PM Modi China Tour: బార్డర్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.. చైనా పర్యటనలో ప్రధాని మోదీ
PM Modi China Visit: చైనాతో సానుకూల సంబంధాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్- చైనా సరిహద్దుల్లో శాంతి నెలకొందన్నారు.

Modi Visit to China: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. పలు వివాదాల అనంతరం దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటిస్తున్నారు. భారత్‌పై అమెరికా సుంకాల బాదుడు నేపథ్యంలో మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. తియాజింగ్‌లో జరుగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. దీనికి ముందు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ అయ్యారు.
శాంతి, స్థిరత్వం నెలకొన్నాయి..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చైనాతో సానుకూల సంబందాలు కొనసాగించేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. గతేడాది రష్యాలోని కజన్‌లో జరిగిన ట్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో జిన్ పింగ్ జరిగిన సమావేశం గురించి ఆయన మాట్లాడారు. నాడు తమ బేటీ ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు బాటలు వేసిందన్నారు. భారత్- చైనా సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తల అనంతరం శాంతి, స్థిరత్వం నెలకొన్నాయని అన్నారు.
2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి
భారత్–చైనా సరిహద్దుల్లోనే కైలాశ్ మానస సరోవర్ యాత్ర కూడా తిరిగి ప్రారంభమైన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య సహకారం దాదాపు 2.8 బిలియన్ల మంది ప్రజల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు మొత్తం మానవాళి సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు.
Sharing my remarks during meeting with President Xi Jinping. https://t.co/pw1OAMBWdc
— Narendra Modi (@narendramodi) August 31, 2025
జిన్‌పింగ్ విజయవంతమైన అధ్యక్షుడు
చైనాలో పర్యటించేందుకు, ఎస్సీవో సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు ముందుకు తీసుకెళ్లేందుకు నిశ్చయించుకున్నామని అన్నారు. జిన్‌పింగ్ విజయవంతమైన అధ్యక్షుడు అని మోదీ అభినందించారు.
ట్రంప్‌తో విబేధాల వేళ..
2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగాదెబ్బతిన్న విషయం తెలిసిందే. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై భారీ టారిఫ్‌లు మోపుతున్నాడు. చైనాతోనూ ట్రంప్‌కు పలు విబేధాలున్నాయి. ఈక్రమంలో భారత్, చైనా నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.





















