By: ABP Desam | Updated at : 28 Mar 2023 02:11 PM (IST)
ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో అతీక్ అహ్మద్ దోషి
Umesh Pal Case Verdict : ఉత్తరప్రదేశ్‌లో పేరొందిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్.. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో దోషిగా తేల్చింది ప్రజాప్రతినిధుల కోర్టు. ఆయనకు జీవిత ఖైదు విధించింది. ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసులో ప్రయాగ్‌రాజ్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువరించింది. 17 ఏళ్ల నాటి ఈ కిడ్నాప్ కేసులో మాఫియా అతిక్ అహ్మద్ , అతని సోదరుడు సహా 10 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. మంగళవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు వెలువరించింది. 2005లో జరిగిన రాజుపాల్ హత్య కేసులో కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్ హత్యకు అహ్మద్, అష్రఫ్‌లు కూడా కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
బీఎఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అతీక్ అహ్మద్
బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకేసులో ప్రధాన సాక్షి ఉమేష్‌పాల్‌కు సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో 2006 ఫిబ్రవరి 28న అతిక్ అహ్మద్, అష్రఫ్ ఉమేష్ పాల్‌ను కిడ్నాప్ చేశారు. ఉమేష్ పాల్‌ను కొట్టి, అతని కుటుంబంతో కలిసి చంపేస్తానని బెదిరించి, కోర్టులో బలవంతంగా అఫిడవిట్ దాఖలు చేశారు. 2007లో మాయావతి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జూలై 5, 2007న, ఉమేష్ పాల్ అతిక్ మరియు అష్రఫ్‌తో సహా ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసుల విచారణలో మరో ఆరుగురి పేర్లు తెరపైకి వచ్చాయి. అతిక్, అష్రఫ్ సహా 11 మందిపై కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009లో ప్రారంభమైంది. ప్రాసిక్యూషన్ నుంచి అంటే ప్రభుత్వం తరఫున మొత్తం 8 మంది సాక్షులను హాజరుపరిచారు. ఈ కేసులో 11 మంది నిందితుల్లో అన్సార్ బాబా అనే నిందితుడు చనిపోయాడు. అతీక్, అష్రఫ్ సహా మొత్తం 10 మంది నిందితులపై కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది.
మాఫియా డాన్ గా పేరు తెచ్చుకున్న అతీక్ అహ్మద్
2019 జూన్ నుంచి సబర్మతి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైశ్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతన్ని జైలుకు తరలించారు.జైలులో ఉన్న అతిక్ అహ్మద్ ను ఈ కేసు తీర్పు కోసం ఉత్తరప్రదేశ్‌కు తీసుకువచ్చారు. అతిక్ అహ్మద్‌పై సుమారు వంద క్రిమినల్ కేసులు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ పాల్ హత్య కేసులో కూడా శిక్ష ఖరారయింది. గ్యాంగ్‌స్టర్ వికాశ్ దూబే తరహాలోనే అతిక్ అహ్మాద్‌ను హతమారుస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. అందుకే తాను గుజరాత్ జైల్లోనే ఉంటానని.. తనకు విధించే శిక్ష వీడియో కాన్ఫరన్స్ ద్వారా విధించాలని ఆయన కోరారు.అయితే కోర్టు ఆయన అభ్యర్థనను పట్టించుకోలేదు. జీవితాంతం జైల్లో ఉండేలా తీర్పు చెప్పింది.
ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!
SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!