Iran Protests: 'అమెరికా అధ్యక్షుడిని సంతోష పెట్టేందుకే ఇరాన్‌లో విధ్వంసం' నిరసనల మధ్య దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ఖమేనీ
Iran Protests: ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి. 111కి పైగా నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో ఖమేనీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

Iran Protests: జనవరి 9, 2026న, ఇరాన్ ప్రభుత్వ టీవీ ఛానల్‌లో ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రసంగాన్ని ప్రసారం చేసింది. టెహ్రాన్‌తో సహా అన్ని ప్రధాన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రకటనను ప్రసారం చేశారు. అశాంతి మధ్య తన మొదటి ప్రసంగంలో, ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అమెరికాలో సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.
ఇరాన్ విదేశీ ఆపరేటివ్‌లను సహించదు
దేశాన్ని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రసంగించారు. ఇరాన్ విదేశీ మద్దతుతో కూడిన ఆపరేటివ్లను (ఉగ్రవాద ఏజెంట్లు) సహించదని ఖమేనీ అన్నారు. కొంతమంది అల్లరి మూకలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఖమేనీ అమెరికాను హెచ్చరిస్తూ, 'ట్రంప్ తన దేశం గురించి ఆలోచించండి, ఎందుకంటే ఇరాన్ విదేశీ ఒత్తిడికి లొంగదు' అని అన్నారు.
ఐక్య రాజ్యానికి ఓటమి లేదు - ఖమేనీ
ఖమేనీ ఇరాన్ యువతకు విజ్ఞప్తి చేస్తూ, 'ఐక్యతను కొనసాగించండి, దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఐక్య రాజ్యానికి ఏ శత్రువునైనా ఓడించే శక్తి ఉంది. దేశాన్ని, ప్రజలను రక్షించు కోవడం అనేది యుద్ధం కాదని, ధైర్యానికి ప్రతీక' అని అన్నారు.
ఖమేనీ ప్రదర్శనలను విదేశీ కుట్రగా అభివర్ణించారు. ఇదంతా అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఏజెంట్ల పనేనని అన్నారు.
ఇరాన్ శత్రువులు భారీ మూల్యం చెల్లించుకుంటారు - ఖమేనీ
AP నివేదిక ప్రకారం, ఖమేనీ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని, 'నిరసనకారులు ఇతర దేశాల అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి తమ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పుడు చాలా కఠినంగా నేను మాట్లాడుతున్న దానికంటే చాలా కఠినంగా చెబుతున్నాను వారు భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది.' అని అన్నారు.
ఖమేనీ ట్రంప్‌ను అహంకారి అని పిలిచారు
AFP నివేదిక ప్రకారం, ఇరాన్ అత్యున్నత నాయకుడు ఖమేనీ డొనాల్డ్ ట్రంప్‌ను 'అహంకారి'గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడి చేతులు ఇరానియన్ల రక్తం మరకలతో నిండి ఉంది అని ఆరోపించారు. ఇలాంటి విధానలే ట్రంప్‌ను 'అధికారం నుంచి తొలగిస్తాయి' అని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు తన దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.





















