తూచ్ నేను అలా అనలేదు
పార్టీకి వ్యతిరేకంగా అసహన వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖండించారు. తాను అన్నట్లుగా కొన్ని మీడియా సంస్థలే ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. తాను పార్టీకి సంబంధించి ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పార్టీ నాయకత్వాన్ని కానీ, అధ్యక్షుడ్ని గానీ ధిక్కరించబోనని చెప్పారు. బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడే ఉంటానని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో తాను ప్రెస్ మీట్ పెట్టలేదని, పార్టీ కోసం తాను పదేళ్లుగా పని చేస్తున్నందున కీలకమైన పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు. అయితే పార్టీలో పదవులు కోరుకోవడం తప్పుకాదన్నారు. గత రెండు నెలలుగా దుబ్బాక నియోజకవర్గంలోనే ఉన్నానని, అక్కడ నిధులు కోసం వచ్చానని రఘునందన్ చెప్పారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హామీలు నెరవేరిస్తే ఆ ప్రచారం ఎందుకు?
వైసీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీలను దాదాపు 99 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేశామని, కొత్త సంక్షేమ పథకాలు సైతం తీసుకొచ్చామని చెప్పడాన్ని జనసేన నేతలు తప్పుపడుతున్నారు. ఒకవేళ సీఎం జగన్ ఈ 4 ఏళ్ల పాలనతో హామీలు 99 శాతం వరకు నెరవేర్చడం నిజమైతే.. స్పందన జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం కార్యక్రమాలతో పనేంటని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టార్గెట్ ఫిక్స్
పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. హైదరాబాద్ నుంచే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమవారం తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, బిసి కుల వృత్తుల ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫెరెన్స్ లో సమీక్షించారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. పోడు భూముల పట్టా పంపిణి కార్యక్రమాన్ని మరో 4 రోజుల్లో పూర్తి చేయాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల చొప్పున గృహలక్ష్మి పథకం క్రింద లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
చంద్రయాన్ 2 ఆగిన చోటు నుంచే చంద్రయాన్ 3
ఎక్కడైతే చంద్రయాన్ 2 ఆగిపోయింది సరిగ్గా అక్కడ నుంచే చంద్రయాన్ 3 జర్నీ మొదలు కాబోతుంది. ఇస్రో చీఫ్ సోమనాథ్ చంద్రయాన్ 3 డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. జులై 13 న ఫస్ట్ డేట్ గా చెప్పిన ఇస్రో అప్పటి నుంచి 19వరకూ సరైన టైమ్ చూసి చంద్రయాన్ 3 ని ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రాయల్‌పై మోజు
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 జూన్‌కు సంబంధించిన విక్రయాల లెక్కలను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది. అయితే ఎగుమతుల్లో మాత్రం కంపెనీ పనితీరు ఆశాజనకంగా లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ గత నెలలో 77,109 యూనిట్ల విక్రయంతో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2022 రెండో త్రైమాసికంలో విక్రయించిన 1,87,205 యూనిట్ల నుంచి 2023 రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం అమ్మకాలు 22 శాతం పెరిగి 2,27,706 యూనిట్లకు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మూడు రోజులు వర్షాలే
ఈ రోజు ఆవర్తనం నైరుతి, పరిసరాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలో మీటర్ల నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల రేపు, ఎల్లుండి అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణ నీట్ అభ్యర్థుల జాబితా విడుదల
నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)లో రాష్ట్రానికి చెందిన నీట్ అభ్యర్థుల వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం జులై 3న విడుదలచేసింది. నీట్ ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి రాష్ట్రానికి అందింది. నీట్ పరీక్ష దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చేసిన నమోదు ఆధారంగానే ఈ జాబితా ప్రకటించారు. జామితాలో మొత్తం 44,629 మంది విద్యార్థుల పేర్లు, వారు సాధించిన ర్యాంకును ఉంచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ సూపర్ రికార్డు
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ విడుదలైంది. ఈసారి టోర్నీలో మొదటి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అక్టోబర్ 8వ తేదీన చెన్నైలో ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. భారత జట్టు ఆటగాళ్ల రికార్డు ప్రపంచ కప్‌లో చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. ఇప్పటివరకు భారత్ తరఫున వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఈ విషయంలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కావాలయ్యా కావాలయ్యా
రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘జైలర్’ అప్‌డేట్స్ మెల్లగా మొదలయ్యాయి. మొదటిగా ఇందులో ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. అదే ‘కావాలా’. వినడానికి తెలుగు పదంలా ఉందనుకుంటున్నారా? మీరు విన్నది కరెక్టే. 70 శాతం తమిళం, 30 శాతం తెలుగులో ఈ పాట ఉండాలని పాట ప్రోమోలో నెల్సన్... సంగీత దర్శకుడు అనిరుథ్‌ను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
స్టాలిన్ నేడు డిశ్చార్జ్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆస్పత్రిలో చేరారు. జీర్ణకోశ వ్యాధి కారణంగా ఆయన క్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ముఖ్యమంత్రి స్టాలిన్ కు వైద్యులు ఎండోస్కోపీ చికిత్స అందిస్తున్నారని, చికిత్స అనంతరం ఇవాళ (జులై 4వ తేదీ) ఉదయం డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది. రెగ్యులర్ చెకప్ లో భాగంగా సీఎం స్టాలిన్ తమ ఆస్పత్రిలో చేరారని అపోలో హాస్పిటల్ ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి