Rape By Indian Student: యూకేలో మత్తులో ఉన్న మహిళను ఎత్తుకెళ్లి భారత విద్యార్థి అత్యాచారం, ఆరేళ్ల జైలు శిక్ష
Rape By Indian Student: యూకేలో ఓ మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న ఆమెను ఎత్తుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు
Rape By Indian Student: భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి యూకేలో దారుణానికి పాల్పడ్డాడు. మత్తులో ఉన్న ఓ మహిళను తన ఫ్లాట్ కు ఎత్తుకెళ్లి తనపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన గతేడాది జూన్ లో జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసులు ఆ విద్యార్థిని అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు కార్డిఫ్ పోలీసులు వెల్లడించారు.
ప్రీత్ వికల్ అనే 20 ఏళ్ల యువకుడు సౌత్ వేల్స్ లోని కార్డిఫ్ ప్రాంతంలో ఉంటున్నాడు. గత సంవత్సరం జూన్ లో అతడు ఓ నైట్ క్లబ్ కు వెళ్లాడు. అదే సమయంలో ఓ మహిళ తన స్నేహితులతో కలిసి అదే క్లబ్ కు వచ్చింది. నైట్ క్లబ్ లో ఆ మహిళ మద్యం ఎక్కువగా తాగేసి మత్తులోకి జారుకుంది. అప్పుడే ఆ మహిళకు ప్రీత్ వికల్ కలిశాడు. తర్వాత వారిద్దరూ వాళ్ల గ్రూప్ లను వదిలేసి నైట్ క్లబ్ నుంచి బయటకు వచ్చారు. మత్తులో ఉన్న ఆ మహిళను ప్రీత్ వికల్ తన ఫ్లాట్ కు తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం చేస్తున్న ఫోటోలను ప్రీత్ వికల్ తన స్నేహితులకు కూడా పంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళను నైట్ క్లబ్ నుంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు అన్నీ అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మొదట ఆ మహిళ మత్తులో ఉండటంతో ప్రీత్ వికల్ పై వాలిపోయి కాస్త దూరం నడిచింది. తర్వాత ఆ మహిళను వికల్ తన చేతులపై తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ప్రీత్ తన భుజాలపై ఎత్తుకుని వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది.
ఈ ఘటనపై స్పందించిన కార్డిఫ్ పోలీసు అధికారులు.. ఆ ప్రాంతంలో అలాంటి దారుణాలు జరగడం అత్యంత అరుదు అని తెలిపారు. ప్రీత్ వికల్ లాంటి ప్రమాదకర వ్యక్తుల వల్ల ఇలాంటి ఘటనలు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంటాయని అన్నారు. ముందస్తు వ్యూహం ప్రకారమే ప్రీత్ వికల్ ఆ మహిళను తన గ్రూప్ నుంచి తప్పించాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమెను ఫ్లాట్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఫోటోలను తన స్నేహితులకు కూడా పంపినట్లు అధికారులు గుర్తించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతడికి న్యాయస్థానం తాజాగా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది.
తనకు జరిగిన దారుణ ఘటనపై ఆ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చిన ఫిర్యాదు చేసిందని అధికారులు తెలిపారు. ప్రీత్ వికల్ దారుణమైన చర్య వల్ల తనకు వణుకుపుట్టిందని, నిద్రపోలేకపోయినట్లు చెప్పిందని వెల్లడించారు. తాను మద్యం మత్తులో ఉండటం వల్లే ఇలాంటి ఘోరం జరిగిందన్న అపరాధ భావంతో తను బాధపడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
#INCOURT l A man has been jailed for raping at a woman at a halls of residence in #Cardiff.
— South Wales Police Cardiff (@SWPCardiff) June 16, 2023
CCTV showed Preet Vikal carrying the victim in his arms and later across his shoulders out of the city centre.
1/2 pic.twitter.com/wfYrIggd7o