News
News
X

Viral Video: మానవత్వం లేని డాక్టర్- కుక్కను కారుకు కట్టేసి, కిలోమీటర్లు లాక్కెళ్లి!

Viral Video: ఓ శునకాన్ని కారుకు తాడుతో కట్టేసి కిలోమీటర్ల మేర లాక్కెళ్లిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Viral Video: ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు.. కర్కశంగా ప్రవర్తించాడు. ఓ మూగజీవిని తన కారుకు తాడుతో కట్టేసి కిలోమీటర్లు లాక్కెళ్లాడు. కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం కిందపడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది 

రాజస్థాన్‌ జోధ్‌పుర్‌లో ఆదివారం ఓ శునకాన్ని కారుకు కట్టేసి లాక్కెళ్లాడు ఓ వ్యక్తి. రద్దీగా ఉన్న రోడ్డులో తన కారుకు శునకాన్ని తాడుతో కట్టేసి వేగంగా పోనిచ్చాడు. తాడు పొడవు ఎక్కువగా ఉండటంతో ఆ శునకం అటూ ఇటూ ఊగుతూ అత్యంత ప్రమాదకర స్థితిలో పరిగెత్తింది. ఇది గమనించిన ఓ వ్యక్తి  కారును ఆపేందుకు ప్రయత్నించినా డ్రైవర్‌ ఆగలేదు. కారును స్పీడ్‌గా డ్రైవ్‌ చేయడంతో కుక్క వేగంగా పరిగెత్తలేక కిందపడిపోయింది. అయినప్పటికీ అతను మాత్రం కారును ఆపలేదు. 

ఆ తర్వాత కొందరు స్థానికులు కారును అడ్డగించి శునకాన్ని విడిపించారు. ఆ తర్వాత ఎన్జీవోకు సమాచారమివ్వగా వారు వచ్చి శునకాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

డ్రైవర్ ఓ డాక్టర్

ఈ దారుణానికి పాల్పడింది ఓ పేరున్న వైద్యుడని తెలియడం మరింత షాక్‌కు గురి చేస్తోంది. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్లాస్టిక్‌ సర్జన్‌ అయిన రజనీశ్‌ గ్వాలా ఇలా శునకాన్ని కారుతో లాక్కెళ్లాడు. ఆ వీధి శునకం ఎప్పుడు చూసినా తన ఇంటి ముందే ఉంటుందని, అందుకే దూరంగా పంపించేందుకు ఇలా చేశానని ఆ వైద్యుడు చెప్పడం కొసమెరుపు.

వైద్యుడు చేసిన ఈ అమానుష చర్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను ఎన్జీవో సంస్థ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సదరు వైద్యుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. అతని లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యుడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

" ఈ పని చేసిన వ్యక్తి డాక్టర్ రజనీశ్ గ్వాలా. ఇలా చేయడం వల్ల ఈ కుక్క కాళ్ళకు ఫ్రాక్చర్ అయింది. ఈ సంఘటన శాస్త్రి నగర్ జోధ్‌పుర్‌లో జరిగింది. దయచేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. ప్రభుత్వం వెంటనే ఈ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేయాలి. అతనిపై చర్యలు తీసుకోవాలి.                                        "
-  డాగ్ హోం ఫౌండేషన్

Also Read: Kejriwal On AAP Party: 'ఆప్‌ పుట్టుకకు దేవుడే కారణం- గుజరాత్‌లో మా విజయం తథ్యం'

Also Read: Mukesh Ambani: గురువాయూర్ క్షేత్రాన్ని సందర్శించిన అంబానీ- రికార్డ్ స్థాయిలో భారీ విరాళం!

Published at : 19 Sep 2022 12:45 PM (IST) Tags: Viral video Jodhpur Dog Tied To A Car Case Registered Against Driver

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: టీడీపీ నాయకుల వెరైటీ నిరసన, బురదలో కూర్చొని నినాదాలు

Breaking News Live Telugu Updates: టీడీపీ నాయకుల వెరైటీ నిరసన, బురదలో కూర్చొని నినాదాలు

Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం

Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం

NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Cocaine Seized In Mumbai: లోదుస్తుల్లో దాచి కొకైన్ అక్రమ రవాణా- ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న అధికారులు!

Cocaine Seized In Mumbai: లోదుస్తుల్లో దాచి కొకైన్ అక్రమ రవాణా- ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్న అధికారులు!

టాప్ స్టోరీస్

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?

Prabhas Viral Video : దర్శకుడిపై ప్రభాస్ సీరియస్ - రూమ్‌కు పిలిచి స్ట్రాంగ్ క్లాస్ పీకారా?