రకరకాల నమ్మకాలు హిందూ మతంతో ముడి పడి ఉన్నాయి. మతం చెప్పింది నమ్మే వారు చాలా మంది ఉంటారు. ఈ నమ్మకాలను పుక్కిటి పురాణాలుగా కొట్టి పడేసే వారు కూడా ఉన్నారు. పురాణాలు, వేదాల్లో ఉన్న నమ్మకాల గురించిన అవగాహన కలిగి ఉండాలి. అలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం.గర్భిణుల ను పాము కాటెయ్యదని ఒక నమ్మకం చాలా ప్రచారంలో ఉంది. గర్భిణి ని చూడగానే పాము చూపుకోల్పొతుందని కూడా నమ్ముతారు. గర్భం దాల్చిన వారి దగ్గరకు పాము వెళ్లదని అంటుంటారు. ఇది ఎందుకు? ఎలా ? దీని వెనుకున్న కథ కమామిషూ ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. బ్రహ్మవైవర్తన పురాణంలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.


Also Read: జూలై 4 రాశిఫలాలు, ఈ రాశులవారి కెరీర్లో అద్భుతమైన ముందడుగు పడుతుంది!


గర్భవతిని పాము ఎందుకు కాటెయ్యదు?


పాముకు కొన్ని ప్రత్యేక ఇంద్రియాలను సహజంగా కలిగి ఉంటుంది. వాటి ద్వారా స్త్రీ గర్భవతి అవునో కాదో పాములు సులభంగా గుర్తిస్తాయట. గర్భవతుల శరీరంలో జరిగే మార్పులను పాములు చాలా సులభంగా గుర్తించగలుగుతాయని చెబుతారు.  గుర్తిస్తాయి నిజమే కానీ గుర్తించినంత మాత్రాన గర్భిణులను పాము ఎందుకు కాటెయ్యదు అనేది ప్రశ్న. గర్భవతులను పాములు ఎందుకు కాటెయ్యవనే ప్రశ్నకు సమాధానం బ్రహ్మవైవర్తన పురాణంలో దొరకుతుంది.  ఒకప్పుడు ఓ గర్భిణి  శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేస్తుంది. ఆమె పూర్తిగా తపస్సులో మునిగి ఉండగా రెండు పాముల కారణంగా ఆమెకు తపోభంగం కలిగింది. ఆమె తపస్సుకు భంగం వాటిల్లినందుకు ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ సర్పజాతికి గర్భిణి ని చూసిన వెంటనే అంథత్వం కలిగే విధంగా శాపంపెట్టిందట.  అప్పటి నుంచి గర్భిణి ని చూసిన పాములు గుడ్డివి అయిపోతాయనే కథ ప్రాచూర్యంలో ఉంది. గర్భిణులకు కలలో కూడా పాము కనిపించదని కూడా చెబుతారు. ఆ స్త్రీ ప్రసవించిన బిడ్డ శ్రీగోగా జీ దేవ్, శ్రీతేజాజీ దేవ్, జహర్వీర్ అనే పేర్లతో భవిష్యత్తుల ప్రసిద్ధి చెందినట్టు కూడా కథ ఒకటి ఉంది.


శాస్త్రీయ కోణం


గర్భిణి ని పాము కాటు వెయ్యకపోవడానికి కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. గర్భిణి శరీరంలో హర్మోన్ల స్వరూపం భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆమె శరీరంలో కొన్ని ప్రత్యేక మార్పులు జరుగుతాయి. అందుకే గర్భస్త సమయంలో స్త్రీ స్వభావం, ఆసక్తి, రంగు రూపుల్లో చాలా మార్పులు వస్తాయి. ఈ హార్మోన్ల మార్పును పాములు త్వరగా గుర్తిస్తాయేమో అనే ఇక వాదన ఉంది. ఈ విషయానికి సంబంధించిన దృవీకరణలు అందుబాటులో లేవు.


ఈ విషయాలు గుర్తుంచుకోవాలి



  • ఎవ్వరూ పాములను చంపకూడదు. గర్భిణులు అసలు చంపకూడదు.

  • సతానతన ధర్మం పామును చంపడం పాపంగా భావిస్తుంది. ఆ కర్మ ఫలితం ఎన్నోజన్మల పాటు వెంటాడుతుందని అంటారు.

  • గర్భిణులను పాములు కాటెయ్యవనే విషయాన్ని దృవీకరించే పరిశోధనలు జరగలేదు


Also read : Dreams: కాళ్లను పట్టుకున్నట్లు కల వచ్చిందా? అయితే, జరిగేది ఇదే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.