By: ABP Desam | Updated at : 01 Feb 2023 02:16 PM (IST)
Edited By: jyothi
ఆరోగ్య రంగంపై మోదీ ప్రభుత్వం భారీ ప్రకటన, ఏంటంటే?
Union Budget 2023: ఈరోజు 2023 సంవత్సరానికి దేశ బడ్జెట్‌ను సమర్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ ప్రభుత్వం 2.0 యొక్క చివరి, పూర్తి బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. 2024లో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నందున ఈ బడ్జెట్ దేశానికే ప్రత్యేకంగా నిలవబోతోంది. ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య రంగంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరోగ్య శాఖలో అనేక కొత్త పనులు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మెడికల్ కాలేజీ ల్యాబ్ ఏర్పాట్లు..
ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలు అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ సమావవేశాల్లో స్పష్టం చేశారు. అందుకే కొత్త మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పాటు వైద్య కళాశాల్లో మరిన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి కొత్త యంత్రాలను తీసుకురానున్నారు. తద్వారా భారత దేశంలోనే ఎలాంటి వ్యాధులకు అయినా విజయవంతంగా చికిత్స చేయవచ్చు.
2047లో రక్తహీనతకు ముగింపు..
2027 నాటికి రక్తహీనత అనే వ్యాధిని పూర్తిగా తరిమికొడతామని 2023 బడ్జెట్‌లో స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం చాలా మంది రక్తం అందక మరణిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అలాగే పిల్లల్లో కూడా రక్తహీనత తగ్గించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. 2047 నాటికి పిల్లల్లో రక్తహీనతను పూర్తిగా అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
స్వచ్ఛమైన నీరు, ఆహారానికి ప్రాధాన్యత..
మనిషికి పరిశుభ్రమైన నీరు, ఆహారం చాలా ముఖ్యమని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ చాలా ప్రత్యేకమైందని వివరించారు. అందుకే బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
మనుషులు మ్యాన్‌హోల్‌లోకి ప్రవేశింకుండా చర్యలు..
బడ్జెట్‌లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. మ్యాన్‌హోల్స్‌కు సంబంధించి మోడీ సర్కార్ భారీ నిర్ణయం తీసుకుంది. 2023 బడ్జెట్‌లో ఇప్పుడు మ్యాన్‌హోల్స్‌లోకి మనుషులు ప్రవేశించరాదని స్పష్టం చేసింది. డ్రైనేజీ క్లీనింగ్స్ కు కేవలం యంత్రాలను మాత్రమే వినియోగించాలని వివరించింది.
2023 బడ్జెట్‌లో తృణ ధాన్యాల ప్రచారం
2023 బడ్జెట్ లో తృణ ధాన్యాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మొగ్గు చూపింది. బడ్జెట్‌లో ముతక ధాన్యాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. లేకర్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ కాలేజీగా మార్చాలనే చర్చ కూడా జరిగింది.
220 కోట్ల మందికి కరోనా టీకాలు..
కరోనా వైరస్ ను నివారించడానికి ఇప్పటి వరకు 220 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ప్రభుత్వం అందించిందని కేంద్రమంత్రి తెలిపారు.
Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
Breaking News Live Telugu Updates: అమరావతిపై సుప్రీంలో విచారణ జులై 11కి వాయిదా
AP CM వైఎస్ జగన్ ను మోసం చేసినవాళ్లు కనుమరుగు అయ్యారు: మంత్రి నాగార్జున
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్
UPI Payments Via PPI: యూపీఐ యూజర్లకు అలర్ట్! ఇకపై ఆ లావాదేవీలపై ఏప్రిల్ 1 నుంచి ఫీజు!
Prashanth Reddy: ఆరుగురు మోడీలు ప్రజల డబ్బులు కాజేసి విదేశాల్లో తలదాచుకున్నారు: మంత్రి ప్రశాంత్ రెడ్డి