అన్వేషించండి
Advertisement
Ukraine Russia War: పుతిన్‌ను ఆపండి ప్లీజ్- ప్రపంచం ప్రమాదంలో ఉంది: ఉక్రెయిన్
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా తలపెట్టిన యుద్ధాన్ని ఆపాలని ప్రపంచాన్ని ఆ దేశం కోరింది. ఐరాస తగిన చర్యలు చేపట్టాలని అత్యవసర సమావేశంలో ఉక్రెయిన్ వేడుకుంది.
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటుంటే రష్యా దూకుడుగా యుద్ధం ఆరంభించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా చర్యలపై ఉక్రెయిన్ దీటుగా స్పందించింది. ఉక్రెయిన్‌పై పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ఆరంభించారని పేర్కొంది.
" ఉక్రెయిన్‌లో పుతిన్ పూర్తిస్థాయి యుద్ధాన్ని ఆరంభించారు. కానీ ఉక్రెయిన్ బదులిస్తుంది. విజయం సాధిస్తాం. శాంతియుత ఉక్రెయిన్ నగరాల్లో బాంబుల మోత మోగుతోంది. ప్రపంచం.. పుతిన్‌ను ఆపాలి. ప్రపంచ దేశాలు స్పందించాల్సిన సమయం ఇదే.
ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలి. రష్యాపై తగిన చర్యలు చేపట్టాలి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సామగ్రిని పంపాలి. ఆర్థిక, మానవతా సాయం చేయాలి. ఐరోపా, ప్రపంచ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. " - ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి

ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలి. రష్యాపై తగిన చర్యలు చేపట్టాలి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సామగ్రిని పంపాలి. ఆర్థిక, మానవతా సాయం చేయాలి. ఐరోపా, ప్రపంచ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. "
ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాలి. రష్యాపై తగిన చర్యలు చేపట్టాలి. ఉక్రెయిన్‌కు ఆయుధాలు, సామగ్రిని పంపాలి. ఆర్థిక, మానవతా సాయం చేయాలి. ఐరోపా, ప్రపంచ భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. " - ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి
యుద్ధం ఆపండి
రష్యా చర్యలను ఉక్రెయిన్.. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశంలో కూడా ఖండించింది. ప్రపంచ దేశాలు కలుగుజేసుకొని యుద్ధం ఆపేలా చేయాలని వేడుకుంది.
" రష్యా అధ్యక్షుడు బహిరంగంగా యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధాన్ని ఆపాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితికి ఉంది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాలని అందర్నీ కోరుకుంటున్నాను. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నామని పుతిన్ చేసిన ప్రసంగాన్ని మీరు కూడా వినండి. "
- ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి
బాంబుల మోత
ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగుతున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన వెంటనే రాజధాని కీవ్‌లో పేలుడు జరిగింది. తూర్పున ఉన్న పోర్ట్ సిటీ అయిన మారియూపోల్లోనూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
సినిమా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion