News
News
X

Lottery Jackpot: ఒక్క రాత్రిలో అద్భుతం- కోహ్లీ, ధోనీ, షారుఖ్‌ సంపదను మించిపోయాడు- అదృష్టమంటే అతనిదే! 

Lottery Jackpot: కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ క్యాస్ట్రో అనే వ్యక్తి లాటరీలో ఏకంగా రూ. 16,900 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే అతను బిలియనీర్ అయిపోయాడు.

FOLLOW US: 
Share:

 Lottery Jackpot:  అదృష్టం... ఎప్పుడు, ఎలా, ఎవరి తలుపు తడుతుందో తెలియదు. ఒక్కసారి లక్ కలిసివస్తే నిరుపేదలు కూడా కోటీశ్వరులైపోతారు. చేతిలో చిల్లిగవ్వ లేనివారు కోట్లకు పడగలెత్తుతారు. అలాంటి అదృష్టం ఎవరి జీవితంలో అయినా ఒకేసారి వస్తుంది. అలాంటి అదృష్టమే ఇప్పుడు ఒక వ్యక్తిని అకస్మాత్తుగా బిలియనీర్ ని చేసేసింది. ఒక్క రాత్రిలో కోహ్లీ, ధోనీ, షారుఖ్ ఇలా ఎందరో సెలబ్రిటీల కన్నా ఎక్కువ సంపాదనపరున్ని చేసింది. మరి ఈ కథాకమీషు ఏమిటో తెలుసుకోవాలనుందా..

రూ. 16,900 కోట్ల రూపాయల లాటరీ

ఒక న్యూస్ వెబ్ సైట్ ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ఎడ్విన్ క్యాస్ట్రో అనే వ్యక్తి లాటరీలో ఏకంగా రూ. 16,900 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. దీంతో రాత్రికి రాత్రే అతను బిలియనీర్ అయిపోయాడు. ఎడ్విన్ గెలుచుకున్న డబ్బు లాటరీ చరిత్రలోనే అత్యధికం అని నివేదికలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఎడ్విన్ సంపాదనలో.. విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, షారుఖ్ ఖాన్ ఇలా ఇంకా ఎంతోమంది సెలబ్రిటీల కన్నా ఎంతో ఎత్తులో ఉన్నాడు.  షారుఖ్ ఆస్తుల విలువ రూ. 6,600 కోట్లు కాగా.. విరాట్ కోహ్లీ సంపాదన రూ. 1100 కోట్లు. ఇక భారత్ మాజీ కెప్టెన్ ధోనీ ఆస్తులు రూ. 750 కోట్లు.

డబ్బు తీసుకున్నాడు.. మాయమైపోయాడు 

న్యూస్ వెబ్ సైట్ మెట్రో ప్రకారం.. ఎడ్విన్ 2022 నవంబర్ లో లాటరీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఈ మొత్తం అతనికి అందాలంటే వాయిదా పద్ధతిలో 29 ఏళ్లలో తీసుకోవాలని లాటరీ నిర్వహించిన కంపెనీ తెలిపింది. అయితే ఎడ్విన్ మొత్తం డబ్బు ఒకేసారి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి రూ. 8వేల కోట్లు వచ్చాయి. ఇంత భారీ మొత్తం అందుకున్న ఎడ్విన్ ప్రపంచం ముందుకు రావడంలేదు. కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. డబ్బు అందిన వెంటనే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. లాటరీ ద్వారా ఇంత పెద్ద మొత్తం గెలుచుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనే ఒక చిన్న స్టేట్ మెంట్ మాత్రం ఇచ్చాడు. 

రూ.81 కోట్ల లాటరీ గెలిచాడు ఇక భార్య కోసం వెతుకుతున్నాడు!

జర్మనీకి చెందిన ఓ యువకుడికి ఈ మధ్య కనీవినీ ఎరుగని లాటరీ తగిలించింది. ఏకంగా రూ. 81 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. డార్ట్‌మండ్‌కు చెందిన కుర్సాట్ యిల్డిరిమ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేసే వాడు. కొద్ది రోజుల కిందట లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. వాటి ఫలితాలు వెల్లడి అయ్యాయి. ఇందులో ఏకంగా 9,927,511,60 యూరోలు అంటే భారత కరెన్సీలో రూ. 81 కోట్లు గెలుచుకున్నాడు.

విలాస వంతమైన కార్లు కొనుగోలు చేస్తున్న కుర్సాట్

ఒక్కసారిగా ఊహించని రీతిలో డబ్బులు రావడంతో ఏం చేయాలో కుర్సాట్ కు అర్థం కాలేదు. ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలా? అని రకరకాలుగా ఆలోచించాడు. ముందుగు తను పని చేసే స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాన్ని వదిలేశాడు.  రూ. 3.6 కోట్ల ఫెరారీ 448 పిస్తాను కొనుగోలు చేశాడు. దాంతో పాటు  రూ. 2 కోట్లతో పోర్షే టర్బో ఎస్ క్యాబ్రియోలెట్‌ కొన్నాడు.  ఒక ఖరీదైన వాచ్, అతనికి ఇష్టమైన బూజర్‌ను కూడా కొనుగోలు చేశాడు.

భార్య కోసం అణ్వేషణ, పత్రికల సాయం

Published at : 16 Feb 2023 12:57 PM (IST) Tags: Lottery news Lottery America News Colifornia man wins Huge lottary

సంబంధిత కథనాలు

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

Laxman Narasimhan: స్టార్‌ బక్స్‌ కొత్త సీఈవోగా భారతీయుడు - ఆయన స్పెషాలిటీ ఇదే!

Mysterious Puzzle: ఈ మిస్టరీ పజిల్‌ పరిష్కరిస్తే రెండు కోట్లకుపైగా రివార్డు- మీరు ట్రై చేయండీ!

Mysterious Puzzle: ఈ మిస్టరీ పజిల్‌ పరిష్కరిస్తే రెండు కోట్లకుపైగా రివార్డు- మీరు ట్రై చేయండీ!

US Banks: మూడు బ్యాంకుల దెబ్బకే ఇలా.. సేమ్‌ సీన్‌లో మరో 186 బ్యాంకులు

US Banks: మూడు బ్యాంకుల దెబ్బకే ఇలా.. సేమ్‌ సీన్‌లో మరో 186 బ్యాంకులు

Gautam Adani Networth: 3 వారాల్లో 50% పెరిగిన అదానీ ఆస్తులు, టాప్‌-20 లిస్ట్‌కు ఒక్క అడుగు దూరం

Gautam Adani Networth: 3 వారాల్లో 50% పెరిగిన అదానీ ఆస్తులు, టాప్‌-20 లిస్ట్‌కు ఒక్క అడుగు దూరం

Gold Price Record high: 'గోల్డెన్‌' రికార్డ్‌ - తొలిసారి ₹60 వేలు దాటిన పసిడి

Gold Price Record high: 'గోల్డెన్‌' రికార్డ్‌ - తొలిసారి ₹60 వేలు దాటిన పసిడి

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?