Viral Video: ఫారెస్ట్ ఆఫీసర్లకు థాంక్స్ చెప్పిన ఏనుగు, ఎలాగో చూడండి
Viral video: పిల్ల ఏనుగును సేఫ్‌గా తీసుకొచ్చి అప్పగిచ్చినందుకు అటవీ అధికారులకు తల్లి ఏనుగు థాంక్స్ చెప్పింది.
Viral Video:
పిల్ల ఏనుగుని తీసుకొచ్చినందుకు..
వైల్డ్‌లైఫ్‌కి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. లేటెస్ట్‌గా ఓ ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తమిళనాడులో అటవీ అధికారులకు అది థాంక్స్ చెప్పింది. ఇందుకు కారణమేంటో తెలుసా..? పిల్ల ఏనుగును జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పగించారు అధికారులు. పిల్ల ఏనుగుతో కలిసి తల్లి ఏనుగు ముందుకు నడుస్తూ నడుస్తూ ఉన్నట్టుండి వెనక్కి తిరిగింది. ఏదో మర్చిపోయినట్టుగా ఆగిపోయింది. వెంటనే తొండం ఎత్తి అధికారులకు థాంక్స్ చెబుతున్నట్టుగా సంకేతాలిచ్చింది. ఇది చూసి అధికారులు మురిసిపోయారు. చప్పట్లు కొట్టి వాటిని సాగనంపారు. తమిళనాడు పర్యావరణ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి సుప్రియా సాహు ఇదంతా వీడియో తీశారు. ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు ఒక్కటవుతున్న ఈ క్షణాన్ని చూసి అందరూ వావ్ అంటున్నారు. "అటవీ అధికారులు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. జంతువుల కుటుంబాల్ని కలిపి వాటికి ఎంతో సహకరిస్తున్నారు. బై, థాంక్యూ చెప్పటం మర్చి పోవద్దని ఈ తల్లి ఏనుగు ఎంత బాగా చెప్పిందో" అంటూ పోస్ట్ చేశారు. జంతువులకు పెద్దగా ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవు అని కొందరు వాదిస్తుంటారు. అది నిజం కాదని ఈ వీడియో తేలిపోయింది. ఈ వీడియో చూసిన వాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. "వావ్ ఎంత అద్భుతం. మనుషులకు ఏనుగు థాంక్స్ చెప్పడమా? మనుషులందరూ ఇలా జంతువులకు ఫ్రెండ్లీగా ఉంటే...వాటికి ఈ భూమే స్వర్గంగా అనిపిస్తుంది" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
As dusk falls on Jungles silence returns to valleys & we get ready for rest but somewhere foresters & watchers keep a vigil & continue their efforts to reunite lost families.Dont miss the bye & a thank you by the mother elephant when a young calf got united by #TNForesters yday pic.twitter.com/3fRKd4Tw8T
— Supriya Sahu IAS (@supriyasahuias) September 22, 2022
Oh that mother’s acknowledgment 💖
— Adv. Pritam Bhogale (@PritamBhogale) September 22, 2022
So touching. How grateful and gracious elephants are in thanking the compassionate humans here. If only all humans were like that, it would be paradise for all species on earth.
— Suparna Sankaran (@Suparnastar) September 22, 2022
The bye and Thank you... 😍... Let's remember these lessons of gratefulness forever
— Dharshana Gandhi (@dharshanagandhi) September 22, 2022
Also Read: Heartbreaking Video: ఈ పెద్దాయన డబ్బుని ఎలా లెక్కిస్తున్నాడో చూశారా, ఎమోషనల్ వీడియో
Also Read: Viral Video: గుంతలు పడ్డ రోడ్డుపై ఫోటో షూట్, ఈ అమ్మాయి ఐడియా అదుర్స్