అన్వేషించండి

Vantara Elephant Madhuri Kolhapur: కొల్హాపూర్‌కు ఏనుగు మాధురి తిరుగు ప్రయాణం - నిరంతర వైద్య సాయంపై వంతారా భరోసా!

HPC Elephant Order: కొల్హాపూర్ ఏనుగు మాధురి సంరక్షణపై వంతార కీలక ప్రకటన చేసింది. హెచ్‌పిసి ఆదేశాల మేరకు వైద్య సేవలు కొనసాగిస్తామని తెలిపింది.

Vantara Jamnagar Elephant Care :  మహారాష్ట్రలోని కొల్హాపూర్ ప్రజలతో దశాబ్దాల అనుబంధం కలిగిన 36 ఏళ్ల ఏనుగు  మాధురి  (మహాదేవి) తిరిగి తన సొంత గూటికి చేరుకుంటోంది. జామ్‌నగర్‌లోని తమ సంరక్షణ కేంద్రం నుంచి మాధురి కొల్హాపూర్‌కు బయలుదేరినప్పటికీ,    ఆరోగ్యం, సంక్షేమంపై తమ బాధ్యత, పర్యవేక్షణ ముగిసిపోదని ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ సంస్థ  వంతారా  స్పష్టం చేసింది. మాధురి  ఎక్కడ ఉన్నా ప్రాణ రక్షణ, శ్రేయస్సే తమకు ముఖ్యమని పేర్కొన్న సంస్థ.. మాధురి సంరక్షణకు అవసరమైన పూర్తి వైద్య, మౌలిక వసతుల సహకారాన్ని నిరంతరం అందిస్తూనే ఉంటామని అధికారికంగా ప్రకటించింది.

2025 జూలై 30న వంతారాకూ మాధురి

గతంలో మాధురి ఆరోగ్యం క్షీణించడం, జీవన పరిస్థితులపై జంతు సంరక్షణ అధికారులు, పెటా  ఇండియా వ్యక్తం చేసిన ఆందోళనలతో న్యాయపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. హై-పవర్డ్ కమిటీ ఆదేశాలతో పాటు బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల అనంతరం 2025 జూలై 30న మాధురిని జామ్‌నగర్‌లోని రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ వంతారా కు తరలించారు. తాము స్వచ్ఛందంగా ఏనుగు కస్టడీని కోరలేదని, అత్యున్నత న్యాయస్థానాలు, సాధికార కమిటీ ఆదేశాల ప్రకారమే ఆమె వైద్య బాధ్యతలను స్వీకరించామని వంతారా వెల్లడించింది. అయితే, కొల్హాపూర్‌లోని నందనీ జైన మఠంతో పాటు అక్కడి ప్రజలకు మాధురితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్ని తాము పూర్తిగా గౌరవిస్తామని సంస్థ పేర్కొంది.

ప్రతి  షరతును అమలు చేస్తామన్న వంతారా

సుప్రీంకోర్టు తాజా మార్గదర్శకాల మేరకు ఇరువర్గాల వాదనలను విన్న హై-పవర్డ్ కమిటీ.. నందనీ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి కొన్ని కఠిన నిబంధనలతో మాధురిని కొల్హాపూర్‌కు తిరిగి పంపేందుకు అనుమతినిచ్చింది. మాధురిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరేగింపుల్లో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ ఉపయోగించరాదని హెచ్‌పీసీ స్పష్టమైన ఆంక్షలు విధించింది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి  నిపుణులైన వైద్యులతో ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. హెచ్‌పీసీ తీసుకున్న ఈ నిర్ణయానికి తాము సంపూర్ణంగా కట్టుబడి ఉంటామని, నిర్దేశించిన ప్రతి షరతును అమలు చేయడంలో సహకరిస్తామని వంతారా ప్రకటించింది.

ఇంకా పూర్తిగా కోలుకోని మాధురి

అయితే, వంతారాలో అందించిన అత్యాధునిక చికిత్సతో మాధురి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు అదుపులోకి వచ్చినప్పటికీ,   ఇంకా పూర్తిగా కోలుకోలేదని వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికీ ఏనుగు మాధురికి నిరంతర పర్యవేక్షణ, సపోర్టివ్ కేర్ ఎంతో అవసరమని తెలిపాయి. ఇందుకోసం నందనీ ఆవరణలో అవసరమైన వైద్య పరికరాలు, షెల్టర్, అత్యవసర మందులను సమకూర్చడంలో వంతారా పూర్తి సహకారం అందించింది. హెచ్‌పీసీ ఆదేశాలకు అనుగుణంగా తమ వెటర్నరీ వైద్యుల బృందం ప్రతి పక్షం రోజులకు కొల్హాపూర్ వెళ్లి మాధురి ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి, అధికారిక నివేదికలను సంబంధిత శాఖలకు సమర్పిస్తుందని స్పష్టం చేసింది.

తామే బాధ్యత తీసుకుంటామని తెలిపిన వంతారా

మాధురి నివసించే ప్రాంతం కంటే ఆమెకు అందే వైద్యం, జంతు సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యమని వంతారా  ప్రకటించింది. వాస్తవాలు, వెటర్నరీ సైన్స్, చట్టబద్ధమైన ప్రక్రియలను గౌరవిస్తూ మూగజీవాల రక్షణకు నిబద్ధతతో పనిచేయడమే తమ విధానమని సంస్థ తెలిపింది. ఈ ప్రక్రియలో మార్గదర్శనం చేసిన సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హెచ్‌పీసీలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు, జైన మఠం, కొల్హాపూర్ ప్రజలు, పెటా ఇండియాకు వంతారా కృతజ్ఞతలు తెలిపింది. మాధురి సుదీర్ఘకాలం పాటు సంపూర్ణ ఆరోగ్యంతో, గౌరవప్రదమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని సంస్థ ఆకాంక్షించింది.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Hyderabad Kangaroos : హైదరాబాద్ జూకు కొత్త మెరుపులు - వంతారా నుంచి కంగారూలు, లెమూర్ల రాక!
హైదరాబాద్ జూకు కొత్త మెరుపులు - వంతారా నుంచి కంగారూలు, లెమూర్ల రాక!
Mega Jersey Deal: MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు
MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు
ABP Desam Top 10, 22 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 22 October 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Advertisement

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
Embed widget