News
News
X

West Bengal SSC Scam: స్కామ్‌లో అరెస్టైన మంత్రికి అనారోగ్యం, బాగానే ఉన్నారంటున్న వైద్యులు

West Bengal SSC Scam: పశ్చిమ బెంగాల్‌లో ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో అరెస్ట్ అయిన పార్థ ఛటర్జీ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

FOLLOW US: 

West Bengal SSC Scam:

తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటాం: టీఎమ్‌సీ

స్కూల్ సర్వీస్ కమిషన్‌ స్కామ్‌లో అరెస్ట్ అయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ అస్వస్థకు గురి అయ్యారు. అనారోగ్యం కారణంగా SSKMఆసుపత్రిలో చేరారని పీటీఐ వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ICCUలో చేర్చారు. ఆసుపత్రిలో చేరక ముందు, ఈడీ రెండు రోజుల కస్టడీలో ఉంచాలని నిర్ణయించింది. ఈలోగా ఆయన అస్వస్థకు గురవటం వల్ల హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం కుదుట పడటం వల్ల క్యాబిన్‌కు షిఫ్ట్ చేసినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీజీ సహా మరి కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించినట్టు తెలిపింది. "ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కుదుట పడింది. వైద్యులు ఆయన నిత్యం పర్యవేక్షిస్తున్నారు" అని ఓ ఉన్నత వైద్యాధికారి చెప్పారు. సీనియర్ కార్డియాలజిస్ట్‌ ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రి ఉన్న క్యాబిన్‌ బయట సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక  ఈ వ్యవహారంపై తృణమూల్ అధిష్ఠానం స్పందించింది. మంత్రి అవినీతికి పాల్పడినట్టు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టీఎమ్‌సీ ప్రతినిధి కునాల్ ఘోష్ ఇదే విషయాన్ని వెల్లడించారు. "ప్రస్తుతానికి ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించటం లేదు. అలాగే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి కూడా తప్పించటం లేదు" అని తెలిపారు. 

ఆమెతో పార్టీకి ఎలాంటి సంబంధాల్లేవు..

ఈడీ అరెస్ట్ చేసిన అర్పిత ముఖర్జీకి, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని తృణమూల్ స్పష్టం చేసింది. "న్యాయవ్యవస్థపైన నమ్మకముంది. ఒకవేళ పార్థ ఛటర్జీ తప్పు చేసినట్టు కోర్టు తేల్చి చెబితే, పార్టీ, ప్రభుత్వం కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకుంటుంది" అని కునాల్ ఘోష్ చెప్పారు. స్కూల్ సర్వీస్ కమిషన్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో మంత్రి పార్థ ఛటర్జీని అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అర్పిత ముఖర్జీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ, రూ.20 కోట్లు స్వాధీనం చేసుకుంది. పార్థ ఛటర్జీ ఇతర సన్నిహితులందరి ఇళ్లపైనా ఈడీ దాడులు చేస్తోంది. ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉన్న సమయంలో సెక్రటరీగా ఉన్న సుకాంత అచర్జీతో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న చందన్ మొండల్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. టీచర్ ఉద్యోగం ఇస్తామని పెద్ద మొత్తంలో చందన్ పలువురి నుంచి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. వీరితో పాటు స్కూల్ సర్వీస్ కమిషన్‌లోని ఐదుగురు సభ్యుల కమిటీ కన్వీనర్‌ ఇంట్లోనూ రెయిడ్‌ జరిగింది. ఈ అందరి ఇళ్ల నుంచి కొన్ని డాక్యుమెంట్లు, రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫారిన్ కరెన్సీని రికవరీ చేసినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. 

Also Read: Delhi High Court: రేప్ చేసి పెళ్లి చేసుకుంటే పాపం కడిగేసుకున్నట్టేనా? ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published at : 24 Jul 2022 01:26 PM (IST) Tags: West Bengal trinamool congress West Bengal SSC Scam Partha Chatterjee

సంబంధిత కథనాలు

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Bihar: బిహార్‌లో ఈ అనూహ్య మార్పు వెనక ఆమె హస్తం ఉందా? నితీష్ మనసు ఉన్నట్టుండి ఎలా మారింది?

Venkayya : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Venkayya : దేశ రాజకీయాల్లో ఇక వెంకయ్యనాయుడు పాత్రేంటి ? రాజకీయంగా రిటైర్మెంటేనా ?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

Independence Day 2022: ఈసారి ఎర్రకోటలోని స్వాతంత్య్ర వేడుకలకు ఓ స్పెషాల్టీ ఉంది, అదేంటో తెలుసా?

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ, మునుగోడు ఉపఎన్నికపై చర్చ!

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

Breaking News Live Telugu Updates: యూపీలో 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా- నాలుగు మృతదేహాలు వెలికితీత

టాప్ స్టోరీస్

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

MP Gorantla Madhav Issue : ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ

Rayachoti Crime : కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

Rayachoti Crime :  కోడలి తల నరికిన అత్త, తలతో పోలీస్ స్టేషన్ కు!

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!

కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!