అన్వేషించండి

Bangladesh : ఎన్నికలపై తేల్చని యూనస్- బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు - ఢాకాలో టెన్షన్ టెన్షన్

Bangladesh Protesters : బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు ప్రారంభమవుతున్నాయి. యూనస్ నివాసాన్ని ముట్టడించేందుకు యువత ప్రయత్నించడం కలకలం రేపింది.

Bangladesh Protesters try to seize Yunus residence:   బంగ్లాదేశ్‌లో మళ్ళీ అశాంతి చెలరేగుతోంది. మాజీ ప్రధాని షేక్ హసీనా పారిపోయిన తర్వాత తొలిసారిగా జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు, అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.  శనివారం నిరసనకారులు భారీ సంఖ్యలో రాజధాని ఢాకాలోని తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు  మహమ్మద్ యూనస్ అధికారిక నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది.
  
2024 ఆగస్టులో షేక్ హసీనా దేశం విడిచి పారిపోయినప్పుడు చోటుచేసుకున్న ఉద్రిక్త దృశ్యాలు మళ్ళీ ఢాకా వీధుల్లో కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యం, పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఆగ్రహంతో ఉన్న వేలాది మంది నిరసనకారులు, యూనస్ నివాసం వైపు దూసుకువెళ్లారు. భద్రతా బలగాలు బారికేడ్లు వేసి అడ్డుకున్నప్పటికీ, తోపులాట జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఈ ఘటన ఢాకాలో పాత ఘటనలను గుర్తుకు తెచ్చింది.  

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత శాంతి భద్రతలను పునరుద్ధరించి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తామని మహమ్మద్ యూనస్ పగ్గాలు చేపట్టారు. అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంలో తాత్కాలిక ప్రభుత్వం జాప్యం చేస్తోందని విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంస్కరణల పేరుతో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారా  అన్న అనుమానం నిరసనకారుల్లో బలంగా నాటుకుపోవడం ఈ ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణమైంది.  

 
రాజకీయ అనిశ్చితికి తోడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ప్రజలను వీధుల్లోకి తెస్తోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం, నిరుద్యోగం పెరగడంపై సామాన్యులు ఆగ్రహంతో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం కేవలం రాజకీయ సంస్కరణలకే ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల కనీస అవసరాలను పట్టించుకోవడం లేదని నిరసనకారులు నినదిస్తున్నారు.  యూనస్ రాజీనామా చేయాలి అనే డిమాండ్లు కూడా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.  

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ సైన్యం రంగంలోకి దిగింది. ఢాకాలోని కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీని భారీగా పెంచారు. సరిహద్దుల వద్ద కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు. షేక్ హసీనా పారిపోవడానికి ఏర్పడిన తరహా పరిణామాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని సైనిక నాయకత్వం భావిస్తోంది.                                 

 

టాప్ హెడ్ లైన్స్

Temple Dating: దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
దేవాలయాల్లో డేటింగ్ క్యాంపులు జనాభాను పెంచుతాయా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే డిస్కషన్!
US Iran War: ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
ఇక పగటిపూటే దాడులు, వచ్చేవారం నుంచి భీకర దాడులు చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
US Russia Sanctions Bill: రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?
రష్యా ఆంక్షల బిల్లులో అమెరికా సవరణలు!సుంకాలు 100శాతానికి తగ్గింపు! భారత్‌కు ఉపశమనం లభిస్తుందా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget