By: ABP Desam | Updated at : 09 Jan 2022 06:46 PM (IST)
Edited By: Murali Krishna
వరుణ్ గాంధీకి కరోనా
భారతీయ జనతా పార్టీ ఎంపీ వరుణ్ గాంధీకి కరోనా సోకింది. తనకు కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు. పిలిభిట్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు రోజులుగా నియోజకవర్గంలో పర్యటించానని ఆయన అన్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కొవిడ్ కేసులు ఎక్కువవడంపై వరుణ్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
After being in Pilibhit for 3 days, I have tested positive for COVID with fairly strong symptoms.
— Varun Gandhi (@varungandhi80) January 9, 2022
We are now in the middle of a third wave and an election campaign.
The Election Commission should extend precautionary doses to candidates and political workers as well.
అంతేకాకుండా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల కార్యకర్తలకు బూస్టర్ వ్యాక్సిన్ డోసు ఇచ్చేలా ఎన్నికల సంఘం చూడాలని కోరారు. లేకపోతే ఎన్నికల ప్రచారంతో కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు.
ప్రముఖులకు కరోనా..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో సామాన్యులకు ఎక్కువగా కరోనా సోకగా థర్డ్ వేవ్‌లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. వీరందరికీ ఇటీవల కరోనా వచ్చింది.
మోగిన ఎన్నికల నగారా..
దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. ఏడు విడతలుగా ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అన్ని రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ మార్చి 10న నిర్వహించనున్నారు.
Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Google AI Course: ఉచిత ఏఐ కోర్సులు అందిస్తున్న గూగుల్, పూర్తి చేసిన వారికి బ్యాడ్జ్‌లు
TSLPRB: పోలీసు అభ్యర్థులకు అలర్ట్, వివరాల్లో తప్పుల సవరణకు చివరి అవకాశం!
Weather Latest Update: నేడు అక్కడక్కడా వడగాలులు, ఇంకో 3 రోజులు ఎండ అధికమే - కారణమేంటో ఐఎండీ
ABP Desam Top 10, 6 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Gold-Silver Price Today 06 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Sunny Leone Pictures : సన్నీ లియోన్‌కి నచ్చిన బికినీ - ప్రతిరోజూ అలా నడిస్తేనా...