Viral Video: ఇదేం కొవిడ్ టెస్ట్ రా నాయనా! కింద పడేసి, మీద కూర్చొని!
Viral Video: కరోనా పేరుతో చైనాలో రోజురోజుకు అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. కరోనా పరీక్షలను బలవంతంగా చేస్తోన్న వీడియోలు చూసి జనాలు అవాక్కవుతున్నారు.
Viral Video: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే చైనాలో మాత్రం కరోనా ఉద్ధృతి కాస్త ఎక్కువగానే ఉంది. కరోనా మాట దేవుడెరుగు ముందు.. ఆంక్షలు పేరుతో జనాలను చంపేస్తోంది చైనా సర్కార్. కఠిన లాక్‌డౌన్‌లతో చైనాలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా మరో వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఏముందో మీరే చూడండి.
这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
ఇదేం టెస్ట్‌రా!
ప్రస్తుతం చైనా అధికారుల తీరును చూస్తుంటే కరోనా వైరస్ కంటే లాక్‌డౌన్‌తోనే చైనా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. షాంఘై వంటి నగరాల్లో భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు జరుపుతోన్న తీరే ఇందుకు నిదర్శనం. కొవిడ్ నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించిన ఓ యువతిని బలవంతంగా నేలపై పడేసి శాంపిల్‌ను సేకరిస్తోన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Chinese government breaking this grandpa's home to force him take a mandatory Covid test. pic.twitter.com/oZ6dGMfFjt
— Songpinganq (@songpinganq) March 19, 2022
Chinese government forcing grandma take a mandatory Covid test pic.twitter.com/tD1aZCdj6v
— Songpinganq (@songpinganq) March 19, 2022
కొవిడ్ టెస్టుకు నిరాకరించిన ఓ వృద్ధురాలి కాళ్లను గట్టిగా పట్టుకొని శాంపిళ్లను సేకరించడం మరో వీడియోలో కనిపించింది. ఇలా షాంఘైతో పాటు పలు చైనా నగరాల్లో కొనసాగుతోన్న క్రూరమైన కొవిడ్ టెస్ట్‌లను చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.
లాక్‌డౌన్
లాక్‌డౌన్, ఆంక్షల పేరుతో చైనా సృష్టిస్తోన్న అరాచకాలను అమెరికా సహా ప్రపంచ దేశాల వార్తా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి. ప్రశ్నించేవారిపై అతి క్రూరంగా ప్రవర్తిస్తూ, అమానవీయ ఘటనలకు తెగబడుతున్నారు చైనా అధికారులు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లు, నివాస ప్రాంగణాల నుంచి బయటకు రాకుండా గేట్లను ఇనుపరాడ్లతో వెల్డింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కఠిన ఆంక్షలతో చైనా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. మరి ఇప్పటికైనా జిన్‌పింగ్ సర్కార్ కరుణిస్తుందా?
Also Read: China Building Collapse: కుప్పకూలిన 6 అంతస్తుల భవనం- 53కు చేరిన మృతుల సంఖ్య
Also Read: Assam News: పోలీస్ ఆన్ డ్యూటీ- కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన లేడీ సింగం!