ఐఎస్‌ఐతో కలిసి పని చేస్తున్న అరియన్ తాహిర్‌జాదే, హైదర్ అలీ... ఎఫ్‌బీఐ అధికారులుగా కలరింగ్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడి భార్య, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సెక్యూరిటీ వింగ్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. డిపార్ట్‌మెంట్ హోంల్యాండ్ సెక్యూరిటీ యూనిట్‌లో పని చేస్తున్నట్టు తప్పుడు గుర్తింపు కార్డులు సృష్టించారు. 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ అల్లర్ల కేసులో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్నట్టు నమ్మించి టార్గెట్‌ను రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఆమె భద్రతా సిబ్బందిలో ముఖ్యమైన వారితో తరచూ మాట్లాడుతూ జిల్ బైడెన్ రాకపోకలపై ఫోకస్ పెట్టారు.
Two men arrested in alarming plot to give an assault rifle 'gift' to someone on Jill Biden's Secret Service detail https://t.co/axq44Rmx6k
THIS IS PRETTY COOL— kathy b (@Kab1957Kathy) April 8, 2022
EXCLUSIVE: Two fake Homeland agents - one 'with ties to Pakistani intelligence and multiple Iranian visas' - spent 18 months 'infiltrating and buying gifts for Jill Biden's Secret Service detail" https://t.co/jclDysSLEV via @MailOnline
— Political Clown Parade 🇺🇸 (@PoliticalClownP) April 8, 2022
అమెరికా ప్రథమ మహిళతోపాటు ఎఫ్‌బీఐ, డీహెచ్‌ఎస్, యూఎస్‌ఎస్‌ఎస్ సిబ్బంది ఉండే పల్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది. వీళ్లు వైట్‌హౌస్‌లో పని చేస్తున్న వారిని కూడా బోల్తా కొట్టించి తమవైపు తిప్పుకున్నట్టు విచారణలో వెల్లడైంది.
వైట్‌హౌస్, ఇతర నిఘా విభాగల్లో పని చేస్తున్న వారికి ఖరీదైన బహుమతులు ఇస్తూ వారిని వశపరుచుకున్నారు. జిల్ బైడెన్ సెక్యూరిటీ విభాగంలో పరని చేసే వారికి గిఫ్ట్‌లు ఇచ్చి పీఆర్ మెంటయిన్ చేశారు.
కేసు విచారణలో భాగంగా ఈ ఇద్దరి నిందితులతో సన్నిహత సంబంధాలు నెరిపిన నలుగుర్ని అధికారులు సెలవుపై పంపించినట్టు తెలుస్తోంది. నిందితుల వద్ద భారీగా పాకిస్థాన్, ఇరాన్ విసాలు ఉన్నట్టు గుర్తించారు.
Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?
Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!
మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్! సర్వేల్లో బైడెన్ కన్నా ఎక్కువ పాయింట్స్
India Canada News: భారత్‌తో బంధం మాకెంతో కీలకం, కానీ.. - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్
Tesla Optimus : 'నమస్తే', యోగా చేసిన టెస్లా రోబో ఆప్టిమస్
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?
/body>