అన్వేషించండి

UN - Taliban: ఐక్యరాజ్య సమితికే షాక్ ఇచ్చిన తాలిబన్లు, మహిళా ఉద్యోగులపై నిషేధం

UN - Taliban: అఫ్గనిస్థాన్‌లో ఐక్యరాజ్య సమితికి చెందిన మహిళా ఉద్యోగులపై నిషేధం విధించారు.

UN - Taliban:


మహిళా ఉద్యోగులపై ఆంక్షలు..

అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళలపై ఆంక్షలు రెట్టింపయ్యాయి. యూనివర్సిటీల్లోకి అనుమతి లేదంటూ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకుంది తాలిబన్ ప్రభుత్వం. ఇదొక్కటే కాదు. ప్రతి విషయంలోనూ వాళ్లపై ఆంక్షల్ని కఠినతరం చేస్తూ వస్తోంది. ఇటీవల మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో ఐక్యరాజ్య సమితి సంస్థకు చెందిన మహిళా ఉద్యోగులపై నిషేధం విధించింది. వాళ్లు పని చేయడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది. అఫ్గనిస్థాన్‌లోని నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో ఈ బ్యాన్ విధించింది తాలిబన్ ప్రభుత్వం. దీనిపై ఐరాస తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫిమేల్ స్టాఫ్ లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం కష్టం అని వెల్లడించింది. అయితే...దీనిపై ఇంకా తాలిబన్ ప్రభుత్వం స్పందించలేదు. కేవలం ఓ ప్రావిన్స్‌కు మాత్రమే ఈ ఆంక్షలు పరిమితం చేస్తారా..? లేదంటే దేశవ్యాప్తంగా ఇదే అమలు చేస్తారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. నిజానికి గతేడాదే తాలిబన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. NGOల్లో పని చేసే మహిళా ఉద్యోగులందరిపైనా ఆంక్షలు విధించింది. అప్పటికి ఐరాస మహిళా ఉద్యోగులను టార్గెట్ చేయలేదు. అయితే...ఐక్యరాజ్య సమితి మాత్రం తమనూ టార్గెట్ చేస్తారని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఓ ప్రావిన్స్‌లో నిషేధం విధించారు తాలిబన్లు. ఈ నిర్ణయంపై స్పందించిన  యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిర్ణయాలను సహించేదే లేదని తేల్చి చెప్పారు. 

"అఫ్గనిస్థాన్‌లో మా కార్యకలాపాలు విస్తృతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా నిషేధించడం సరికాదు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న స్పష్టత లేదు. ఇందుకోసమే తాలిబన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. లైఫ్ సేవింగ్ ఆపరేషన్స్‌లో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకం. వాళ్లపై నిషేధం విధించడాన్ని ఖండిస్తున్నాం. "

- ఐక్యరాజ్యసమితి ప్రతినిధి 

మహిళలపై దాడులు..

అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళలు నరకం చూస్తున్నారు. వాళ్లపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా కట్టడి చేస్తున్నారు. షరియా చట్టాన్ని అమలు చేస్తూ...కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి బదక్షన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఫైజాబాద్‌లోని ఓ గ్రౌండ్‌లో 11 మందిని ప్రజలందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టినట్టు తాలిబన్ సుప్రీం కోర్టు వెల్లడించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారన్న ఆగ్రహంతో బహిరంగంగానే తాలిబన్లు వాళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. అంతకు ముందు 16 మందిని కూడా ఇదే కారణంతో కొట్టినట్టు సుప్రీం కోర్టు తెలిపింది. నిజానికి...అక్కడ ఇలా శిక్ష విధించడం చాలా సాధారణమైపోయింది. ఏ తప్పు చేసినా సరే...నేరుగా వీధుల్లోకి తీసుకొచ్చి అందరి ముందు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకూ రకరకాల నేరాలు చేశారన్న కారణంగా 250 మందిని ఇలా కొట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. తాలిబన్ల ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా...వాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. షరియా చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు.

Also Read: Kichcha Sudeep Threat: కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ, ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ వార్నింగ్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Gas Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన
America Escort Oil Tanker: హర్మూజ్‌లో క్రూడాయిల్ ట్యాంకర్లకు US నేవీ ఎస్కార్ట్ చేస్తోందా? వైట్‌హౌస్ యూటర్న్, ఇరాన్ ఆగ్రహం
హర్మూజ్‌లో క్రూడాయిల్ ట్యాంకర్లకు US నేవీ ఎస్కార్ట్ చేస్తోందా? వైట్‌హౌస్ యూటర్న్, ఇరాన్ ఆగ్రహం
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
LPG Shortage: ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?
ఇరాన్‌లో యుద్ధం మన వంటింట్లో బాంబ్.. LPG కొరత కమ్మేస్తోందా..?

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget