Most Peaceful Country: ప్రపంచంలోనే ప్రశాంతమైన దేశంగా ఐస్‌లాండ్, మరి భారత్ స్థానమేంటో తెలుసా?
Most Peaceful Country: ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన దేశంగా మరోసారి ఐస్‌లాండ్ నిలిచింది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది.
Most Peaceful Country: ఐస్ ల్యాండ్ ప్రశాంతతకు మారుపేరు. ఆ పేరును మరోసారి నిలుపుకుంది ఆ దేశం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని ఈ ద్వీప దేశం గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో మొదటి ర్యాంకు సాధించింది. తాజాగా నిర్వహించిన సర్వే ప్రకారం ఐస్‌లాండ్ మరోసారి మోస్ట్ పీస్‌పుల్ కంట్రీగా నిలిచింది. ఆ జాబితాలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది ఐస్‌లాండ్. వరుసగా 15వ సారి ఐస్‌లాండ్ మోస్ట్ పీస్ పుల్ కంట్రీగా నిలవడం గమనార్హం. మూడు కారణాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో టాప్ టెన్ లో యూరోప్ కు చెందిన 7 దేశాలు ఉన్నాయి. ఈ ర్యాంకులను ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలిచింది. అయితే అగ్ర దేశం అమెరికా 131 వ స్థానంలో నిలవడం గమనార్హం. మిలిటరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్న అగ్ర రాజ్యంలో శాంతి వాతావరణం కొరవడినట్లు తన గ్లోబల్ పీస్ ఇండెక్స్ రిపోర్టులో పేర్కొంది ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. అలాగే గత ఏడాది కాలం నుంచి భారత్ లో ప్రశాంతత పెరిగిందని... 3.5 శాతం పీస్‌ఫుల్‌నెస్ పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.
పీస్ ఫుల్ దేశాల జాబితాలో ఐస్ లాండ్ తర్వాత రెండో స్థానంలో డెన్మార్క్ నిలిచింది. ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రియా, సింగపూర్, పోర్చుగల్, స్లోవేనియా, జపాన్, స్విట్జర్లాండ్ దేశాలు వరుస క్రమంలో టాప్ టెన్ లో ర్యాంకులు సాధించాయి. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ తన సూచీలో మొత్తం 163 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. అందులో అమెరికా 131 వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంగా అగ్రరాజ్యంలో హత్యల రేటు పెరిగిపోయినట్లు తన నివేదికలో పేర్కొంది ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్. దేశీయంగా, అంతర్జాతీయంగా ఉన్న సంక్షోభాలు, సమాజ భద్రత, సైన్యాన్ని పెంచుకుంటున్న తీరు ఆధారంగా ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ జాబితాను తయారు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాదితో పోలిస్తే శాంతియుత వాతావరణం స్వల్పంగా తగ్గినట్లు రిపోర్టులో పేర్కొనగా.. భారత్ సహా కొన్ని దేశాల్లో ప్రశాంతత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.
ఏ దేశంలో ఏ స్థానంలో నిలిచిందంటే..
1. ఐస్‌లాండ్
2. డెన్మార్క్
3. ఐర్‌లాండ్
4. న్యూజిలాండ్
5. ఆస్ట్రియా
6. సింగపూర్
7. పోర్చుగల్
8. స్లోవేనియా
9. జపాన్
10 స్విట్జర్లాండ్
.
.
37. యూకే
.
.
79. నేపాల్
80. చైనా
88. బంగ్లాదేశ్
.
.
107. శ్రీలంక
119. సౌదీ అరేబియా
126. భారత్
131. అమెరికా
146. పాకిస్థాన్
149. నార్త్ కొరియా
.
.
155. సూడాన్
160. సౌత్ సూడాన్
163. అప్ఘానిస్తాన్
🌏The 10 most peaceful countries in the world
— IEP Global Peace Index (@GlobPeaceIndex) July 2, 2023
Iceland
Denmark
Ireland
New Zealand
Austria
Singapore
Portugal
Slovenia
Japan
Switzerland
🗺️View the map and investigate the data https://t.co/ieTEZsSJdc pic.twitter.com/fmjCkj8mT8
North Korea is at its most peaceful level since 2010. pic.twitter.com/GYGElNmFfR
— IEP Global Peace Index (@GlobPeaceIndex) July 7, 2023
Join Us on Telegram: https://t.me/abpdesamofficial