అన్వేషించండి

ChatGPT: చాట్ జీపీటీ వాడితే మెదడుకు డేంజర్ - సంచలనం సృష్టిస్తున్న ఎంఐటీ పరిశోధన

AI: చాట్ జీపీటీ వాడితే బుర్రలో గుజ్జు తగ్గిపోతుందని ఎంఐటీ పరిశోధనలో తేలింది. తాత్కాలికంగా లాభం కలిగినా దీర్ఖకాలంగా అలాంటి ఏఐ సాధనాలు తీవ్ర నష్టం చేస్తాయని అంచనా వేశారు.

MIT research shows Chat GPT Effect on brain :  ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. తాము చేసే పనుల్లో వాటిని ఉపయోగిస్తున్నారు. చాట్ జీపీటీ , గ్రోక్ వంటివి ఉపయోగిస్తున్నారు.  అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్  మానవాళికి ఎంత మేలు చేస్తుందో  .. అంత కంటే ఎక్కువ కీడు చేస్తుందని  మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో తేలింది.  చాట్‌జీపీటీ వంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సాధనాలను ఉపయోగించడం వల్ల విద్యార్థుల మెదడు  ఆలోచించడం తగ్గుతుందని, దీర్ఘకాలికంగా క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, జ్ఞాపకశక్తి బలహీనపడే అవకాశం ఉందని పరిశోధన తేల్చింది.  

వివిధ వయసుల్లో ఉన్న వారిని మూడు గ్రూపులుగా చేసి ఎంఐటీ శాస్త్రవేత్తల పరిశోధన          

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ   శాస్త్రవేత్తలు  18 నుండి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిని మూడు గ్రూపులుగా విభజించాచు. వీరిలో ఓ గ్రూపును చాట్ జీపీటీని ఉపయోగించి వ్యాసాలు రాయమన్నారు. మరో గ్రూప్ ను గూగుల్ వంటివి ఉపయోగించుకుని వ్యాసాలు రాయమన్నారు. మూడో గ్రూపును సొంతంగా తమ నాలెడ్జ్ ఉపయోగించుకుని వ్యాసాలు రాయమన్నారు. ఇలా రాసినప్పుడు వారి బ్రెయిన్ ను పూర్తి స్థాయిలో మ్యాపింగ్ చేసి కదలికల్ని గుర్తించేదుకు ఏర్పాట్లు చేశారు. వారు రాసిన తర్వాత ఫలితాలను విశ్లేషించారు.   

చాట్ జీపీటీ వాడే  వారిలో మొదడు కణాలు పని చేయడం తక్కువ !

ఆ ఫలితాల్లో చాట్‌జీపీటీ వినియోగదారుల మెదడు కదలికల్లో  అతి తక్కువ న్యూరల్ కనెక్టివిటీ ఉన్నట్లుగా గుర్తించారు.  ముఖ్యంగా జ్ఞాపకశక్తి, శ్రద్ధ, క్రియేటివ్ ఆలోచనకు సంబంధించిన నాడుల్లో కదలిక లేదు. అదే సమయంలో సెర్చ్ ఇంజిన్ వినియోగించిన వారు మెదడులో కాస్త కదలిక ఉంది.  గూగుల్ వినియోగదారులు సమాచారాన్ని వెతకడం,విశ్లేషించడం వంటివి చేస్తారు.  అయితే ఎటువంటి సాధనాలు లేని వారు అత్యధిక న్యూరల్ కనెక్టివిటీని చూపించారు. అదే సమయంలో చాట్ జీపీటీ ఉపయోగించిన వారు దాదాపుగా ఒకే రకమైన వ్యాసాలు రాశారు.  సెర్చ్ ఇంజన్ ,  బ్రెయిన్-ఓన్లీ గ్రూప్‌లలో కేవలం 10-11 శాతం మంది మాత్రమే ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. చాట్ జీపీటీ ఉపపయోగించి రాసిన వారి వ్యాసాల్లో సోల్ లేదని ..  వాటిని ఎసెస్ చేసిన ఉపాధ్యాయులు తేల్చారు.                 

త్వరగా పని చేయవచ్చు కానీ.. ఫలితం ఉండదు! 

చాట్‌జీపీటీ వంటి AI సాధనాలు త్వరగా పని చేయడానికి ఉపయోగపడతాయి. కానీ డీప్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్‌ను అడ్డుకుంటాయి. పిల్లల మెదడును ఇవి ఎదగకుండా చేస్తున్నాయి. అంటే MIT అధ్యయనం చాట్‌జీపీటీ వంటి AI సాధనాలు స్వల్పకాలిక సౌలభ్యాన్ని అందిస్తాయని, కానీ దీర్ఘకాలికంగా మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత,  క్రిటికల్ థింకింగ్‌ను క్షీణింపజేస్తాయని స్పష్టంగా చూపిస్తుంది. అందుకే చాట్ జీపీటీ లాంటి ఏఐ సిస్టమ్స్ ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి అలవాటు పడకుండా.. ఏదైనా సొంతంగా పని చేసుకుంటేనే మంచిది. 

 

టాప్ హెడ్ లైన్స్

US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Medicine Nobel Prize: మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
మెడిసిన్ విభాగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. ఒక్కో విజేతకు ప్రైజ్ మనీ ఎంతంటే 
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Meets PM Modi: ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
ప్రధాని మోదీ, అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ - ఎన్నికల కమిషన్ అంశంపై చర్చించారా?
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Trump TV Ads: అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
అమెరికాలో కొత్త వివాదం.. ప్రజాధనతో టీవీ యాడ్స్.. డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాట్ల దావా
Kanpur Fraud Case: ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
ప్రేమ పెళ్లి పేరుతో థాయ్ మహిళను చీటింగ్.. రూ. 60 లక్షలు దోచేసిన కాన్పూర్ వ్యాపారి
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Embed widget