By: ABP Desam | Updated at : 08 Apr 2022 05:52 PM (IST)
ఉక్రెయిన్ రైల్వేస్టేషన్‌పై రష్యా రాకెట్ దాడి
తూర్పు ఉక్రేనియన్ నగరం క్రామాటోర్స్క్‌లోని ప్యాక్డ్ రైలు స్టేషన్‌పై రష్యా దాడి చేసింది. రాకెట్‌తో చేసిన ఈ దాడిలో 35 మంది వరకు రాకెట్ దాడిలో కనీసం 35 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. పౌరులను ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పు ఈ దాడి జరిగిందని రాయటర్స్ సంస్థ పేర్కొంది.
#BREAKING Russian defence ministry accuses Kyiv of deliberately targeting train station in eastern Ukraine city of Kramatorsk pic.twitter.com/FRkSvpmec1
— AFP News Agency (@AFP) April 8, 2022
వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళలు, పిల్లలు, వృద్ధులు సిద్ధంగా ఉన్న టైంలో దాడి జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెండు రాకెట్లను వెంటవెంటనే రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ చెబుతోంది.
"రెండు రాకెట్లు క్రమాటోర్స్క్ రైల్వే స్టేషన్‌ను తాకాయి. క్రామాటోర్స్క్ రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడిలో 30 మందికిపైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు"అని ఉక్రేనియన్ రైల్వేస్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని ఉక్రెయిన్ రైల్వే హెడ్ తెలిపారు.
రైల్వే స్టేషన్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్న క్షిపణులను ఉక్రెయిన్ సైన్యం మాత్రమే ఉపయోగించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంస్థ పేర్కొంది.
క్షిపణులు తాకినప్పుడు వేల మంది ప్రజలు స్టేషన్‌లో ఉన్నారని డొనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్లో కైరిలెంకో పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో దాదాపు 4,000 మంది స్టేషన్‌లో ఉన్నారని క్రమాటోర్స్క్ మేయర్ ఒలెక్సాండర్ హోంచారెంకో తెలిపారు.
The missile attack this morning on a train station used for evacuations of civilians in Ukraine is despicable.
— Ursula von der Leyen (@vonderleyen) April 8, 2022
I am appalled by the loss of life and I will offer personally my condolences to President @ZelenskyyUa
My thoughts are with the families of the victims.
"రష్యన్ ఫాసిస్టులు వారు ఎక్కడ లక్ష్యంగా పెట్టుకున్నారో, వారికి ఏమి కావాలో బాగా తెలుసు: ప్రజల్లో భయాందోళనలు కలిగించాలని కోరుకున్నారు, వారు వీలైనంత ఎక్కువ మంది పౌరుల ప్రాణాలు తీయాలని చూస్తున్నారు." మేయర్ ఒలెక్సాండర్ పేర్కొన్నారు.
కైరిలెంకో తన సోషల్ మీడియాలో కుప్పల తెప్పలుగా పడి ఉన్న బ్యాగులు, ఇతర వస్తువులు.. పక్కనే పడి ఉన్న మృతదేహాలను చూపించే ఫోటోను షేర్ చేశారు. ఫ్లాక్ జాకెట్లు ధరించిన సాయుధ పోలీసులు వారి పక్కన నిలబడ్డారు.
"అమానవీయమైన రష్యన్లు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. యుద్దభూమిలో ఎదురొడ్డి నిలబడే శక్తి లేకుండా, పౌర జనాభాను నాశనం చేస్తున్నారు" అని ఉక్రియాన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కామెంట్ చేశారు.
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
TS TET 2022 Exam Date: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్