అన్వేషించండి

Viral News: రాత్రి దిండు కింద మొబైల్ పెట్టుకుని నిద్రపోయిన మహిళ- తెల్లారేసరికి!

Viral News: రాత్రి దిండు కింద మొబైల్ ఫోన్ పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాలు తీసింది.

Viral News: నిద్రపోయే సమయంలో మొబైల్‌ ఫోన్‌ను తల దగ్గర పెట్టుకోవడం చాలా ప్రమాదమని నిపుణులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. అయితే చాలా మంది ఈ తప్పు చేస్తూనే ఉంటారు. తాజాగా దిల్లీలో అలా చేయడమే ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది.

ఇదీ జరిగింది

దిల్లీలో ఓ మహిళ రెడ్‌మీ 6ఏ మొబైల్ వాడుతోంది. ఎప్పటిలానే రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయి ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆర్మీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

" నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ మొబైల్ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. మాకు సాయం చేయాల్సిన బాధ్యత ఆ మొబైల్ కంపెనీపైనే ఉంది.                                                   "
-     మంజీత్

నెటిజన్ల ఫైర్

ఈ ట్వీట్‌లో మొబైల్ ఫోన్ ఫొటోలు షేర్ చేశాడు. వీటితో పాటు రక్తపు మడుగులో ఉన్న మహిళ ఫొటో కూడా షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీ పై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రెడ్‌మీ కంపెనీ తెలిపింది. 

గతంలో

రెండేళ్ల క్రితం కేరళలో ఇలాంటి ఘటనే జరిగింది. కొల్లాంకి చెందిన ఓ వ్యక్తి తన ఫోనును దిండు కింద పెట్టుకుని నిద్రించాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి భుజం, ఎడమ చేతికి గాయాలయ్యాయి. డ్యూటీ చేసి ఇంటికి వచ్చిన తాను బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నానని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఉలిక్కి పడి లేచే సమయంలో భుజం ఒక్కసారిగా నొప్పి చేసిందని, దిండు కాలిపోతూ, ఫోన్‌ నుండి నిప్పులు చెలరేగాయని బాధితుడు చెప్పాడు. 

Also Read: Bihar News: అడ్మిట్ కార్డులపై ధోని, ప్రధాని మోదీ ఫొటోలు!

Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ఏర్పాటుపై ఆజాద్ కీలక ప్రకటన!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget