అన్వేషించండి

US Birthright Citizenship: యూఎస్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్.. డొనాల్డ్ ట్రంప్‌నకు షాకిచ్చిన కోర్టు

US Birthright Citizenship: యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అమెరికా పౌరసత్వంపై ట్రంప్ ఉత్తర్వులను కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.
  • బర్త్ టూరిజం అరికట్టడమే ట్రంప్ ఆదేశాల ముఖ్య ఉద్దేశ్యం.
  • పుట్టుకతో పౌరసత్వం 14వ సవరణ ప్రకారం సుప్రీంకోర్టు సమర్థించింది.

US Birthright Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై పరిమితులు విధిస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. విదేశీయుల పిల్లలకు వర్తించే బర్త్ రైట్ సిటిజన్‌షిప్, బర్త్ టూరిజాన్ని నిషేధించాలనే లక్ష్యంతో ఇటీవల ట్రంప్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అక్రమ వలసదారులు, తాత్కాలిక వీసాలపై వచ్చిన వారి పిల్లలు అమెరికాలో పుడితే.. వారిని దేశ పౌరులుగానే భావించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశీయుల పిల్లలకు పౌరసత్వం నిరాకరించాలనే ట్రంప్ ప్రయత్నాలకు మరోసారి కోర్టు అడ్డుకుంది. 

Also Read: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు

బర్త్ టూరిజం లక్ష్యంగా

మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి డెబోరా బోర్డ్‌మన్ ఈ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు.  2025లో ట్రంప్ తీసుకొచ్చిన ఉత్తర్వులు నిలిపివేస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు అమెరికన్ పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయిన చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని వారి పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయడం.. యూఎస్ రాజ్యాంగంలోని 14వ సవరణలోని పౌరసత్వ నిబంధనను ఉల్లంఘిస్తోందని ఈ ఏడాది జూన్ 30న యూఎస్ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ నిబంధన ఆసరా చేసుకుని తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చేలా చేయడానికి, ప్రసవం కోసం మహిళలు యూఎస్ వస్తున్నారని, "బర్త్ టూరిజం"ను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఆగస్టు 6న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. 

యూఎస్‌లో పుట్టిన పిల్లల తల్లిదండ్రులలో ఒకరు విదేశీ ప్రభుత్వాల కోసం పనిచేసినా, పౌరసత్వం పొందడానికి మోసానికి లేదా వాణిజ్య లావాదేవీకి పాల్పడినా వారిని "విదేశీ శత్రువు"గా పరిగణించి పిల్లలకు పౌరసత్వం తిరస్కరించవచ్చని ట్రంప్ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వులను సైతం కోర్టు నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.   


Also Read: యుద్ధం వేళ ఇరాన్ అధ్యక్షుడితో మోదీ కీలక భేటీ- అందరి కళ్లూ వీరిపైనే! ఎందుకింత ప్రాధాన్యం

చట్టాలు ఏం చెబుతున్నాయి? 

1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టేవారందరికీ (అక్రమవలసదారులు లేదా తాత్కాలికంగా ఉంటున్నా వారు) ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే బర్త్ టూరిజం పేరిట దీనిని దుర్వినియోగం చేస్తున్నారని ట్రంప్ వాదిస్తున్నారు. పుట్టబోయే బిడ్డకు విదేశీ పౌరసత్వం పొందాలనే లక్ష్యంతో ప్రసవం కోసం గర్భిణీలు అమెరికా వస్తున్నారని ఆరోపిస్తున్నారు.  

Also Read: జనరల్ జావో జోంగ్కీపై చైనా ప్రభుత్వం వేటు.. గల్వాన్ లోయలో భారత్‌పై దాడికి ఆదేశించడమే కారణమా ?

Frequently Asked Questions

ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై ఎలాంటి ఆంక్షలు విధించేందుకు ప్రయత్నించారు?

పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై ఆంక్షలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా విదేశీయులు లేదా తాత్కాలిక వీసాలపై వచ్చిన వారి పిల్లలకు పౌరసత్వాన్ని నిరాకరించాలని కోరారు.

ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు తీర్పు ఏమిటి?

యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను నిలిపివేసింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై ఆంక్షలు విధించే ఆయన ప్రయత్నాలకు కోర్టు అడ్డుకుంది.

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ పౌరసత్వం గురించి ఏం చెబుతుంది?

1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం, అమెరికాలో పుట్టిన వారందరికీ (అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక నివాసితులతో సహా) ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2026:హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
హైదరాబాద్‌లో సదరన్ రైజింగ్ సమ్మిట్ .. షేపింగ్ ఇండియాస్ నెక్ట్స్ థీమ్‌తో దక్షిణాది ప్రగతిపై మేధోమథనం.. హాజరయ్యే ప్రముఖులు వీరే!
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
AP Economic Regions: ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
ఏపీ అభివృద్ధికి మూడు ఎకనమిక్ రీజియన్లు.. విశాఖ, తిరుపతి, అమరావతి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష!
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget