Vivek Ramaswamy: వివేక్ రామస్వామిపై అమెరికాలో వర్ణవివక్ష -కలర్‌ను బట్టి ఇండియాకు డిపోర్టు చేయాలని కామెంట్స్
US racist: అమెరికా ప్రజల్లో వర్ణ వివక్ష పెరుగుతోంది. వివేక్ రామస్వామి షేర్ చేసిన ఓ ఫోటోపై ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు.

Vivek Ramaswamy photo with kids faces racist slur again: భారత సంతతికి చెందిన అమెరికన్ రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామిపై వర్ణ వివక్ష చూపిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇటీవల వివేక్ రామస్వామి అతను తన ఇద్దరు పిల్లలను ఎత్తుకుని ఫోటో ధిగాడు. వారి పేర్లు కార్తిక్ , అర్జున్ . ఈ పోస్టు కింద జాత్యాహంకార , వలస వ్యతిరేక వ్యాఖ్యలతో అమెరికన్ నెటిజన్లు ఘోరమైన వ్యాఖ్యలు చేశారు.
వివేక్ రామస్వామి 2024 క్రిస్మస్ వరకు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లతో కలిసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్..మాగా లో చురుకుగా పాల్గొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) లో సహ-చీఫ్‌గా మొదట్లో పని చేశాడు. ఆ సమయంలో అమెరికన్ సంస్కృతిలోని కొన్ని అంశాలను విమర్శించి, H-1B వీసా కార్యక్రమానికి తన గట్టి మద్దతును ప్రకటించాడు. మస్క్ మొదట్లో రామస్వామి యొక్క H-1B వీసాలపై వైఖరిని సమర్థించినప్పటికీ తర్వతా వ్యతిరేకించాడు. ఫలితంగా రామస్వామి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే DOGE నుండి తప్పుకున్నాడు.
It’s why we do it. pic.twitter.com/sPRDQkdSFw
— Vivek Ramaswamy (@VivekGRamaswamy) June 6, 2025
రామస్వామి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికల రేసులో కూడా ఉన్నాడు. తర్వాత ట్రంప్ కు మద్దతుగా రేసు నుండి వైదొలిగాడు.ఇప్పుడు ట్రంప్, మస్క్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో, రామస్వామి తన ఇద్దరు పిల్లలను మోస్తూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు MAGA సంక్షోభంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ, దీనికి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురైంది.
@grok change the background of this photo to a garbage-filled street in India
— Trevor Sutcliffe (@TrevorSutcliffe) June 6, 2025
చాలా మంది వినియోగదారులు రామస్వామిని ఎగతాళి చేశారు. "ఈ భారతీయుడిని అమెరికన్లు ఎందుకు డిపోర్ట్ చేయరు?" అని ఒకరు అడిగారు. "అతన్ని భారతదేశానికి తిరిగి పంపండి... ," అని మరొకరు కామెంట్ చేశారు.
An H1-B would do a better job holding them.
— american-know-nothing (@a_know_nothing) June 6, 2025
They are better than you in every way.
Those kids would be happier being around someone competitive on the global market.
We haven’t forgotten. pic.twitter.com/iRA71FtLEg
కొంత మంది రామస్వామి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యుఎస్‌లో జన్మించని ఎలాన్ మస్క్‌ను ఆమోదించినప్పటికీ, సిన్సినాటిలో జన్మించిన వివేక్ రామస్వామిని ఎందుకు ఆమోదించలేదని అడిగారు. మొత్తంగా రామస్వామిపై వర్ణ వివక్ష అమెరికా సమాజంలో చీలికలను తెలిపేలా ఉంది.
I have a genuine question for all those who are commenting on this post with hate.
— saccidānand (@saccidanand) June 6, 2025
Why is a person born in South Africa to South African & Canadian parents is considered more American than one who is born in the US & lived his entire life in the US?





















