US PERM Labor Certification Suspension: అమెరికాలో ఐటీ దిగ్గజాలకు భారీ షాక్ - పెర్మ్ సస్పెన్షన్.. భారత టెక్కీల గ్రీన్ కార్డ్ ఆశలు గల్లంతు!
US PERM Suspension: TCS, ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ సహా ప్రధాన ఐటీ సంస్థలపై US లేబర్ డిపార్ట్‌మెంట్ 'PERM' సస్పెన్షన్ వేటు వేసింది. దీని వల్ల గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ నిలిచిపోతుంది.

US Department of Labor PERM Ban: అమెరికాలో ఐటీ రంగంలో పనిచేస్తూ శాశ్వత నివాస హోదా పొందాలని ఆశపడుతున్న వేలాది మంది భారతీయ నిపుణులకు అమెరికా ప్రభుత్వం తీరని గుండెకోత మిగిల్చింది. అమెరికన్ల ఉద్యోగ అవకాశాలు, వేతన భద్రతను పరిరక్షించడమే ధ్యేయంగా వైట్‌హౌస్ వేదికగా జరిగిన అత్యున్నత సమావేశంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ సంచలన నిర్ణయం ప్రకటించింది. వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నేతృత్వంలోని యాంటీ ఫ్రాడ్ టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణలో ఐటీ ఔట్‌సోర్సింగ్ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ , ఇన్ఫోసిస్, విಪ್ರో, హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, కాప్‌జెమినిలతో పాటు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అడోబ్ వంటి సంస్థలపై పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ కార్యక్రమం నుంచి తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఇకపై ఈ సంస్థల నుంచి కొత్త పెర్మ్ దరఖాస్తులు స్వీకరించబోమని, ప్రస్తుతం ప్రాసెసింగ్‌లో ఉన్న ఫైళ్లను కూడా తక్షణమే నిలిపివేస్తున్నామని తేల్చిచెప్పింది.
BREAKING: VP JD Vance takes aim at Microsoft, accusing the tech giant of laying off thousands of American workers while bringing in foreign workers to replace them through the H-1B visa system. "There has been no company in the United States, unfortunately, that has abused the system more than Microsoft." Vance points to 6,000 layoffs alongside what he says were 6,300 H-1B visas and nearly 3,000 green cards, arguing that the numbers raise serious questions about how American workers are being treated. Download the FOX News app for the latest details: https://t.co/ISpW9Fc0R3
— Fox News (@FoxNews) October 8, 2026
అసలు అమెరికాలో విదేశీ ఉద్యోగికి EB-2, EB-3 కేటగిరీల కింద గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రారంభించాలంటే ఈ పెర్మ్ ప్రక్రియే అత్యంత కీలకమైన, చట్టబద్ధమైన మొదటి మెట్టు. సదరు ఉద్యోగానికి అవసరమైన అర్హతలున్న అమెరికన్ పౌరులు ఎవరూ స్థానికంగా అందుబాటులో లేరని, విదేశీయుడిని నియమించడం వల్ల స్థానిక వర్కర్ల వేతనాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడటం లేదని కంపెనీలు సాక్ష్యాధారాలతో కార్మిక శాఖకు నిరూపించి సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. ఈ అనుమతి వచ్చిన తర్వాతే కంపెనీలు యూఎస్‌సీఐఎస్ వద్ద ఐ-140 పిటిషన్ దాఖలు చేసే అర్హత సాధిస్తాయి. ఇప్పుడు ఈ ప్రధాన రహదారినే అమెరికా మూసివేయడంతో సదరు దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల తరఫున గ్రీన్ కార్డ్ ప్రక్రియను ప్రారంభించే అర్హతను కోల్పోయాయి.
గత కొన్నేళ్లుగా అమెరికా హెచ్-1బీ మరియు పెర్మ్ నిబంధనలను ఈ ఔట్‌సోర్సింగ్ కంపెనీలు పక్కదారి పట్టిస్తున్నాయని, లొసుగులను ఆసరాగా చేసుకుని విదేశీ నిపుణుల రిక్రూట్‌మెంట్‌లో తీవ్ర దుర్వినియోగానికి పాల్పడ్డాయని ఫెడరల్ దర్యాప్తు బృందాలు నిర్ధారించాయి. దాదాపు 30 లక్షల మంది విదేశీయుల కోసం దరఖాస్తులు చేసి, 2.3 లక్షలకు పైగా హెచ్-1బీ అనుమతులు, లక్షకు పైగా పెర్మ్ సర్టిఫికేషన్లు పొందడం ద్వారా అమెరికన్ పౌరులకు చెందాల్సిన స్థానిక ఉద్యోగ అవకాశాలను దెబ్బతీశారని కార్మిక శాఖ మండిపడింది. తీవ్ర ఫెడరల్ విచారణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్థానిక కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
US suspends some of major Indian firms and labelled them as “head of snake” https://t.co/x8i5dggch5
— Dr. Khurram Abbas (@itskhurramabbas) October 8, 2026
ఈ ఊహించని పరిణామం అమెరికాలోని భారతీయ ఐటీ రంగానికి, గ్రీన్ కార్డ్ ఆశావహులకు కోలుకోలేని పెద్ద షాక్‌గా మారింది. సదరు ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తూ ఇప్పటికే పెర్మ్ అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూస్తున్న వేలాది మంది సీనియర్ టెక్కీల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంలో పడింది. కొత్త దరఖాస్తుల నిలిపివేతతో పాటు పెండింగ్ ఫైల్స్ ప్రాసెస్ కాకపోవడం వల్ల గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ మరింత పెరిగిపోయి, ప్రాసెసింగ్ కాలవ్యవధి దశాబ్దాల పాటు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ఉద్యోగుల హెచ్-1బీ గడువు పొడిగింపులు, ఆన్-సైట్ ఉద్యోగ భద్రత తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.
అమెరికన్ అధికారుల తాజా చర్యలు భారతీయ ఐటీ కంపెనీల వ్యాపార నమూనా , ఆన్-సైట్ డిప్లాయ్‌మెంట్ వ్యూహాలపై కోలుకోలేని ప్రభావం చూపే అవకాశం ఉంది. కార్మిక శాఖ సదరు కంపెనీల అంతర్గత రిక్రూట్‌మెంట్ విధానాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించి, తనిఖీలను పూర్తి చేసి సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకు ఆయా సంస్థల్లోని విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ దిశగా అడుగులు పడటం అసాధ్యంగా మారింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్లోబల్ టెక్ వర్క్‌ఫోర్స్ సమీకరణాలు ఊహించని మలుపు తిరిగాయి.
ట్రెండింగ్ వార్తలు






















