అన్వేషించండి

Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌

Captain Smit Machhar| ఫ్లై దుబాయ్ విమానంలో కో పైలట్ హమామ్ అల్ హమామీ నమాజ్ చేసుకుంటానని లేచి, తన దృష్టి మరల్చి వెనుక నుంచి గొడ్డలితో దాడి చేశాడని పైలట్ స్మిత్ మచ్చర్ వెల్లడించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఫ్లైదుబాయ్ కోపైలట్ దాడి చేయగా, పైలట్ ప్రాణాలు కాపాడాడు.
  • కోపైలట్ విమానం కూల్చాలనుకున్నట్లు ఒప్పుకున్నాడు; దర్యాప్తు కొనసాగుతోంది.
  • కోపైలట్ నేపథ్యం, అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు ముమ్మరం.

ఫ్లైదుబాయ్ విమానం FZ1073లో కో పైలట్ చేసిన దాడి ఘటనలో విచారణ జరిగే కొద్ది షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కో పైలట్ హమామ్ అల్-హమామి విమానాన్ని కూల్చివేయాలని చూశాడని విచారణలో వెల్లడైంది. మరోవైపు పైలట్ స్మిత్ మచ్చర్ సైతం అసలేం జరిగిందో తెలిపారు. తాను నమాజ్ చేసుకుంటానని చెప్పి లేచిన హమామ్ అల్ హమామి.. వెనుక నుంచి గొడ్డలితో దాడి చేసి ఒక్కసారిగా రక్తపాతం సృష్టించాడని స్మిత్ మచ్చర్ చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. 

సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్ అయిన కొంత సమయానికే ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి తాను నమాజ్ చేసుకుంటానంటూ సీట్లోంచి లేచాడు. అతడి మాటలు నమ్మిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ తాను మాత్రం విమానాన్ని నడపడంపైనే ఫోకస్ చేశారు. సరిగ్గా నాలుగు నిమిషాల తర్వాత, వెనుక నుంచి స్మిత్ తలపై దాడి జరగడంతో అసలేం జరుగుంతో అర్థంకాక షాకయ్యాడు తనపై కో పైలట్ హమామి గొడ్డలితో ఊహించని విధంగా దాడి చేశాడని తెలిపారు. 

ఆయన కంగారు పడిన విషయం ఒక్కటే..

కో పైలట్ హమామి చేసిన దాడితో.. విమానానికి ఏదో పెద్ద ప్రమాదం జరిగిందేమో అని మొదట పైలట్ స్మిత్ మచ్చర్ భావించారు. కానీ వెంటనే మరో వేటు పడటంతో వెనుక ఉన్న కో పైలట్ హమామ్ అల్ హమామి దాడి చేస్తున్నాడని గ్రహించారు. తీవ్ర రక్తస్రావంతో కళ్లు మైకం కమ్ముతున్నట్లు, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించినా ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించారు. హఠాత్ పరిణామంతో విమానం వేగంగా కిందికి పడిపోతుండటాన్ని గుర్తించిన కెప్టెన్ స్మిత్ అప్రమత్తం అయ్యారు. విమానంలో ఉన్న వారికి ఏం కాకూడదని, వారిని ఎలాగైనా కాపాడాలని కంగారు పడినట్లు తెలిపారు.

ఎలాగైనా ప్రయాణికులను కాపాడాలనే భావించిన స్మిత్ మచ్చర్ తాను హనుమాన్ చాలీసాను పఠించారు. కోపైలట్ ను అడ్డుకుంటూనే అతికష్టం మీద కాక్‌పిట్ తలుపు వైపు  పాకారు. తలుపు నాబ్‌ను తిప్పి ఓసారి తెరిచినా కో-పైలట్ హమామి డోర్ బలవంతంగా మూసేశాడు. పైలట్ స్మిత్‌ను సైతం కింద పడేసి మరోసారి దాడికి యత్నించాడు. ఆ క్షణంలో స్పృహ కోల్పోతే కనుక విమానంలో ఉన్న 174 మంది చనిపోతారని భావించిన స్మిత్ మచ్చర్ తన చివరి శ్వాస వరకు ఎలాగైనా సరే పోరాడాలని నిర్ణయించుకున్నారు. 

శరీరం సహకరించకపోయినా తాను సర్వశక్తులూ ఒడ్డి మరీ.. రెండోసారి కాక్‌పిట్ తలుపును తెరిచినట్లు స్మిత్ మచ్చర్ వెల్లడించారు. బయట వేచి చూస్తున్న ప్రయాణికులు, సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి అసలేం జరిగిందో గుర్తించారు. హమామి చేసిన దారుణాన్ని వెంటనే అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. దాంతో దాడి చేసిన కో పైలట్‌ను ప్యాసింజర్స్, సిబ్బంది సెకన్ల వ్యవధిలో బంధించడంతో పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చింది. దాంతో 9/11 తరహా ఉగ్రదాడిని అడ్డుకున్నారు. అనంతరం డ్యూటీలో లేని మరో పైలట్ ఫ్లై దుబాయ్ విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కో పైలట్‌ హమామ్‌ అల్‌-హమామీ తాను తప్పు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. విమానాన్ని కూల్చివేయాలని ముందుగానే భావించానని, ప్లాన్ ప్రకారంమే ప్రార్థన అని నాటకమాడి కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ దృష్టి మళ్లించి దాడి చేశానని ఒప్పుకున్నాడు. తనకు చావంటే ఏ భయం లేదని, అందుకే ఈ పని చేసినట్లు చెప్పుకొచ్చాడు నిందితుడు హమామి. అయితే ఒక్కడే ఈ దారుణానికి పాల్పడ్డాడా, లేక దీని వెనుక ఏమైనా ఉగ్రదాడ కుట్ర కోణం ఉందా అని దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అతడి సోషల్ మీడియా పోస్టుల్లో, ఫొటోల్లో కొందరు ఉగ్రవాదుల, టెర్రరిస్టు గ్రూపుల లింక్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ ఉగ్రవాదులతో గానీ, ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. 

నిందితుడు హమామి యూఏఈలో జన్మించగా.. అతడి తండ్రి ఒమన్‌ పౌరుడు. తల్లి సిరియా జాతీయురాలు అని అధికారులు గుర్తించారు. ఫ్లైదుబాయ్‌లో చేరడానికి ముందు అతడు సిరియా, ఒమన్, మొరాకో దేశాల్లో ఉండేవాడు. సిరియా అంతర్యుద్ధ సమయంలో ఉగ్రవాదం వైపు ఆకర్షితుడై ఉండొచ్చుననే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. 

Frequently Asked Questions

ఫ్లైదుబాయ్ విమానంలో ఏం జరిగింది?

సెప్టెంబర్ 30న ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ హమామ్ అల్-హమామి పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేశాడు. విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించగా, పైలట్ ధైర్యంగా పోరాడి ప్రయాణికులను కాపాడాడు.

దాడికి పాల్పడిన కో పైలట్ ఎవరు?

దాడికి పాల్పడిన కో పైలట్ పేరు హమామ్ అల్-హమామి. తాను నమాజ్ చేసుకుంటానని చెప్పి, ప్లాన్ ప్రకారం పైలట్‌పై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఈ దాడిని ఎలా అడ్డుకున్నారు?

కెప్టెన్ స్మిత్ మచ్చర్ తీవ్ర గాయాలతోనూ పోరాడి కాక్‌పిట్ తలుపు తెరిచాడు. బయట ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కలిసి కో పైలట్‌ను బంధించడంతో 9/11 తరహా దాడి తప్పింది.

కో పైలట్ దాడికి గల కారణం ఏమిటి?

కో పైలట్ హమామి విమానాన్ని కూల్చివేయాలని ముందుగానే ప్లాన్ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అతని సోషల్ మీడియా పోస్టుల్లో ఉగ్రవాద గ్రూపుల లింకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget