అన్వేషించండి

Vivek Ramaswamy: నేను అమెరికా ప్రెసిడెంట్ అయితే ట్రంప్‌కు క్షమాభిక్ష - వివేక్ రామస్వామి వ్యాఖ్యలు

తాను చేసిన ఓ ప్రకటనలో వివేక్ రామస్వామి మరోసారి చర్చనీయాంశమైన విషయం ప్రకటించారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిని అయితే డొనాల్డ్ ట్రంప్ ను క్షమాభిక్ష పెడతానని చెప్పారు.

అమెరికా తర్వాతి ప్రెసిడెంట్ రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి తన ప్రకటనలతో నిరంతరం వార్తల్లో ఉంటున్నారు. గత నెలలో జరిగిన మొదటి ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో వివేక్ రామస్వామి ఆధిపత్యం చెలాయించారు. అప్పటి నుండి అతనికి ప్రజాదరణ కూడా విపరీతంగా పెరిగింది. తాజాగా తాను చేసిన ఓ ప్రకటనలో వివేక్ రామస్వామి మరోసారి చర్చనీయాంశమైన విషయం ప్రకటించారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిని అయితే డొనాల్డ్ ట్రంప్ ను క్షమాభిక్ష పెడతానని చెప్పారు.

డోనాల్డ్ ట్రంప్‌ను క్షమిస్తాను - వివేక్ రామస్వామి
భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి ఒక టీవీ షో సందర్భంగా మాట్లాడుతూ.. రిపబ్లికన్ పార్టీ నుంచి డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా వస్తే, తానే అతనికి మద్దతు ఇస్తానని చెప్పారు. అలాగే, తాను అధ్యక్షుడైతే, తాను అతనిని (ట్రంప్) క్షమిస్తాను అని అన్నారు. ఎందుకంటే అది దేశం ఐక్యంగా ఉండటానికి సహాయపడుతుందని అన్నారు. ట్రంప్ ప్రస్తుతం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జార్జియా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం, అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బు చెల్లించడం, క్యాపిటల్ హిల్‌పై హింసను ప్రేరేపించడం, రహస్య పత్రాలను లీక్ చేయడం వంటివి ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్‌పై కొనసాగుతున్న కేసులు రాజకీయ ప్రేరేపితమని రామస్వామి అన్నారు.

కమలా హారిస్‌ను కీలుబొమ్మగా అభివర్ణన
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో ట్రంప్‌కు బహిరంగంగా మద్దతిస్తున్న అభ్యర్థి వివేక్ రామస్వామి ఒక్కరే ఉన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల సమర్థుడైన అలాంటి వ్యక్తికి నేను ఓటు వేయాలనుకుంటున్నానని రామస్వామి అన్నారు. జో బిడెన్ దీన్ని చేయగలడని తాను అనుకోబోనని, కమలా హారిస్ అతని తోలుబొమ్మ అని విమర్శించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇతర అభ్యర్థులతో తనకు విభేదాలు ఉండవచ్చని, అయితే తాను కూడా బిడెన్, హారిస్ కంటే మెరుగైన మార్గంలో అమెరికాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలనని నమ్ముతున్నానని రామస్వామి అన్నారు.

తైవాన్‌పై అమెరికా విధానంపై విమర్శలు 
తైవాన్ దేశం విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని వివేక్ రామస్వామి విమర్శించారు. తైవాన్‌కు సంబంధించి అమెరికా అనుసరిస్తున్న విధానం తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించడంలో విఫలమైందని ఆయన అన్నారు. అదే సమయంలో, అమెరికా విధానంలో వ్యూహాత్మక సందిగ్ధత ఉందని, చైనా తైవాన్‌పై దాడి చేస్తే అమెరికా దానిని కాపాడుతుందా లేదా అనేది స్పష్టంగా లేదని అన్నారు. గ్లోబల్ సెమీకండక్టర్ సరఫరా చైన్‌ను కంట్రోల్ చేయడానికి చైనాను అనుమతించకపోవడం అమెరికాకు మంచిదని రామస్వామి అన్నారు. వన్ చైనా విధానానికి అమెరికా మద్దతిస్తోందని, దాని ఆధారంగా తైవాన్‌ను ఒక దేశంగా గుర్తించడం లేదని వివేక్ రామస్వామి అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan vs Pawan Kalyan: వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Public Talk | Nandamuri Balakrishna స్ర్రీన్ ప్రజెన్స్ మెంటల్ మాస్ | ABP DesamDaaku Maharaaj Movie Review | Nandamuri Balakrishna మరణ మాస్ జాతర | ABP DesamSobhan Babu House Vlog | చిన నందిగామ లో నటభూషణ్  కట్టిన లంకంత ఇల్లు | ABP DesamKondapochamma Sagar Tragedy | కొండపోచమ్మసాగర్ లో పెను విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Pawan Kalyan: వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
వామ్మో! ఆ మ్యాటర్‌లో చంద్రబాబునే మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సెటైర్లు
CM Revanth Reddy: 'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
'భేషజాలు లేవు, ఎవరి సలహాలనైనా స్వీకరిస్తాను' - పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు, ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు
Daaku Mahaaraj Review - డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
డాకు మహారాజ్ రివ్యూ: బాక్సాఫీస్ కింగ్ అయ్యే ఛాన్స్ ఉందా? బాలకృష్ణ సినిమా ఎలా ఉందంటే?
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Tirumala News: శ్రీవారి హుండీలో బంగారం చోరీకి యత్నం, విజిలెన్స్‌కు అడ్డంగా దొరికిన ఉద్యోగి
Karimnagar News: మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
మంత్రుల సమక్షంలోనే వివాదం - కరీంనగర్ కలెక్టరేట్ సమావేశం రసాభాస, పాడి కౌశిక్ రెడ్డిని బయటకు లాక్కెళ్లిన పోలీసులు
Trump's Swearing-in Ceremony : ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు - భారత ప్రతినిధిగా వెళ్లనున్న జయశంకర్
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు - భారత ప్రతినిధిగా వెళ్లనున్న జయశంకర్
Anil Ambani : విశాఖలో వాలిపోయిన పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ - ప్రధాని మోదీ వచ్చిన మూడు రోజులకే..
విశాఖలో వాలిపోయిన పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ - ప్రధాని మోదీ వచ్చిన మూడు రోజులకే..
Arvind Kejriwal: బీజేపీకి కేజ్రీవాల్ బంపరాఫర్- కేంద్రం ఆ ఒక్క పనిచేస్తే ఎన్నికల్లో పోటీ చేయనని హామీ
బీజేపీకి కేజ్రీవాల్ బంపరాఫర్- కేంద్రం ఆ ఒక్క పనిచేస్తే ఎన్నికల్లో పోటీ చేయనని హామీ
Embed widget