Weather Latest Update: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు వర్షాలు- తెలంగాణలో తగ్గనున్న ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళలో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలు గా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
వేసవి తాపంతో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ విభాగం శుభవార్త చెప్పింది. దేశంలో హీట్ వేవ్ ముగిసిందని, ఇక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది. అతి కొద్ది ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
ఉత్తర - దక్షిణ ద్రోణి పశ్చిమ మధ్య ప్రదేశ్ నుండి విదర్భ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో గురువారం (మే 25) తెలిపారు.
తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు కూడా 30-40 కిలోమీటర్ల తో వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు పడబోతున్నాయని పేర్కొంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం నుంచి మాత్రం పొడి వాతావరణమే కనిపించనుంది. మరో నాలుగు రోజుల పాటు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మళ్లీ 29, 30 తేదీల్లో వర్షాలు కురిచే ఛాన్స్ ఉందని చెబుతోంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 25, 2023
హైదారాబాద్‌లో వెదర్
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం, సాయంత్రం వేళలో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 26 డిగ్రీలు గా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. గురువారం నమోదైన గరిష్ణ ఉష్ణోగ్రత-37.2 డిగ్రీలు, కనిష్ణ ఉష్ణోగ్రత-28డిగ్రీలు
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 25, 2023
తెలంగాణలో 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆరెంజ్ అలర్ట్ జిల్లాలు- ఆదిలాబాద్, కుమ్రంభీమ్ జిల్లా, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, సూర్యపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలు,
— IMD_Metcentrehyd (@metcentrehyd) May 25, 2023
ఆంధ్రప్రదేశ్‌లో కూడా మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర- దక్షిణ ద్రోణి ఇప్పుడు ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉందని వివరించింది. ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది.
7 Day mid-day forecast ( in Telugu)of Andhra Pradesh dated 25.05.2023#IMD#APweather#MCAmaravati#APforecast pic.twitter.com/WY6astzpUE
— MC Amaravati (@AmaravatiMc) May 25, 2023
గురవారం రాత్రి, సాయంత్ర చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కుమ్మేశాయి. తిరుపతిలో కురిసిన వర్షానికి జనజవనం స్తంభించిపోయింది. ఈదురు గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. దీని వల్ల భక్తుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. బాపట్ల జిల్లాలోని చీరాల, పరుచూరు, వేటపాలెం, చిన గంజాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. గుంటూరులో 20 నిమిషాల పాటు గాలివాన బీభత్సం సృష్టించింది.