Viral News: బార్‌లో రెచ్చిపోయిన మహిళలు- చావగొట్టి, చెవులు మూశేశారు!

Viral News: ఓ వ్యక్తిని ఇద్దరు మహిళలు చితక్కొట్టిన వీడియో వైరల్ అయింది.

FOLLOW US: 

Viral News: "నిద్ర లేచింది మహిళా లోకం- దద్దరిల్లింది పురుష ప్రపంచం" ఎన్‌టీఆర్, సావిత్రి నటించిన 'గుండమ్మ కథ' చిత్రంలో ఈ పాట సూపర్ ఫేమస్ అయింది. ఇప్పటికీ ఓల్డ్ హిట్స్‌లో ఈ పాట గ్యారెంటీ ఉంటుంది. అయితే సడెన్‌గా ఈ పాట ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? ఈ మధ్య పబ్‌లో ఇద్దరు మహిళలు ఓ వ్యక్తిని పిచ్చ కొట్టుడు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. 

ఇదీ జరిగింది

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి పబ్‌ వెలుపల ఓ వ్యక్తిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు. అందులోని ఓ మహిళ మరింత రెచ్చిపోయింది. అక్కడ పూల కుండీలతో అతడి తలపై కొట్టింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

ఇంతలో బౌన్సర్లు జోక్యం చేసుకున్నారు. మహిళల నుంచి ఆ వ్యక్తిని విడిపించారు. ఇద్దరినీ చెరో వైపునకు తీసుకెళ్లి.. మహిళలకు సర్ది చెప్పారు. అయితే అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్‌ ఫోన్లలో ఇదంతా రికార్డు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అరెస్ట్

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆ వ్యక్తిని కొట్టిన ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. బాధిత వ్యక్తికి ఏమైంది, ఆసుపత్రికి తరలించారా అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే ఆ వ్యక్తిని మహిళలు ఎందుకు కొట్టారో ఇంకా తెలియలేదు. 

ఈ వీడియో కింద నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. ఆ మహిళలు ఫుల్‌గా తాగి అతనిపై దాడి చేశారని కొందరు అంటుంటే, మరి కొందరు మహిళలపై ఆ వ్యక్తి అభ్యంతరకంగా ప్రవర్తించి ఉంటాడని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Meghalaya: BJP నేత ఫాంహౌస్‌లో సెక్స్ రాకెట్- 73 మంది అరెస్ట్!

Also Read: Monkeypox Cases India: దేశంలో మంకీపాక్స్ డేంజర్‌బెల్స్- దిల్లీలో తొలి కేసు నమోదు!

Published at : 24 Jul 2022 04:27 PM (IST) Tags: Viral Two Women Thrash Man Pub in Lucknow

సంబంధిత కథనాలు

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

Balineni Srinivas Reddy : పవన్ చేనేత ఛాలెంజ్ స్వీకరించిన బాలినేని, ట్వీట్ తో రిప్లై

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

National Handloom Day : చేనేత కళాకారులకు ఎప్పుడూ అండగా నిలుస్తాం - సీఎం జగన్

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది