By: ABP Desam | Updated at : 15 Nov 2021 12:09 PM (IST)
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (File Photo)
Pak PM Imran Khan: పాకిస్తాన్ ప్రభుత్వం, దేశ ఆర్మీకి మధ్య మరోసారి అగ్గి రాజుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి నూతన చీఫ్ నియామకం విషయంపై ప్రభుత్వానికి, ఆర్మీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు పాక్ ఆర్మీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు ప్రతికూల నిర్ణయాలు తీసుకుంటూ పొరుగు దేశాల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ పదవికి ఎసరు పెట్టాలని పాక్ ఆర్మీ పావులు కదుపుతోంది.
లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ ఐఎస్ఐ డీజీగా నవంబర్ 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు, ఆర్మీ చీఫ్ జనరల్ జావెద్ బజ్వా మధ్య దూరం మరింత పెరిగింది. ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయజ్ హమీద్ కు బాధ్యతలు తిరిగి అప్పగించాలా వద్దా అనే విషయంపై నిప్పురాజుకుందని పాక్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: అంతర్జాతీయ వేదికపై భారత్ కీలక విజయం.. ఏకంగా 200 దేశాలతో..
ఐఎస్ఐ చీఫ్ ఎంపిక విషయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు రెండు ఆప్షన్లు ఉంచారు. స్వయంగా ఇమ్రాన్ పదవి నుంచి తప్పుకోవడం. లేక ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పాక్ ఆర్మీ వ్యూహాలు రచిస్తోంది. ఏ విధంగా చూసుకున్న ఇమ్రాన్ ఖాన్ ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని పాక్ మీడియా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే మరికొన్ని రోజుల్లో అధికార పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) తమ మిత్రపక్షాలైన ముత్తాహిద కౌమి మూమెంట్, పాకస్తాన్ ముస్లిమ్ లీగ్ (పీఎంఎల్ క్యూ) సహకారం కోల్పోయే అవకాశాలున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటే పీటీఐకి చెందిన మరోనేత పర్వేజ్ ఖట్టక్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నుంచి షాబాజ్ షరీఫ్ ప్రధాని రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఇదివరకే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారడంతో ఇమ్రాన్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పాక్ ప్రభుత్వం టీఎల్పీ గ్రూప్‌నకు చెందిన వందలాది మద్దతుదారులను ఇటీవల విడుదల చేసింది. కానీ ఈ విషయంపై అంతకుముందు చెలరేగిన హింసలో పోలీసు సిబ్బంది చనిపోవడం పాక్ ప్రభుత్వానికి మైనస్ పాయింట్‌గా మారింది.
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
ఐఎస్ఐ నూతన చీఫ్ నియామకం విషయంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆర్మీ చీఫ్ అసంతృప్తి చేశారు. అదే సమయంలో ప్రతిపక్షనేత షాబాజ్ షరీఫ్‌తో ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వా సంప్రదింపులు జరపడం ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇరకాటంలో పడేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇమ్రాన్‌ను పదవీచ్యుతుడిని చేయాలని పాక్ ఆర్మీ భావించింది.
PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!
Whatsapp New Feature : గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?
Green Card: భారతీయులకు శుభవార్త- ఇక ఆరు నెలల్లోగా గ్రీన్ కార్డ్‌కు క్లియరెన్స్!
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయకు ఊరట- వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
Sweden NATO Membership: నాటో కూటమిలో చేరేందుకు స్వీడన్ సై- పుతిన్ స్వీట్ వార్నింగ్
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్