అన్వేషించండి

అమెరికా, ఆస్ట్రేలియాలో 'ఇండియన్ గో బ్యాక్' నినాదం వెనుక అసలు కారణాలివే! వలస వ్యతిరేకతపై సంచలన విషయాలు

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో 'గో బ్యాక్ ఇండియన్స్' అంటూ ర్యాలీలు చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకు కారణం స్థానికుల్లో పెరుగుతున్న అభద్రతే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో 'గో బ్యాక్ ఇండియన్స్' ర్యాలీలు
  • వలస ఉద్యోగులతో స్థానికులకు ఉద్యోగ భద్రతపై ఆందోళన
  • వలసదారులతో జీవన వ్యయం, వనరులపై ఒత్తిడి పెరుగుతోంది
  • సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలతో స్థానికుల్లో సంఘర్షణ

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటివి ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలుగా ముందు వరుసలో ఉంటాయి. అక్కడ ఉద్యోగం దొరికితే జీవితం 'సెటిల్' అయినట్టేనన్న భావన భారతీయుల్లో ఉంటుంది. ఇక, అమెరికాలో ఉద్యోగం దొరకడం లేదా అమెరికా సంబంధం లభించడం ఒక 'స్టేటస్ సింబల్'గా మారింది. చదువుకున్న విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది అమెరికా, యూకే వంటి దేశాల్లో ఉద్యోగం సంపాదించి, అక్కడే స్థిరపడాలన్న లక్ష్యంతో ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం అక్కడి అవకాశాలు, ఆ దేశాల్లోని జీవన ప్రమాణాలేనని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు ఆ దేశాల్లో భారతీయులంటే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో 'గో బ్యాక్ ఇండియన్స్' అంటూ ర్యాలీలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యతిరేకతకు ఉన్న ఐదు ప్రధాన కారణాలను ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

1. స్థానికులకు ఉద్యోగాలు కోల్పోతున్నామన్న అభద్రతా భావం

అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోకి వలస ఉద్యోగుల రాక స్థానికులకు ఇబ్బందులను కలిగిస్తోంది. తమకు దక్కాల్సిన ఉద్యోగ అవకాశాలను భారతీయులు లాక్కుపోతున్నారని అక్కడి యువత ఆవేదన, ఆందోళనలను వెలిబుచ్చుతున్నారు. సాంకేతిక, నిర్మాణ, ఆతిథ్య రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. తక్కువ వేతనాలకే భారతీయులు తమకు దక్కాల్సిన ఉద్యోగాల్లో చేరుతున్నారన్న ఆరోపణ వీరి నుంచి వినిపిస్తుంది. ఈ వలస విధానాల వల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్నది వారి వాదన. ఇది మొదటి కారణంగా చెప్పవచ్చు.

2. వలస ఉద్యోగులతో పెరిగిన జీవన వ్యయం, వనరులపై ఒత్తిడి

కొత్త ఉద్యోగ అవకాశాల కోసం తమ దేశానికి వస్తున్న భారతీయ వలస ఉద్యోగులు ఆ దేశ మౌలిక వసతులు, సదుపాయాలపై ప్రభావం చూపుతున్నారని అమెరికన్లు, ఆస్ట్రేలియన్లు, యూరోపియన్లలో కొందరి వాదన. ముఖ్యంగా నగరాల్లో ఇళ్ల ధరలు పెరగడానికి వలసదారులే కారణమని వారు విమర్శిస్తున్నారు. ఇక, వైద్యం, గృహ నిర్మాణం వంటి వాటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం వలసదారులేనని ఆరోపణలు తలెత్తుతున్నాయి. పరిమిత వనరులు ఉండగా అధిక సంఖ్యలో వలస రావడం వల్ల స్థానికులు అధిక ఖర్చుతో జీవనం సాగించాల్సి వస్తుందని వారు భావిస్తున్నారు. ఈ భారం ప్రభుత్వ కార్యక్రమాలపైన కూడా పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

3. వలసదారులతో సామాజిక, సాంస్కృతిక సమస్యలు

స్థానిక సంప్రదాయాలు, ఆ దేశ విలువలు, జీవన శైలికి భిన్నంగా వలస వచ్చిన వారు ప్రవర్తిస్తున్నారన్న వాదన ఈ దేశాల్లోని స్థానికుల నుంచి వినిపిస్తుంది. మన దేశం నుంచి వచ్చే వారి ఆచార సంప్రదాయాలను కొద్దిమంది పాశ్చాత్య దేశాల వారు తప్పుపడుతున్నారు. కొందరు భారతీయులు ఎవరితో కలవకుండా తమవారితోనే సంబంధాలు కలిగి ఉండటం, స్థానిక సమాజంతో కలవకుండా దూరంగా ఉండటం వంటివి కూడా అక్కడి వారికి నచ్చడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు తమ సంప్రదాయాలను బహిరంగంగా పాటించడాన్ని కూడా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల్లో కొందరు తప్పుపడుతున్నారు. ఇలా సాంస్కృతిక వైవిధ్యం కూడా అక్కడి స్థానికుల్లో సంఘర్షణగా మారిందని చెబుతున్నారు. స్థానిక సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతినేలా వ్యవహారం ముందుకు వెళ్లవచ్చన్న అభద్రతా భావంలో స్థానికులు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కారణంతో కూడా 'ఇండియన్ గో బ్యాక్' అన్న నినాదం పుట్టుకువచ్చినట్లు వారు అభిప్రాయపడుతున్నారు.

4. అక్రమ వలసదారులతో దేశ భద్రతకు ముప్పు అన్న ఆందోళన

సాంస్కృతిక, సంప్రదాయ, జీవన శైలిలో ఉన్న వైరుధ్యాల వల్ల, అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వలసదారుల వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అనుమానం పాశ్చాత్య దేశాల్లోని ఒక వర్గం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆ కారణంగా దేశంలో నేరాల రేటు పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కొన్ని నివేదికలు వలసదారుల వల్ల నేరాల రేటు పెరిగిందని చెబుతున్నాయి. అయితే, ఇది పక్షపాతంతో కూడిన నివేదికలని నిపుణులు కొట్టిపారేస్తున్నా, స్థానికుల్లో ఇలాంటి సర్వేలు కూడా భయాందోళనలు రేపుతున్నాయి. ఇలాంటి కారణాలతో కూడా ఇటీవల ఎక్కువ మంది భారతీయులు ఆ దేశాల్లో కనిపించడం వల్ల 'ఇండియన్ గో బ్యాక్' అనే నినాదం చేస్తున్నారు.

5. రాజకీయ పార్టీల వలస వ్యతిరేక భావాలు

ఈ దేశాల్లోని రాజకీయ పార్టీలు వలస విధానాలపై పరస్పరం రాజకీయంగా రెచ్చగొట్టుకుంటున్నాయి. వలసవాదులను ఒక 'బూచి'గా చూపి కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను రెచ్చగొడుతున్నాయి. వలస వస్తున్న వారి వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, వారిపై పెట్టే ఖర్చు దేశంపై భారం పడుతుందని కొందరు రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం జాతీయ భావాలను రెచ్చగొడుతున్నారు. దీని కారణంగా ఒక వర్గం ప్రజలు ఈ అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. ఇలాంటి వారికి నాయకత్వం వహించే సంఘాలు పుట్టుకొస్తున్నాయి. ఇక, ఆ దేశంలో వలస విధానంపై విమర్శలు ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఓట్లు కురిపించే 'అల్లావుద్దీన్ అద్భుత దీపం'గా మారిందనడంలో సందేహం లేదు

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Donald Trump Assassination Attempt:టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
టర్కీలో ట్రంప్‌పై మర్డర్ అటెంప్ట్‌! క్యాటరింగ్ కంటైనర్‌లో తప్పించుకున్న అమెరికా అధ్యక్షుడు!
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget