News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

సౌతాఫ్రికాలో ఘోర అగ్ని ప్రమాదం, బిల్డింగ్‌లో ఉన్నట్టుండి మంటలు - 63 మంది మృతి

Johannesburg Fire Accident: జొహన్నస్‌బర్గ్‌లో ఐదంతస్తుల బిల్డింగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.

FOLLOW US: 
Share:

Johannesburg Fire Accident: 

ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం..

సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 5 అంతస్తుల భవనంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 63 మంది అగ్నికి ఆహుతయ్యారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పొగ కారణంగా చాలా మంది ఊపిరాడక ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటి వరకూ 63 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఒక్కో ఫ్లోర్‌ వారీగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేందుకు ఇంకా సమయం పట్టే అవకాశముందని తెలిపారు. పూర్తిగా కాలిపోయిన మృత దేహాలను వెలికి తీసి వీధిలోనే ఉంచాల్సి వస్తోంది. ఆంబులెన్స్‌లు వరుసగా వచ్చి డెడ్‌బాడీస్‌ని తీసుకెళ్తున్నాయి. స్థానికంగా ఈ ఘటన ఆందోళన కలిగించింది. అయితే...ఈ ప్రమాదానికి కారణమేంటన్నది ఇంకా తెలియలేదు. అర్ధరాత్రి ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్టు స్థానికులు వెల్లడించారు. ప్రస్తుతానికి బిల్డింగ్‌ని ఖాళీ చేయించారు. చాలా మంది భవనంలోనే చిక్కుకుపోయి ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతమంతా పోలీసుల మొహరించారు. ఇదో అక్రమ నిర్మాణం అని ఇప్పటికే అధికారులు తేల్చి చెప్పారు. జూన్‌లోనూ ఇదే జొహన్నస్‌బర్గ్‌లో ఓ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. 

Published at : 31 Aug 2023 01:18 PM (IST) Tags: Johannesburg South Africa Johannesburg Fire Accident Johannesburg Fire

ఇవి కూడా చూడండి

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

Khalistani Issue: ఖలిస్థానీ ఉగ్రవాది అర్ష్‌దీప్‌కు లష్కరే తోయిబాతో సంబంధాలు?

Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!

Disease X: దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మరో మహమ్మారి, 5 కోట్ల మంది ప్రాణాలు బలి!

మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్! సర్వేల్లో బైడెన్ కన్నా ఎక్కువ పాయింట్స్

మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్! సర్వేల్లో బైడెన్ కన్నా ఎక్కువ పాయింట్స్

India Canada News: భారత్‌తో బంధం మాకెంతో కీలకం, కానీ.. - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్

India Canada News: భారత్‌తో బంధం మాకెంతో కీలకం, కానీ.. - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్

Tesla Optimus : 'నమస్తే', యోగా చేసిన టెస్లా రోబో ఆప్టిమస్‌

Tesla Optimus : 'నమస్తే', యోగా చేసిన టెస్లా రోబో ఆప్టిమస్‌

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!