(Source: ECI/ABP News/ABP Majha)
Zelensky Car Accident: జెలెన్స్కీకి తప్పిన ప్రమాదం, యాక్సిడెంట్‌లో స్పల్ప గాయాలు
Zelensky Car Accident: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ రోడ్ యాక్సిడెంట్‌లో స్వల్పంగా గాయపడ్డారు.
Ukriane President Zelensky Car Accident:
ఇజియంకు వెళ్లి వస్తుండగా...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రమాదానికి గురయ్యారు. ఓ ప్యాసింజర్ కార్ జెలెన్‌స్కీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఉక్రెయిన్ మీడియా పోర్టల్ కీవ్ ఇండిపెండెంట్...ఈ విషయాన్ని వెల్లడించింది. జెలెన్స్‌కీకి పెద్దగా గాయపడలేదని, ఆయన సురక్షితంగానే ఉన్నారని ఓ ప్రతినిధి ప్రకటించారు. ఫేస్‌బుక్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే...వైద్యులు జెలెన్‌స్కీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతర్గతంగా ఏమైనా గాయాలయ్యాయా అని టెస్ట్ చేశారు. జెలెన్‌స్కీ కార్ డ్రైవర్‌కు కూడా పరీక్షలు చేశారు. రష్యా దళాల నుంచి స్వాధీనం చేసుకున్న ఇజియం నగరానికి వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ అయింది. అయితే...ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న అంశంపై విచారణ చేపడతామని జెలెన్‌స్కీ ప్రతినిధి స్పష్టం చేశారు. కీవ్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం జరగటం అనుమా నాలకు తావిస్తోందని ఉక్రెయిన్ ఉన్నతాధికారులు అంటున్నారు. ఎలాంటి గాయాలు కాకపోవటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పట్టు కోల్పోతున్న రష్యా సైన్యం..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. దాదాపు ఆర్నెల్లుగా రష్యా ఆక్రమణ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ యుద్ధ వ్యూహాలు మార్చి రష్యా సైన్యం ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గిస్తోంది. తూర్పున ఉన్న ప్రాంతాలపై రష్యా సైన్యం పట్టు సడలుతోంది. తమకు ఎంతో వ్యూహాత్మకంగా భావించే ఇజియం నగరాన్ని ఉక్రెయిన్ సైన్యం ఇప్పటికే అధీనంలోకి తీసుకుంది. వీరి ధాటిని తట్టుకోలేక రష్యా సైన్యం తూర్పు ప్రాంతాలను వదిలేసి వెళ్తోంది. ఖార్కివ్ రీజియన్‌లోనూ ఉక్రెయిన్ సైన్యం పట్టు సాధిస్తోందని ఇటీవలే జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో ఆయన కారు ప్రమాదానికి గురి కావటం చర్చకు దారి తీసింది.
జెలెన్‌స్కీకి మద్దతు తెలిపిన భారత్..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఆర్నెల్లు అవుతోంది. ఇంకా ఈ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఐక్యరాజ్య సమితి ఎన్నో సార్లు రష్యాను యుద్ధం ఆపేయాలని సూచించినా...పుతిన్ మాట వినలేదు. ఐరాస సభ్య దేశాలు రష్యాకు వ్యతిరేకంగా నినదిస్తున్నా...భారత్ మాత్రం ఇన్నాళ్లూ మౌనంగా ఉంది. గతంలో నిర్వహించిన ఓటింగ్‌లోనూ పాల్గొనలేదు. అయితే...తొలిసారి భారత్..రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లో ఈ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిచేందుకు అనుకూలంగా నిలిచింది భారత్. ఆర్నెల్ల క్రితం రష్యా...ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన నాటి నుంచి భారత్ తటస్థ వైఖరినే అవలంబిస్తోంది. ఈ సారి మాత్రం చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చైనా ఈ ఓటింగ్‌కు దూరంగా ఉంది. ఉక్రెయిన్ 31వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఐరాస భద్రతా మండలి సమావేశంలో...యుద్ధ పరిస్థితులను సమీక్షించారు. ఈ సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీనిపై రష్యా నిరసన వ్యక్తం చేసింది. ప్రొసీజరల్ ఓటింగ్‌ను కోరింది. ఫలితంగా...మండలి ఓటింగ్ నిర్వహించింది. మొత్తం 15 దేశాల్లో 13 దేశాలు జెలెన్‌స్కీ ప్రసంగానికి అనుకూలంగా ఓటు వేశాయి. రష్యా మాత్రమే వ్యతిరేకించింది. ఆ తరవాత జెలెన్‌స్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
Also Read: Hyderabad Gang Rape: హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్ రేప్! ఓయో రూంలోనే వదిలివెళ్లిన యువకులు