Turkey Syria Earthquake: గంటల వ్యవధిలోనే మరోసారి కంపించిన భూమి- వణికిపోతున్నటర్కీ, సిరియా జనం
Turkey Syria Earthquake: ఇప్పటికే ఉగ్రవాదం, యుద్ధంతో సతమతమవుతున్న మధ్యప్రాచ్యం ప్రకృతి విపత్తుతో అల్లాడిపోతోంది. సోమవారం 145 సార్లు భూప్రకంపనలతో అతలాకుతలమైంది.
Turkey Syria Earthquake: ఇప్పటికే ఉగ్రవాదం, యుద్ధంతో సతమతమవుతున్న మధ్యప్రాచ్యం ప్రకృతి విపత్తుతో మరోసారి అల్లాడిపోతోంది. సోమవారం 145 సార్లు భూప్రకంపనలతో అతలాకుతలమైంది. టర్కీ, సిరియాలో సోమవారం 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని, దేశంలోని పలు నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. టర్కీ ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తూ నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విపత్తులో బంధువులను కోల్పోయిన వ్యక్తులు కొందరైతే... శిథిలాల కింద సజీవంగా ఉంటారనే ఆశతో మరికొన్ని కుటుంబాలు కాలం వెల్లదీస్తున్నాయి. వాళ్లను వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. శిథిలాల్లో ఆత్మీయులు చిక్కుకున్నారని తెలిసినా కూడా బయటకు తీసుకురాలేకపోతున్న వారి నిస్సహాయత కన్నీళ్లు పెట్టిస్తోంది.
టర్కీలో సోమవారం భూకంపం ఆ దేశ ప్రజలను వణికించింది. గంటల వ్యవధిలో వచ్చిన భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. టర్కీ, సిరియాలో సంభవింటిన భూకంపంలో సుమారు 5వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
1. టర్కీ-సిరియాలో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 5 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ దేశంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.
2. విపత్తులో మృతుల సంఖ్య పెరుగుతుందని టర్కీ ఉపాధ్యక్షుడు తెలిపారు. ఈ ప్రమాదంలో మొత్తం 5600 భవనాలు ధ్వంసమైనట్లు అంచనా.
3. సిరియాలో ఇప్పటివరకు మొత్తం 2365 మంది మరణించినట్లు ఏపీ వార్తా సంస్థ చెప్పింది.
4. పెను భూకంపంతో భారీగా దెబ్బతిన్న టర్కీ, సిరియాకు సాయం అందించేందుకు భారత్ ముందుకు వచ్చింది. పీఎంవోలో సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఆదేశాల మేరకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌కు చెందిన 2 బృందాలు టర్కీ బయలుదేరాయి.
5. భారత్‌తో పాటు అమెరికా, ఇజ్రాయెల్, స్పెయిన్, పాకిస్తాన్ కూడా ఆపన్నహస్తం అందిస్తున్నాయి.
6. ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు కష్టంగా ఉన్నాయని టర్కీ ఆరోగ్య మంత్రి తెలిపారు.
7. భూకంపం సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే మరోసారి టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. టర్కీలో ఇప్పటివరకు 145కుపైగా భూప్రకంపనలు వచ్చాయి.
8. భూకంపం తర్వాత టర్కీ దళాలు సిప్పెరెట్ ఎయిర్ కారిడార్‌ను ఏర్పాటు చేశాయి. భూకంప ప్రభావిత ప్రాంతాలకు వైద్య బృందాలు, సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను పంపించామని టర్కీ రక్షణ మంత్రి హులూసి అకర్ తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
10. న్యూజిలాండ్ కూడా టర్కీకి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఆహారం, దుప్పట్లు, వైద్య సహాయం అందించడానికి న్యూజిలాండ్ రెడ్ క్రెసెంట్‌కు 632,000 డాలర్లు, సిరియా అరబ్ రెడ్ క్రెసెంట్‌కు 316,000 డాలర్లు ప్రకటించింది.
A miracle after 22 hours!
— Mohd Ahtisham Ahsan (@MohdAhtishamAh1) February 7, 2023
A 3-year-old baby was just rescued from the rubble in Malatya, one of the epicenters of #Turkiye earthquake. #Turkiye#TurkeyEarthquake pic.twitter.com/Lo8V1zseeC