News
News
వీడియోలు ఆటలు
X

TTD News: ఏడుకొండల్లో కొనసాగుతున్న భక్తుల‌ రద్దీ - సర్వదర్శనానికి 34 గంటల సమయం

TTD News: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వేసవి సెలవులు కావడంతో.. సర్వదర్శనానికి 34 గంటల సమయం పడుతోంది. 

FOLLOW US: 
Share:

TTD News: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనార్ధం భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో తిరుమలలో కిలో‌మీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహించే క్రమంలో గురువారం మధ్యాహ్నం నుంచి స్వామి వారికి పూలంగి సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తొంది. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. దీనినే పూలంగి సేవ అని కూడా పిలుస్తారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా పూలతో అలంకరించిన స్వామి వారు.. భక్తులను మంత్రముగ్ధులను చేస్తారు. బుధవారం రోజు 79,207 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 41,427 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, స్వామి వారి హుండీ ఆదాయం 3.19 కోట్లు రూపాయలు ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి బయట క్యూలైన్లలో బాట గంగమ్మ ఆలయం వరకూ భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కోసం దాదాపుగా 36 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది.

బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాత స్తోత్రం

శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు.‌. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుగుతుంది. దీనికే కైంకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు.

తోమాల సేవ ప్రారంభం

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఆ తర్వాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించి వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరిస్తారు. అటు పిమ్మట జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం చేస్తారు. 

శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్

శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధాక్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్టుకు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి, శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. ఆ తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

బెల్లంతో కలిపిన నువ్వుల పిండి నైవేద్యం

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. ఆ తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్ర నామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన జరిపిస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేధ్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించిన అనంతరం సర్కారు వారి హారతి జరిపి విఐపి బ్రేక్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయినా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు.

అనంతరం స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను నిర్వహిస్తారు. అటు తరువాత డోలోత్సవం సేవను అద్దాల మండపంలో నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను జరిపిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం పూలంగి సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను చేస్తారు. 

Published at : 18 May 2023 09:35 AM (IST) Tags: TTD Updates Tirumala Hundi Income Tirumala News Tiruala Rush TTD New Updates

సంబంధిత కథనాలు

Vande Bharat Express: సికింద్రాబాద్ -నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలు, త్వరలోనే అందుబాటులోకి!

Vande Bharat Express: సికింద్రాబాద్ -నాగ్ పూర్ మధ్య వందే భారత్ రైలు, త్వరలోనే అందుబాటులోకి!

World No Tobacco Day: ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న పొగాకు వాడకం, ఎందుకో తెలుసా?

World No Tobacco Day: ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న పొగాకు వాడకం, ఎందుకో తెలుసా?

Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన

Tirumala News: తిరుమలలో ఆ వాహనాలు నిషేధం, అడిషనల్‌ ఎస్పీ మునిరామయ్య కీలక ప్రకటన

2000 Notes: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?

2000 Notes: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?

Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా

Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా

టాప్ స్టోరీస్

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ