![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్య వాతావరణం- పగలు వేడి, రాత్రి చలి
అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు.
![Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్య వాతావరణం- పగలు వేడి, రాత్రి చలి Weather in Telangana Andhrapradesh Hyderabad on 16 December 2022 cyclone updates here Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో వైవిధ్య వాతావరణం- పగలు వేడి, రాత్రి చలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/16/24e7ff90e1a653933bbf4479d630c48e1671155875116215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అరేబియా మహా సముద్రంలో ఉన్న వాయుగుండం పశ్చిమ దిశలో కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనం ప్రస్తుతం లేదు. కానీ వచ్చేవారానికి ఓ అల్ప పీడనం బాగా బలపడే అవకాశం ఉంది. తుపాను మాత్రం ప్రస్తుతం బంగాళాఖాతంలో లేదు. అరేబియా సముద్రంలో ఉన్న అలజడి తెలుగు రాష్ట్రాలకు చాలా దూరంలో ఉంది. కాబట్టి, ఏపీ, తెలంగాణపై ఎలాంటి ప్రభావం ఉండబోదు. మరో నాలుగు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు.
అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఉన్న మాండస్ తుపాను భారత భూభాగానికి దూరంగా వెళ్తుంది కాబట్టి, ఆంధ్రా, తెలంగాణ వైపుగా తేమగాలుల ప్రభావం ఉంటుందని తెలిపారు. దీనివల్ల ఉదయం సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి, రాత్రి సమయాల్లో బాగా చలి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఈ వారం చివరి వరకు వర్షాలు లేవు. కాబట్టి ఉష్ణోగ్రతలు మెళ్లగా జోరందుకోనుంది. తెల్లవారి జామున కొన్ని చోట్లల్లో పొగ మంచుతో మొదలైయ్యే వాతావరణం, మధ్యాహ్నానికి కాస్తంత వెచ్చగా ఉంటూ, రాత్రికి చలి తీవ్రత ఉండే అవకాశాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. శనివారం, ఆదివారాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో కూడా సుమిత్రా జలసంధిపై రెండు రోజుల క్రితం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రెండు, మూడు రోజుల్లో పశ్చిమ దిశగా పయనించి శ్రీలంకకు సమీపంలో అల్పపీడనంగా మారొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
శ్రీలంక సమీపంలోకి వచ్చిన అల్ప పీడనం తమిళనాడు వైపుగా గానీ, శ్రీలంక వైపుగాగానీ, శ్రీలంక కింది భాగం నుంచి కూడా వెళ్లే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. తమిళనాడు వైపు ట్రాక్ తీసుకుంటే తప్పకుండా ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. మాండస్ తుపాను సమయంలో పడిన భారీ వర్షాల తరహాలో వర్షాలు ఉంటాయి. రెండో ట్రాక్ తీసుకుంటే స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది. మూడో ట్రాక్ తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్రలో స్వల్ప వర్షాలు పడే అవకాశం ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు. దీని ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు బలపడి ఈనెల 19వ తేదీ నుంచి రాయలసీమ, దక్షిణ, మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.
తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 4 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చలి తీవ్రత పెరగనుంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 15, 2022
— IMD_Metcentrehyd (@metcentrehyd) December 15, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)