Ukraine Russia War: 'దేశం కన్నా ప్రాణం ఎక్కువేం కాదు'- సరెండర్ కాలేదని ఉక్రెయిన్ జవాన్లను చంపిన రష్యా బలగాలు
ఉక్రెయిన్‌కు చెందిన 13 మంది సైనికులను తమకు సరెండర్ కాలేదని రష్యా బలగాలు కాల్చి చంపాయి. వీరికి 'హీరో ఆఫ్ ఉక్రెయిన్' అనే అవార్డు ప్రకటించారు అధ్యక్షుడు జెలెన్‌స్కీ.
ఉక్రెయిన్‌ను అన్ని వైపుల నుంచి రష్యా సేనలు చుట్టుముట్టాయి. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా బలగాలు చొరబడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. తొలిరోజు యుద్ధంలో 137 మంది వరకు ఉక్రెయిన్ సైనికులు మృతి చెందినట్లు అధ్యక్షుడు ప్రకటించారు. స్నేక్ ద్వీపంలో తమకు లొంగేందుకు ససేమిరా అన్న 13 మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు హతమార్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Russia treacherously attacked our state in the morning, as Nazi Germany did in #2WW years. As of today, our countries are on different sides of world history. 🇷🇺 has embarked on a path of evil, but 🇺🇦 is defending itself & won't give up its freedom no matter what Moscow thinks.
— Володимир Зеленський (@ZelenskyyUa) February 24, 2022
దేశం కోసం
స్నేక్ ఐల్యాండ్‌ను కాపాడేందుకు ఆ ప్రాంతంలో సైనిక శిబిరం ఏర్పాటు చేసింది ఉక్రెయిన్. ఆ శిబిరంలోకి చొరబడిన రష్యా దళాలు.. వారిని ఆయుధాలు విడిచిపెట్టి సరెండర్ కావాలని కోరాయి. అయితే ఆ శిబిరంలో సైనికులు మాత్రం సరెండర్ అయ్యేందుకు ససేమిరా అన్నారు. దీంతో వారిని రష్యా బలగాలు కాల్చి చంపాయి.
హీరో ఆఫ్ ఉక్రెయిన్