Putin gift to Kim: యూఎన్‌వో ఆంక్షలు కాదని కిమ్‌కు పుతిన్ కానుక- మరో అంతర్జాతీయ వివాదం!
ఇద్దరికి ఇద్దరే! అనేలా వ్యవహరించే నాయకులు ఉత్తరకోరియాఅధినేత కిమ్, రష్యా అధ్యక్షుడు పుతిన్. కాకపోతే.. కొరియా కంటే రష్యా కొద్దిగా బెటర్ అంటారు. అయితే, పుతిన్.. కిమ్‌కు బహుమానం ఇచ్చారు.

Kim Jong Un Receives Gift From Putin : ఇద్దరికి ఇద్దరే! అనేలా వ్యవహరించే నాయకులు ఉత్తరకోరియా(North korea) అధినేత కిమ్(Kim), రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్(Putin). కాకపోతే.. ఉత్తరకొరియా కంటే రష్యా కొద్దిగా బెటర్ అంటారు. కానీ, ఇద్దరూ కూడా సర్వంసహా చక్రవర్తులమనే స్టయిల్‌లోనే వ్యవహరిస్తారు. తమను ఎదిరించిన వారు ఎంతటి వారైనా.. సరే ప్రాణాలతో ఉండేందుకు వీరు ఇష్టపడరనేది ప్రపంచ దేశాల విశ్లేషణ. అటు ఉత్తరకొరియాలో అయితే.. సొంత బంధువులనే కిమ్ కడతేర్చారని అంటారు. ఇక, పుతిన్ పై కూడా ఇలాంటి ఆరోపణలు కోకొల్లలు. తాజాగా రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ ఉదంతం ఇంకా రగులుతూనే ఉంది. ఇదిలావుంటే.. ఈ రెండు దేశాలపైనా అంతర్జాతీయ(International) ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచ దేశాలను భయోత్పాతానికి గురి చేసేలా కిమ్ చేపడుతున్న మిస్సయిళ్ల ప్రయోగం, పుతిన్ ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుండడాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, వారు మాత్రం తాము చేసింది..సరైందేనని సమర్థించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం తెరమీదికి వచ్చింది.
కారు కానుక!
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un)కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)ఓ కారును బహుమతిగా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాలకు వాడుకునేందుకే దాన్ని ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఫిబ్రవరి 18న కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ ఛోన్ సదరు అధునాతన సౌకర్యాలు ఉన్న హై ఎండ్ కారును అందుకున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు తెలియజేశారని తెలిపింది. ఇరువురు నేతల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది.
Also Read: ఉద్యోగులు సమ్మె బాట- మూతపడ్డ ఈఫిల్ టవర్!
ఇరువురూ గట్టి పిండాలే!
రష్యా (Russia), ఉత్తరకొరియాపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ.. కిమ్ కానీ, పుతిన్ కానీ ఎవరినీ లక్ష్యం పెట్టడం లేదు. దీంతో ఇద్దరికి ఇద్దరూ గట్టిపిండాలే అనే టాక్ వినిపిస్తూ ఉంటుంది. గత సెప్టెంబర్‌లో పుతిన్, కిమ్ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యాకు ఉత్తర కొరియా సహకరిస్తోందన్నది బహిరంగ రహస్యం. రాకెట్లు, క్షిపణులు సహా పలురకాల ఆయుధాలను సరఫరా చేస్తున్నట్లు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఆరోపిస్తోంది.
ఎందుకు ఇచ్చినట్టు?
తాజాగా పుతిన్.. కిమ్‌కు కారును కానుకగా ఇవ్వడం ఎందుకు? అనేది చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం పుతిన్ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధంఆయనకు తలకుమించిన భారంగా ఉంది. మరోవైపు విపక్ష నేత మరణం మరింతగా ప్రపంచ దేశాల ముందు వీక్ చేసింది. ఈ నేపథ్యంలో తనను సమర్థిచే వారు.. దన్ను ఉండే దేశాలు కరువయ్యాయి. వీటిని గమనించిన పుతిన్ కిమ్‌ను మరింత మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన ఉంది. వ్యక్తిగతంగా కిమ్ (Kim Jong Un)కు వాహనాలంటే చాలా ఇష్టమట. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు `ఆరస్ సెనేట్ లిమోసిన్`ను కిమ్ ఆసక్తిగా పరిశీలించారు. ఆయన ఆసక్తిని గమనించి పుతిన్.. కిమ్‌ను కారులో ఎక్కించుకుకొని స్వయంగా పుతిన్ డ్రైవ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సైతం నెట్‌లో హల్చల్‌చేశాయి. అయితే, కిమ్ దగ్గర మెర్సిడెస్, రోల్స్ రాయిస్, మేబ్యాక్, లెక్సస్‌కు చెందిన పలు లగ్జరీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన వద్ద కారు లాంటిదాన్నే పుతిన్ తాజాగా కిమ్‌కుకానుకగా అందించారు. ఇది .. భారత కరెన్సీలో 450 కోట్ల రూపాయలపైగా ఉంటుందని అంచనా.
పుతిన్‌కు మరింత ఉచ్చు..
కారు కానుకగా పంపించిన పుతిన్ మరో ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే.. అధునాతన కార్లను ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐక్యరాజ్యసమితి(United Nations Organisation) రెండేళ్ల కిందటే నిషేధం(Ban) విధించింది. తాజాగా పుతిన్ కారు పంపడం ఈ ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: అలుపెరగని పోరాట యోధుడు - పుతిన్ పై ధిక్కార స్వరానికి మారుపేరు నావల్నీ, ఇదీ కథ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

