Valentine's Day 2023: వాలెంటైన్స్ డే జరుపుకోవద్దు, బయట కనిపిస్తే కర్రలతో బుద్ధి చెబుతాం - యూత్‌కి వార్నింగ్ ఇచ్చిన ఆ సంస్థ
Valentine's Day 2023: ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దంటూ ఆల్ ఇండియా హిందూమహాసభ వార్నింగ్ ఇచ్చింది.
Valentine's Day 2023:
గ్రీటింగ్ కార్డ్‌లు కాల్చేస్తూ...
ఫిబ్రవరి 14వ తేదీ ఎప్పుడొస్తుందా అని ప్రేమికులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఎలా సెలబ్రేట్ చేసుకుందామా అని ఇప్పటికే ప్లాన్‌లు కూడా రెడీ చేసుకున్నారు. లవర్స్ డేని సపోర్ట్ చేసే వాళ్లెంత మంది ఉన్నారో...వ్యతిరేకించే వాళ్లూ అంత మంది ఉన్నారు. ముఖ్యంగా కొన్ని సంఘాలు వాలెంటైన్స్ డే రోజు అన్ని పార్క్‌లు, థియేటర్లలోకి వెళ్లి లవర్స్‌పై దాడులకు దిగుతుంటాయి. అక్కడికక్కడే పెళ్లిళ్లు చేసేస్తాయి. ఈ క్రమంలోనే యూపీలోని ఆల్ ఇండియా హిందూ మహాసభ సంఘం ప్రేమికులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రేమికుల దినోత్సవం జరుపుకోడానికి వీల్లేదని హెచ్చరించింది. ముజఫర్‌నగర్‌లో రోడ్లపైకి వచ్చి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డ్‌లను కాల్చేసింది. రెస్టారెంట్‌లు, హోటళ్లలో ఎక్కడా ప్రేమికులు కనిపించకూడదని తేల్చి చెప్పింది. అలా కనిపిస్తే తగిన పాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చింది.
"ప్రేమికుల దినోత్సవం మన సంస్కృతి కాదు. మేం మొదటి నుంచి దీనిని వ్యతిరేకిస్తున్నాం. యువతకు మేం చెప్పేది ఒకటే. వాలెంటైన్స్ డే జరుపుకోవడాన్ని మానుకోండి. రెస్టారెంట్‌లు, హోటళ్లలో ఎలాంటి అశ్లీల సంఘటనలు జరగకూడదు. హోటల్ యాజమాన్యాలనూ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటి అసాంఘిక కార్యకలాపాలను సపోర్ట్ చేయకండి. ఈ పేరు చెప్పుకుని మైనర్‌లను కొందరు లైంగికంగా వేధిస్తారు"
-ఆల్ ఇండియా హిందూ మహాసభ
ప్రేమికుల రోజున అన్ని హోటళ్లు, పార్క్‌లు, రెస్టారెంట్‌లకూ వెళ్తామని...ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే తప్పకుండా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
"అన్ని చోట్లా నిఘా పెడతాం. ఎవరైనా అతిగా ప్రవర్తిస్తూ కంటపడితే ఊరుకోం. ఇప్పటికే కర్రలు సిద్ధం చేశాం. వాటికి నూనె కూడా రాసి ఉంచాం. వాటికి పని చెప్పాల్సి ఉంటుంది"
- ఆల్ ఇండియా హిందూ మహాసభ
వింత వేడుకలు..
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. తన ప్రేమను వ్యక్తం చేయడానికి యువకుడు తన ప్రేయసికి వెదురుతో చేసిన దువ్వెన ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. దీనర్థం ఆ వ్యక్తికి ఆ అమ్మాయి అంటే ఇష్టమని, తనతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాడని, తనను తన లైఫ్ లోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాడని.
ప్రియుడు ప్రేమికుల రోజు అందించిన ఆ వెదురు దువ్వెన ఇద్దరికి ఎంతో ప్రత్యేకం. నిజానికి ఆదివాసీలు నేటికీ తమ పాత సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. గిరిజన సమాజంలో, ధృవ కులానికి చెందిన యువకులు అందమైన వెదురు బుట్టలు, వెదురు దువ్వెనలను బహుమతిగా ఇవ్వడం ద్వారా తమ ప్రేమను వ్యక్తం చేస్తారు. ఆ అబ్బాయి అమ్మాయికి ఇష్టమైతే తాను బంగారు, వెండి గీతలు ఉన్న చెక్క గొడ్డలిని తిరిగి అందిస్తుంది. అలా ఆ యువకుడు వ్యక్తం చేసిన ప్రేమకు సమాధానం ఇస్తుంది. ఈ కానుకలను ఇరు వర్గాల వారు అంగీకరిస్తే, కుటుంబాలు వారికి కుల ఆచార వ్యవహారాలతో గ్రామంలో వివాహం చేస్తారు. ప్రకృతిని ప్రేమించే గిరిజనులు తమ జీవిత భాగస్వాములకు అలాంటి బహుమతులను ఇస్తారు. అలాంటి బహుమతులతో గిరిజనలు తమ జీవితాన్ని జరుపుకుంటారు. ఇది చాలా కాలం నుండి వస్తున్న సాంప్రదాయం.
Also Read: Go Ahead Fire Me: ఉద్యోగం పోతే పోయింది కానీ చాలా హ్యాపీగా ఉంది, నచ్చిన పని చేసుకుంటాం - నయా ట్రెండ్