అన్వేషించండి

Kamala Harris: ట్రంప్‌ను ఓడించి తీరుతా- అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ తొలి కామెంట్స్

US Elections 2024: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించి తీరుతాన‌న్నారు క‌మ‌లా హారిస్. బైడెన్‌ను తప్పించి డెమోక్రాట్ అభ్య‌ర్థిగా హారిస్‌ను ప్రకటించిన తర్వాత తొలిసారి స్పందించారు.

Kamala Harris Vs Donald Trump: అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడానికి శ‌క్తి మేర ప‌నిచేస్తాన‌ని, అందుకోసం డెమోక్రాట్‌ల‌ను ఏకం చేస్తాన‌ని క‌మ‌లా హారిస్ ప్ర‌తిజ్ఞ చేశారు. ఆదివారం అక‌స్మాత్తుగా ప్రెసిడెంట్ రేసు నుంచి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు జో బైడెన్ ప్రకటించడంతో వైఎస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హారిస్ డెమోక్రాట్ల త‌ర‌ఫున‌ అభ్య‌ర్థిగా రేసులోకి వ‌చ్చారు. డెమోక్రాట్ అభ్య‌ర్థిగా త‌న‌ను ప్ర‌క‌టిచ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన క‌మ‌లా హారిస్‌, జో బైడెన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

బైడెన్ సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు

ఈ సంద‌ర్భంగా ఆమె ఎక్స్‌లో త‌న సందేశాన్ని పోస్ట్ చేశారు. "దేశ అధ్య‌క్షుడిగా అద్భ‌త‌మైన సేవ‌లందించిన జో బైడెన్‌కు అమెరికా ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ద‌శాబ్దాలు దేశానికి ఆయ‌న అందించిన సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. రిపబ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయ‌న అతివాద ప్రాజెక్ట్ 2025 ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా దేశాన్ని ఏకం చేయ‌డ‌మే త‌న ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. 

జో బైడెన్ అభ్య‌ర్థిత్వంపై ఇటీవ‌ల సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ట్రంప్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లోనూ జో ఘోరంగా వైఫ‌ల్యం చెంద‌డంతో అభ్య‌ర్థిత్వంపై మ‌రోసారి సొంత పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. దాంతోపాటు బైడెన్ (81) వ‌య‌సు కూడా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం, తీవ్ర‌మైన ఒత్తిడితో అల‌సిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో త‌న అభ్య‌ర్థిత్వాన్ని ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు బైడెన్ ప్ర‌క‌టించ‌డంతో క‌మ‌లా హారిస్‌కు మార్గం సుగమం అయ్యింది. క‌మ‌లా హారిస్ తొలి మ‌హిళా ఉపాధ్య‌క్షురాలు. మొద‌టి న‌ల్ల‌జాతి, ద‌క్షిణాసియా సంత‌తికి చెందిన తొలి వైస్ ప్రెసిడెంట్ కూడా ఆమే కావ‌డం విశేషం. 

క‌మ‌లా హారిస్‌కు డెమోక్రాట్ల మ‌ద్ద‌తు

డెమోక్రాట్ల త‌ర‌ఫున అమెరికా అధ్య‌క్ష అభ్య‌ర్థి రేసులో ప‌లువురి పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ క‌మ‌లా హారిస్‌కి జో బైడెన్ మ‌ద్ద‌తు ఉండ‌టం క‌లిసొచ్చే అంశం. వ‌చ్చేనెల చికాగోలో జ‌ర‌గనున్న డెమోక్ర‌టిక్ జాతీయ స‌ద‌స్సులో ప్ర‌తినిధుల ఆమోదం పొందాల్సి ఉంది.    

హారిస్‌కు మాజీ అధ్య‌క్షుడు బిల్ క్లింట‌న్‌, ఆయ‌న స‌తీమ‌ణి హిల్ల‌రీ క్లింట‌న్‌లు ఇప్ప‌టికే త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. భార‌త సంత‌తికి చెందిన మ‌రో డెమోక్రాట్ ప్ర‌మీలా జైపాల్ కూడా హారిస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో ఆగస్టు 19న జ‌ర‌గ‌నున్న ప్ర‌తినిధుల స‌మావేశంలో త‌న అభ్య‌ర్థిత్వానికి ఆమోదం ల‌భించ‌డం సులువుగానే క‌మ‌లా భావిస్తున్నారు.

Also Read:అదిరేటి డ్రెస్ మీరేస్తే - ర్యాంప్ వాక్ చేస్తున్న మోదీ, కిమ్‌ని చూశారా - AI ఫ్యాషన్‌ షో మాయ

Also Read: ప్రెసిడెంట్ రేసు నుంచి బైడెన్ తప్పుకోడానికి కారణాలివేనా?

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బోడుప్పల్‌లో భూపోరాటానికి సిద్ధమైన TRS చీఫ్ కవిత అరెస్ట్! 
బోడుప్పల్‌లో భూపోరాటానికి సిద్ధమైన TRS చీఫ్ కవిత అరెస్ట్! 
Can India Take Back PoJK Legally: PoJK విలీనం కోరుతూ ప్రజా ఉద్యమం - భారత్ కలుపుకోగలదా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
PoJK విలీనం కోరుతూ ప్రజా ఉద్యమం - భారత్ కలుపుకోగలదా? అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Indian Influencer Family: టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్
టిష్యూ పేపర్ల దగ్గరగొడవ - వియత్నాంలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ కుటుంబం వీరంగం - వీడియోలు వైరల్
Donald Trump Order: ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 
ట్రంప్ వలస విధానానికి గట్టి దెబ్బ ! జన్మహక్కు పౌరసత్వంపై ఉత్తర్వు కొట్టేసిన సుప్రీంకోర్టు! 

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
Nara Lokesh: జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
జులై 15 నుంచి టీడీపీ శ్రేణులకు స్పెషల్ టాస్క్‌! కార్యకర్తల ఆర్థిక భరోసాపై నారా లోకేష్ కీలక ప్రకటన!
Gujarat High Court Hindu Marriage: ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
ఏడు అడుగులు వేయని వివాహం చెల్లదు! గుజరాత్ హైకోర్టు సంచనల తీర్పు! దీని ప్రభావం ఎలా ఉంటుంది?
Embed widget