By: ABP Desam | Updated at : 15 Dec 2022 05:38 PM (IST)
Edited By: Murali Krishna
ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!
Putin Flu Vaccine: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఫ్లూ వ్యాప్తిని అడ్డుకునే వ్యాక్సిన్ షాట్‌ను తీసుకున్నారు. ఈ మేరకు రష్యన్ వార్తా సంస్థ TASS పేర్కొంది.
రష్యా శానిటరీ చీఫ్ దేశంలో ప్రబలుతున్న శ్వాస సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్ లకు సంబంధించిన నివేదిక అందించిన తర్వాత ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పుతిన్ మాట్లాడుతూ "నేను నిన్న వాక్సిన్ తీసుకున్నాను. నేను నా సహచరులందరికీ కూడా సలహా ఇచ్చాను. నేను ఈ రోజు రోజులాగే ఆటలు ఆడాను. అంత సాధారణంగా ఉంది."అని తెలిపారు.
ఉక్రెయిన్ యుద్ధంతో టెన్షన్‌లో ఉన్న రష్యా నెత్తిన ఇప్పుడు ఫ్లూ సమస్య వచ్చిపడింది. రష్యాలో మరోసారి ఫ్లూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలోని పలు ప్రాంతాలతో పాటు అధ్యక్ష భవనంలోని అధికారులకు కూడా ఈ అంటువ్యాధి సోకింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను బంకర్‌లోని ఐసోలేషన్‌కు తరలించినట్లు సమాచారం.
డేంజర్
రష్యాలో ఫ్లూ వ్యాప్తి ఎక్కువైనట్లు ఈ మధ్య వార్తలు వచ్చాయి. చాలా మంది అధికారులు కూడా ఫ్లూ బారినపడటంతో పార్లమెంటు ఎగువసభలో ప్రసంగానికి పుతిన్ దూరంగా ఉండనున్నారని క్రెమ్లిన్ ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన కాసేపటికే అధ్యక్షుడు పుతిన్‌ను పౌరులకు దూరంగా ఉంచేందుకు బంకర్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. మరోవైపు దేశంలో భారీ స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు రష్యా ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవల
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి పుతిన్ గురించి రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. ఇటీవల పుతిన్ గురించి షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. మాస్కోలోని తన అధికారిక నివాసంలో మెట్లపై నుంచి పుతిన్ (70) జారిపడినట్లు న్యూయార్క్ పోస్టు వెల్లడించింది.
పుతిన్ మెట్లు దిగుతుండగా కాలు జారడంతో ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు తెలిపింది. దీంతో పుతిన్ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొంది. దీనికారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని నివేదికలో తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
పుతిన్ రక్షణ సిబ్బందితో సన్నిహిత సంబంధాలున్న ఓ టెలిగ్రామ్ ఛానెల్ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా న్యూయార్క్ పోస్ట్ ఉటంకించింది.
Also Read: Rafales Landed In India: చైనా గుండెల్లో గుబులు- భారత్ చేరుకున్న చివరి రఫేల్!
Petrol-Diesel Price 30 January 2023: తిరుపతిలో భారీగా పెరిగిన పెట్రోల్ రేటు, తెలంగాణలో స్థిరంగా ధరలు
Gold-Silver Price 30 January 2023: ₹58 వేలను దాటేలా కనిపిస్తున్న పసిడి, కొద్దికొద్దిగా పెరుగుతోంది
ABP Desam Top 10, 30 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
-Rahul Gandhi In Srinagar: ప్రతిపక్షాల మధ్య విభేదాలున్నా, ఆరెస్సెస్- బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతాం: రాహుల్ గాంధీ
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
IND vs NZ 2nd T20: న్యూజిలాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ - మూడో మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే!