అన్వేషించండి

Kamala Harris : బ్యాలెట్ పోరులో బుల్లెట్ల మోత-కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు

US Elections 2024: రెండు హత్యాయత్నాల నుంచి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ సేఫ్ గా బయటపడ్డారనుకుంటున్న టైమ్ లో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కార్యాలయంపై దాడి జరగడం మరింత సంచలనంగా మారింది.

America News: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేనంత హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఆఫీస్ పై దాడి అంటే అది మామూలు విషయం కాదు. అర్థరాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో దాడికి తెగబడ్డారు. ఆరిజోనాలోని పార్టీ ప్రచార కార్యాలయంపై ఈ దాడి జరిగింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నారు. ఆయన్ని టార్గెట్ చేస్తూ ఇప్పటికే రెండుసార్లు కాల్పుల ఘటనలు జరిగాయి. రెండు నెలల క్రితం పెన్సిల్వేనియాలోని ఎన్నికల సభలో ట్రంప్ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఆ దాడిలో ట్రంప్ కుడిచెవికి గాయమైంది. కొంతమంది సెక్యూరిటీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతరం ట్రంప్ పై సింపతీ పెరిగిందనే వార్తలు వినిపించాయి. ఈ ఘటన మరచిపోక ముందే మరోసారి ట్రంప్ ని టార్గెట్ చేస్తూ దాడి యత్నం జరిగింది. అయితే రెండోసారి భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. దుండగుడి చేతిలోని తుపాకీ నుంచి బుల్లెట్ బయటకు రాకముందే సెక్యూరిటీ అతడిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అరెస్ట్ చేశారు. ఈ రెండు హత్యాయత్నాల నుంచి ట్రంప్ సేఫ్ గా బయటపడ్డారనుకుంటున్న టైమ్ లో ఇటు డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కార్యాలయంపై దాడి జరగడం మరింత సంచలనంగా మారింది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి చాలా ప్రత్యేకంగా మారాయి. గతంలో కూడా మహిళలు అధ్యక్ష స్థానానికి పోటీ పడినా గెలవలేదు. ఈసారి కమలా హ్యారిస్ గెలిస్తే అది సంచలనం అవుతుంది. ప్రస్తుతం కమల అమెరికాకి ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. వాస్తవానికి డెమెక్రాట్ల ఫస్ట్ ఛాయిస్ ఆమె కాదు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి నిలిచారు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా స్వచ్ఛందంగా పోటీనుంచి తప్పుకున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కమలా హ్యారిస్ సడన్ ఎంట్రీ ఇచ్చారు. కమలా తెరపైకి వచ్చాక పోటీ మరింత టఫ్ గా మారింది. డొనాల్డ్ ట్రంప్ కి ఆమె గట్టి పోటీదారుగా మారారు. ట్రంప్ పై కాల్పులు జరిగిన తర్వాత కొంత సింపతీ వర్కవుట్ అవుతుందని అనుకున్నా.. అది కేవలం ప్రచారమేనని తేలిపోయింది. ఇప్పుడు కమలా హ్యారిస్ ఆఫీస్ పై కూడా దాడి జరగడంతో కలకలం రేగింది. 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలుపు అవకాశాలు రోజు రోజుకీ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్ల విషయంలో కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంపా పై 38 పాయింట్లతో ముందంజలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఆసియా అమెరికన్లు.. 66 శాతం మంది హ్యారిస్‌కు మద్దతు తెలుపుతున్నారని, కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్ కి ఓటు వేస్తామని చెప్పారనేది సర్వే సారాంశం. హోరా హోరీ పోరు సహా.. కాల్పుల ఘటనలతో ఈ ఎన్నికలు మరింత సంచలనంగా మారాయి. 

Also Read: లెబనాన్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం- వందల మంది మృతి, మృతుల్లో హెజ్బొల్లా క్షిపణుల కమాండర్ కోబైసీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget