News
News
X

Viral Video: కారు డోర్‌ తీసేటప్పుడు చూసుకోండి- షాకింగ్ వీడియో షేర్ చేసిన పోలీస్!

Viral Video: ఓ కారు డ్రైవర్ చేసిన నిర్లక్ష్య పని వల్ల బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Viral Video: రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజీలు చూస్తే ఒక్కోసారి ఒళ్లు గగుర్పుడుతుంది. అయితే కొంతమంది అజాగ్రత్త వల్ల, నిర్లక్ష్యం వల్ల వేరొకరు బలైపోతుంటారు. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

రోడ్డుపై నిలిచిన ఓ కారు డోర్‌ను లోపల నుంచి డ్రైవర్‌ ఒక్కసారిగా తెరిచాడు. దీంతో ఆ కారు పక్కగా బైక్‌పై వెళ్తున్న వారు షాక్‌ అయ్యారు. బైక్‌ను ఒక్కసారిగా పక్కకు మళ్లించడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రమాదానికి గురయ్యారు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకులను కాపాడేందుకు పరుగున వారి వద్దకు వెళ్లారు. అయితే వారి పరిస్థితి ఏమిటన్నది తెలియలేదు.

బెంగళూరు తూర్పు డివిజన్‌ ట్రాఫిక్‌ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) కళా కృష్ణస్వామి ఈ ప్రమాదానికి సంబంధించిన  వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

News Reels

సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా ఇది పాత వీడియోగా తెలుస్తోంది. 2017 ఏప్రిల్‌ 19న ఈ ప్రమాదం జరిగినట్లు అందులో ఉంది. బెంగళూరు తూర్పు డివిజన్‌ ట్రాఫిక్‌ డీసీపీ కళా కృష్ణస్వామి ఈ వీడియోను ట్విట్టర్‌లో బుధవారం పోస్ట్‌ చేశారు.

" డ్రైవర్ల అజాగ్రత్త ఒక్కోసారి ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుంది. దయచేసి మీరు మీ వాహనం తలుపులు తెరిచినప్పుడు అప్రమత్తంగా ఉండండి. ప్రాణాంతక ప్రమాదాలను నివారించండి.                                                           "
- కళా కృష్ణస్వామి, ట్రాఫిక్ డీసీపీ

వైరల్

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇటీవల కొండ చరియలు విరిగిపడ్డాయి. తర్సాలి గ్రామ సమీపంలో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్నప్పుడు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Also Read: UP Politics: ఎస్‌పీ చీఫ్‌గా మరోసారి అఖిలేశ్- అధికారాన్ని లాగేసుకున్నారని BJPపై విమర్శలు

Also Read: Lakhimpur Bus Accident: గాయపడిన చిన్నారిని చూసి బోరున ఏడ్చిన ఐఏఎస్ ఆఫీసర్!

Published at : 29 Sep 2022 04:58 PM (IST) Tags: Video Police Officer Tweets Accident Video Message To Careless Drivers

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Petrol-Diesel Price, 29 November 2022: డీజిల్‌ కొట్టించాలంటే మాత్రం ఈ జిల్లాల్లో బెటర్!

Gold-Silver Price 29 November 2022: 53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold-Silver Price 29 November 2022:  53వేల రూపాయల కంటే దిగువకు బంగారం- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

AP Police Recruitment: ఏపీలో 6,511 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

Men Suicide: పాపం మగ మహారాజులు - కొంచెం సాఫ్ట్ కార్నర్ చూపించి ఏడ్వనివ్వండి !

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, పూర్తి వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు