By: ABP Desam | Updated at : 04 May 2022 08:09 PM (IST)
ట్వీట్లకు చార్జీలు వసూలు చేసే ప్రయత్నాల్లో ఎలన్ మస్క్
ట్విట్టర్‌ను కొనేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను ఎలా తీరుస్తారంటే.. ట్వీట్లను అమ్ముతామని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజం కాబోతోంది. ఇక నుండి ట్విటర్ యూజర్లు రుసుము చెల్లించాల్సి రావొచ్చని ఎలన్ మస్క్ ప్రకటించారు. సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారి నుంచి ఛార్జీలు వసూలు చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన అవుననే చెప్పారు. అయితే అందరి యూజర్ల నుండి కాదని, వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులు మాత్రం స్వల్ప మొత్తంలో రుసుము చెల్లించాల్సి రావొచ్చు అని తెలిపారు.
Twitter will always be free for casual users, but maybe a slight cost for commercial/government users
— Elon Musk (@elonmusk) May 3, 2022
ఈ విషయాన్ని బుధవారం ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. దీనిపై ప్రస్తుత ట్విటర్ యాజమాన్యం ఇంకా స్పందించలేదు. ట్విటర్‌లో చాలా మార్పులు తీసుకురావాలని మస్క్ అనేక సూచనలు చేశారు. కొత్త ఫీచర్లతో పాటు ఆల్గారిథమ్‌ను ఓపెన్ సోర్స్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే బ్లూ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పాలసీలోనూ మార్పులు తీసుకొస్తానని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నాయకులు ఎన్నికల్లో ప్రచారానికి, అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు తెలిసేందుకు ట్విట్టర్‌ను ప్రధాన అస్త్రంగా వాడుతుంటారు. ప్రజలకు చేరువయ్యేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం వాణిజ్య ప్రకటనలకు ట్విట్టర్‌ను ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పోస్ట్‌లు చేయాలంటే రుసుం చెల్లించాల్సిందేనని మస్క్ హింట్ ఇచ్చారు.
ఇక ఉక్రెయిన్‌పై అధికారిక యుద్ధం- ఇలా చేయడం వల్ల రష్యాకు లాభం!
కొద్దిరోజుల కిందట సుమారు 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న మస్క్.. ఇందులో పలు మార్పులు చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆ దిశగా ఇప్పుడు అడుగులు వేశారు. సీఈఓ పరాగ్ అగర్వాల్, లీగల్ హెడ్ విజయ గద్దెను కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది. తమ భద్రత గురించి ఉద్యోగులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే సరికొత్త ట్విట్టర్‌ను ఆవిష్కరించాలనుకుంటున్న ఎలన్ మస్క్ ఆదాయ మార్గాలు కూడా ఎక్కువే ఉండేలా చూసుకుంటున్నారు. మరి యూజర్లు ట్విట్టర్‌ను గతంలోలానే ఫాలో అవుతారా..? ప్రత్యామ్నాయాలు చూసుకుంటారా అన్నది వేచి చూడాలి.
భారత్‌లో రానున్నది ఇసుక సంక్షోభం - ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు ఇవే !
China Plane Crash: ఎంత పనిచేశారు పైలట్లు! 132 మంది ప్రాణాలు గాల్లో కలిపేశారు!
Cannes Film Festival: మరో చాప్లిన్ రావాలి, పుతిన్‌ను ప్రపంచం ప్రశ్నించాలి: కేన్స్ చలన చిత్రోత్సవంలో జెలెన్స్కీ
Covid 19 in North Korea: ఉత్తర కొరియాను ఊపేస్తోన్న కరోనా వైరస్- మిలటరీని రంగంలోకి దింపిన కిమ్
PM Boris Johnson: ఆహా, అట్నా- 'వర్క్ ఫ్రమ్ హోం' గురించి ఏం చెప్పారు పీఎం సారూ!
Whatsapp New Feature : గుట్టుగా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు - వాట్సాప్ కొత్త ఫీచర్ గురించి తెలుసా ?
Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
IBA Womens World Boxing: జరీన్ 'పంచ్' పటాకా! ప్రపంచ బాక్సింగ్ ఫైనల్ చేరిన తెలంగాణ అమ్మాయి
KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్ వెళ్తారా? ఓడి టెన్షన్ పడతారా!
Shivatmika Photos: నల్ల చీరలో 'దొరసాని'లా వెలిగిపోతోన్న శివాత్మిక