డీలా పడిపోయిన చైనా జాబ్ మార్కెట్, ఉద్యోగాల కోసం యూత్ ఎదురుచూపులు
China Job Market: చైనాలో జాబ్ మార్కెట్ పూర్తిగా డీలా పడిపోయింది.
China Job Market:
కంటి నిండా నిద్రలేదట..
చైనాలోని యూత్‌లో రోజురోజుకీ టెన్షన్ పెరిగిపోతోంది. కంటినిండా నిద్రపోవడం లేదు. ఒత్తిడికి గురవుతున్నారు. యాంగ్జిటీ కూడా పెరుగుతోంది. కారణం...నిరుద్యోగం. చైనా జాబ్ మార్కెట్ దారుణమైన స్థితిలో ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తైన వెంటనే గతంలో ఏదో ఓ ఉద్యోగం దొరికేది. ఇప్పుడలా కాదు. నెలల పాటు వేచి చూడాల్సి వస్తోంది. అంత ఎదురు చూసినా ఒక్కోసారి ఒక్క ఉపాధి అవకాశం కూడా దొరకట్లేదు. లక్షలాది మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తున్నారే తప్ప అందులో చాలా తక్కువ మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇటీవలి లెక్కలు చూస్తే ఇదే స్పష్టమవుతోంది. జూన్‌లో 16-24 ఏళ్ల వయసున్న వారిలో 21.3% మేర నిరుద్యోగ రేటు పెరిగింది. చైనాని దీని గురించి ప్రశ్నిస్తే ఎప్పటిలాగే బుకాయిస్తోంది తప్ప సరైన లెక్కలు ఇవ్వడం లేదు. అంతా బానే ఉందని చెబుతోంది. పైగా...ఇప్పటి నుంచి ఎంప్లాయ్‌మెంట్ డేటాని పబ్లిష్ చేయడాన్ని నిలిపివేస్తున్న అధికారులు ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపించడం మానేసి ఇలా లెక్కలు దాచేసే పనిలో పడింది చైనా ప్రభుత్వం. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాల నిరుద్యోగం ఉంది అంటే పరువు పోతుందని ఇలా కవర్ చేసుకుంటోంది. బీజింగ్‌లో జాబ్ ఫెయిర్‌లు పెడితే వేలాది మంది తరలి వస్తున్నారు. ఏదో చిన్న ఉద్యోమైనా దొరక్కపోదా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ..ఈ జాబ్ ఫెయిర్‌లలో వచ్చే ఉద్యోగాల్లో జీతాలు చాలా తక్కువగా ఉంటున్నాయని యువతీ యువకులు బాధ పడుతున్నారు. అందుకే...మంచి జీతం ఉన్న ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు.
"ఉద్యోగం కోసం ప్రయత్నించి చాలా అలిసిపోయాను. ఒకవేళ జాబ్ దొరక్కపోతే నా పరిస్థితేంటన్నది అర్థం కావట్లేదు. చాలా టెన్షన్‌గా ఉంది. రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. పదేపదే ఉద్యోగం గురించే ఆలోచిస్తున్నాను"
- ఓ యువకుడు
కొవిడ్ తరవాత అంతా మారింది..
కొవిడ్ తరవాత చైనాలో పరిస్థితులన్నీ మారిపోయాయి. కన్‌జ్యూమర్ డిమాండ్ బాగా తగ్గిపోయింది. చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్‌పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎలాగోలా కోలుకోవచ్చు అనుకున్నా..ఆ ప్రాసెస్‌కి చాలా టైమ్ పట్టేలా ఉంది. అయితే..కొంత మంది ఎక్స్‌పర్ట్స్ మాత్రం గ్రాడ్యుయేట్స్‌కి సరైనా నాలెడ్జ్ ఉండట్లేదని, అందుకే అవకాశాలు రావట్లేదని చెబుతున్నారు. చాలా తొందరగా ఒత్తిడికి గురవుతున్నారని అంటున్నారు. మొత్తానికి..చైనా జాబ్ మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే కుదుపులు మొదలయ్యాయి.