అన్వేషించండి

Strait of Hormuz opens after Iran war: యుద్ధం ముగిసినా పెట్రోల్ ధరలు ఇప్పుడే దిగిరావు - ట్రంప్ చేసిన పని అలాంటిది మరి !

Crude oil prices drop: హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతోంది. అయితే ఇరాన్ యుద్ధం ముగిసినా చమురు సంక్షోభం ఇప్పుడే తీరదు.. ధరల ఉపశమనానికి మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Global oil supply issues 2026:  ఇరాన్ యుద్ధం ముగింపునకు రావడం, అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన  స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్  జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించడం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. అయితే, ఈ ఒప్పందం జరిగినప్పటికీ అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు , పెట్రోల్ ధరలు రాత్రికి రాత్రే దిగిరావని అంతర్జాతీయ ఇంధన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 
 
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు, సరఫరా ఇబ్బందులు కేవలం ఈ ఒప్పందంతోనే వెంటనే పరిష్కారం కాబోవని ఎస్‌అండ్‌ పీ గ్లోబల్ ఎనర్జీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ దేశాల చమురు అవసరాలను తీర్చే స్థాయికి ఇంధన కంపెనీలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుంది. క్రూడ్ ఆయిల్ రవాణా, రిఫైనింగ్ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగడం.. దానికి తోడు హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల భద్రతపై ఇంకా పూర్తిస్థాయి నమ్మకం కుదరకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

 108 రోజుల తర్వాత వీడిన దిగ్బంధం 

ప్రపంచవ్యాప్త చమురు మరియు గ్యాస్ సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన ఈ కీలకమైన జలసంధిలో, గత 108 రోజులుగా వందలాది చమురు ట్యాంకర్లు చిక్కుకుపోయాయి. యుద్ధ భయాలు, బీమా  సమస్యల కారణంగా ఓడలు కదల్లేని పరిస్థితి నెలకొంది. తాజాగా అమెరికా-ఇరాన్ అవగాహనతో ఈ దిగ్బంధం ముగిసినప్పటికీ.. అక్కడ నిలిచిపోయిన నౌకలు బయటకు రావడానికి, కొత్త ట్యాంకర్లు లోడింగ్ కోసం లోపలికి వెళ్లడానికి సురక్షితమైన వాతావరణం ఏర్పడాలి. ట్యాంకర్లు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తాయి కాబట్టి, ముడి చమురు రిఫైనరీలకు చేరి, పెట్రోల్‌గా మారి మార్కెట్లోకి రావడానికి సమయం పడుతుంది.

మార్కెట్లో స్వల్పంగా తగ్గిన ధరలు 

ఈ శాంతి ఒప్పందం తాలూకు సానుకూల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్‌పై సోమవారం ఉదయాన్నే కనిపించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌ 83 డాలర్ల వద్దకు చేరింది. అలాగే అమెరికన్ బెంచ్‌మార్క్ క్రూడ్ ధర 80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ తగ్గుదల ఊరటనిచ్చేదే అయినప్పటికీ, యుద్ధం ప్రారంభం కావడానికి ముందున్న  70 డాలర్ల ధరతో పోలిస్తే ఇవి ఇంకా చాలా ఎక్కువగానే ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఉత్పత్తి పునరుద్ధరణలో సవాళ్లు 

యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్‌లోని పలు దేశాలు తమ చమురు నిల్వ సామర్థ్యం నిండిపోవడంతో తవ్వకాలను నిలిపివేశాయి. ఇప్పుడు వాటిని తిరిగి ప్రారంభించడం అంత సులువు కాదు. ప్రత్యామ్నాయ పైప్‌లైన్లు ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు త్వరగా ఉత్పత్తిని ప్రారంభించగలవు. కానీ ఇరాక్ వంటి దేశాల చమురు క్షేత్రాలు చాలా క్లిష్టమైనవి కావడం, అక్కడ భారీగా ఉత్పత్తి నిలిచిపోవడంతో.. వారు పూర్వ స్థితికి రావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఉడ్ మెకెంజీ సంస్థ తెలిపింది.

 స్థిరమైన కాల్పుల విరమణే ముఖ్యం! 

చమురు ఉత్పత్తిదారులు ,  షిప్పింగ్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లోకి పెట్టుబడులను మళ్లీ పంప్ చేయాలంటే.. కనీసం 30 నుండి 60 రోజుల పాటు స్థిరమైన కాల్పుల విరమణ కొనసాగాలని కొలంబియా యూనివర్సిటీ గ్లోబల్ ఎనర్జీ పాలసీ నిపుణులు పేర్కొంటున్నారు. జలసంధి పూర్తిగా సురక్షితం అనే నమ్మకం కుదిరే వరకు ఇంధన మార్కెట్ పూర్తిగా సాధారణ స్థితికి రాదు. కాబట్టి వినియోగదారులకు పెట్రోల్ సెగలు తగ్గడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు.   

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Diamond Merchant Kidnap: మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
మాలిలో కిడ్నాపైన భారత వజ్రాల వ్యాపారి విడుదల.. రూ. 44 కోట్లు చెల్లించిన ఫ్యామిలీ!
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget