Ukraine War Today : ఉక్రెయిన్‌లో 24వ రోజు రష్యా విధ్వంసం ఇలా - ఇవిగో వీడియోలు
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం ఆగడం లేదు. అన్ని వైపులా దాడులు చేస్తోంది. 24వ రోజు ఎంత విధ్వంసం చేసిందో వివరాలు ఇవిగో..
ఉక్రెయిన్, రష్యా మధ్య 24 రోజులుగా భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న రష్యన్ దళాలు.. తమ దాడులను మరింత ఉధృతం చేశాయి. కీవ్ శివార్లలో మిసైళ్ల దాడులను, షెల్లింగ్‌ను మరింతగా పెంచాయి. మరోవైపు పశ్చిమాన ఉన్న లవీవ్ సిటీపైనా బాంబుల వర్షం కురిపించాయి. కీవ్, ఖార్కివ్, ఒడెస్సా.. ఇలా ప్రతి చోట తెల్లవారుజాము నుంచే ఎయిర్ రెయిడ్ సైరన్లు మారుమోగాయి. బాంబులతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇప్పటిదాకా రష్యా వెయ్యికి పైగా మిసైళ్లను ఉక్రెయిన్‌లో ఫైర్ చేసి ఉండొచ్చని అమెరికా అంచనా వేసింది.
రష్యా అత్యంత దారుణంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. అక్కడి అంతర్జాతీయ జర్నలిస్టులు.. పరిస్తితిని తెలిపే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఓ జర్నలిస్టు ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో అక్కడి తాజా పరిస్థితిని తెలియచేస్తుంది.
Good morning, we’re from Ukraine 🇺🇦 pic.twitter.com/dXtsBjz0HI
— Illia Ponomarenko 🇺🇦 (@IAPonomarenko) March 19, 2022
రష్యా పలు చోట్ల ఉక్రెయిన్ భూభాగాల్ని ఆక్రమించుకుంటోంది., సోవియట్ గీతాన్ని ఆలపిస్తూ.. ఆక్రమించినట్లుగా ప్రకటిస్తోంది. ఈ దృశ్యాలు కూడా ఉక్రెనియన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
Russian occupying forces play the Soviet anthem in Kherson while Ukrainian patriots sing the Ukrainian national anthem across the street.
— Visegrád 24 (@visegrad24) March 19, 2022
Sorry Russia. Ukraine will never be in one state with you again.
The country has changed since 1991, every Ukrainian under 50 detests you. pic.twitter.com/UbKL31ghiC
ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా రష్యా మిస్సైల్స్ చేసిన విధ్వంస దృశ్యాలే కనిపిస్తున్నాయి.
Every day that passes, more civilians are killed. Every business relationship with Russia means more money to finance this genocide.
— Klitschko (@Klitschko) March 18, 2022
STOP IT NOW.#StopPutinsWar #FreeUkraine #WeAreAllUkrainians #StandWithUkraine #StopTheWar #StopWar #Ukraine #United #SupportUkraine #StandTogether pic.twitter.com/p1sLsCre7c
ఉక్రెయిన్‌కు పెద్దఎత్తున ఇతర దేశాలు సాయం అందిస్తున్నాయి. లిధువేనియా ప్రజలు తమ కార్లను ఇచ్చేస్తున్నారు . ఈ కార్లు ఉక్రెయిన్ సరిహద్దుల్లో వేల సంఖ్యలో ఉన్నాయి.
Subscribers report that #Lithuanians donate their SUVs for the needs of the territorial defense of #Ukraine
— NEXTA (@nexta_tv) March 18, 2022
Moreover, not empty, but filled with humanitarian aid. pic.twitter.com/OtloCL6NM2
యుద్ధ కారణంగాఅక్కడ దారుణమైన దృశ్యాలే కాదు.. మనసు కదిలించే ఎన్నో సంఘటనలకు సాక్ష్యాలూ లభిస్తున్నాయి. మానవత్వం అంటే ఏమిటో వాటిని చూసినప్పుడే తెలుస్తుంది.
Slovaks making #Ukrainian children smile 🇺🇦.
— Juraj Tomaga (@jurajtomaga) March 18, 2022
🇸🇰 police officers, soldiers # firefighters do their best job for the people coming from Ukraine. The total number of people who came from #Ukraine to #Slovakia is 234,000. mostly women & children. @UNICEF 📽 ➡️ 🇸🇰 #slovakpolice pic.twitter.com/KiYn3wKmDS
రోజులు గడిచిపోతున్నాయి... బాంబులు పేలుతూనే ఉన్నాయి. కానీ యుద్ధానికి అంతం ఎప్పుడో ఎవరికీఅర్థం కావడం లేదు.